ద్వాదశ జ్యోతిర్లింగాలు
శైవులు శివున్ని
మూర్తి రూపములో మరియు లింగరూపములోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా
భావిస్తారు. ప్రతి లింగములో శివుని యొక్క జ్యోతి స్వరూపము వెలుగుతుంటుందని శైవుల నమ్మకం.
అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా
అనాది నుండి భావించబడుచున్నది. అవి
రామనాథస్వామి లింగము
- రామేశ్వరము
మల్లికార్జున లింగము
- శ్రీశైలము
భీమశంకర లింగము
- భీమా శంకరం
ఘృష్టీశ్వర లింగం
- ఘృష్ణేశ్వరం
త్రయంబకేశ్వర లింగం
- త్రయంబకేశ్వరం
సోమనాథ లింగము
- సోమనాథ్
నాగేశ్వర లింగం
- దారుకావనం (ద్వారక)
ఓంకారేశ్వర-అమలేశ్వర
లింగములు - ఓంకారక్షేత్రం
మహాకాళ లింగం
- ఉజ్జయని
వైధ్యనాథ లింగం
- చితా భూమి (దేవఘర్)
విశ్వేశ్వర లింగం
- వారణాశి
కేదారేశ్వర - కేదారనాథ్
జ్యోతిర్లింగ స్త్రోత్రము
ఈ జ్యోతిర్లింగ
స్త్రోత్రాన్ని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని
భక్తుల నమ్మకము.
సౌరాష్ట్రే సోమనాథం
చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్
ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం
భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం
దారుకావనే
వారాణస్యాం తు
విశ్వేశం,
త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం
చ శివాలయే
ఏతాని జ్యోతిర్లింగాని
సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం
పాపం స్మరణేన వినశ్యతి.
జ్యోతిర్లింగాలు
సోమనాథుడు - -
విరవల్ రేవు,
ప్రభాస్ పట్టణము, సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్ - దీనిని ప్రభాస క్షేత్రము అంటారు.
చంద్రునిచే ఈ లింగము ప్రతిష్టింపబడినదని స్థలపురాణము.
మల్లికార్జునుడు
- శ్రీశైలము,
కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - ఇక్కడ కృష్ణానది
పాతాళగంగగా వర్ణింపబడినది. ఈ క్షేత్రము అష్టాదశ శక్తి పీఠములలో ఒక్కటి. ఆది శంకరాచార్యుడు
శివానందలహరిని ఇక్కడే వ్రాశాడు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబాదేవి.
మహాకాళుడు - (అవంతి)
ఉజ్జయిని,
మధ్యప్రదేశ్ - క్షిప్రానది ఒడ్డున ఉన్నది. ఈ నగరములో 7 సాగర తీర్థములు,
28 తీర్థములు, 84 సిద్ధ లింగములు, 30 శివలింగములు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు,
వందలాది దేవతా మందిరములు, జలకుండము ఉన్నవి.
ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు
- మామలేశ్వరము, మధ్య ప్రదేశ్ - నర్మద (రేవా) నదీతీరమున వెలసెను.
ఇక్కడ ఒకే లింగము రెండు బాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతున్నది.
అమ్మవారు అన్నపూర్ణ.
వైద్యనాథుడు (అమృతేశ్వరుడు)
- పర్లి (కాంతిపూర్),
దేవొగడ్ బీహార్ - బ్రహ్మ, వేణు, సరస్వతీ నదుల సమీపములో నున్నది. సహ్యాద్రి కొండల అంచునున్నది. అమృతమధనానంతరము
ధన్వంతరిని, అమృతమును ఈ లింగములో దాచిరనీ, స్పృశించిన భక్తులకు అమృతము లభించుననీ నమ్మకము.
భీమశంకరుడు - డాకిని, భువనగిరి
జిల్లా, పూనె వద్ద, మహారాష్ట్ర - చంద్రభాగ
(భీమ) నది ఒడ్డున, భీమశంకర పర్వతములవద్ద - త్రిపురాపుర సంహారానంతరము
మహాశివుడు విశ్రాంతి తీసికొన్న చోటు. అమ్మవారు కమలజాదేవి. శాకిని, ఢాకిని మందిరములు కూడ యున్నవి. మోక్ష కుండము, జ్ఙాన కుండము
ఉన్నవి.
రామేశ్వరుడు -
రామేశ్వరము,
తమిళనాడు - శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలము - కాశీ గంగా జలమును
రామేశ్వరమునకు తెచ్చి అర్చించిన తరువాత, మరల రామేశ్వరములోని ఇసుకను
కాశీలో కలుపుట సంప్రదాయము. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి.
నాగేశ్వరుడు (నాగనాథుడు)-
(దారుకావనము) ద్వారక వద్ద,
మహారాష్ట్ర - ఈ జ్యోతిర్లింగము ద్వారక, ఔధ్ గ్రామ్,
ఆల్మోరా (ఉత్తరప్రదేశ్) అను మూడు స్థానములలో ఉన్నట్లు చెబుతారు.
విశ్వనాథుడు -
వారణాసి,
ఉత్తరప్రదేశ్ - కాశి అని కూడ ప్రసిద్ధము - వరుణ, అసి నదులు గంగానదిలో కలిసే స్థానము - పరమపావన తీర్థము - ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి.
త్రయంబకేశ్వరుడు
- నాసిక్,
మహారాష్ట్ర - గౌతమీ తీరమున - ఇక్కడి లింగము చిన్న గుంటవలె కనిపించును,
అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల
ప్రతీకగా మూడు చిన్న (బొటనవేలివంటి) లింగములున్నవి. అమ్మవారు కొల్హాంబిక. గంగాదేవి
మందిరము కూడ ఉన్నది. కుశావర్త తీర్థము, గంగాద్వార తీర్థము,
వరాహ తీర్థము ముఖ్యమైనవి. 12 సంవత్సరములకొకమారు జరిగే సింహస్థపర్వము
పెద్ద పండుగ.
కేదారేశ్వరుడు
- హిమాలయాలలో,
గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్ - మందాకినీ నదీ
సమీపంలో- మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనమునకు తెరచి ఉంటుంది.
ఘృష్ణేశ్వరుడు
(కుసుమేశ్వరుడు) - వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర - (దేవగిరి లోనిదే జ్యోతిర్లింగమని కూడ చెప్పుదురు)
శివ క్షేత్రాలను ముఖ్యంగా మూడు విభాగాలుగా చేయవచ్చు:
(1) స్వయంభూ క్షేత్రాలు :: జ్యోతిర్లింగాలు, పంచభూత లింగాలి వంటివి.
(2) సిద్ధ క్షేత్రాలు :: మహర్షులు, దేవతలు, కపిల, అగస్త్యాది ఋషులుచే నలకొల్పబడినవి.
(3) మానవ పతిష్ఠిత క్షేత్రాలు :: చారిత్రకంగా ఎందరో రాజులు, మహాత్ములు శాస్త్ర మర్యాదలతో ప్రతిష్ఠించినవి.
పరమాత్మ తనంతతాను తన జ్యోతిర్మయస్వరూపంతో ప్రకటమైన జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత ప్రసిద్ధి చెందాయి. వాటిలో ప్రధానంగా పన్నెండింటిని పేర్కొన్నారు. ప్రసిద్ధ జ్యోతిర్లింగాలు -
సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |
ఉజ్జయిన్యాం మహాకాలమోంకారే పరమేశ్వరమ్ ||
కేదారం హిమవత్ప్రుష్ఠే డాకిన్యాం భీమశంకామ్ |
వారాణస్యాం చ విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే ||
వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే |
సేతుబంధే చ రామేశం ఘశ్మేశంచ శివాలయే ||
ద్వాదశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వపాప వినిర్ముక్తస్సర్వ సిద్ధిఫలం లభేత్ ||
అని 'శివ పురాణం' చెబుతున్నది.
ఈ పన్నెండే కాక, ఎన్నో జ్యోతిర్లింగాలు, ఉప జ్యోతిర్లింగాలు ఉన్నాయని కూడా శివ పురాణోక్తి.
అనుగ్రహాయ లోకానాం లింగాని చ మహేశ్వరః |
దధాతి వివిధాన్యత్ర తీర్థేచాన్యస్థలే తథా ||
మహేశ్వరుడు లోకాలను అనుగ్రహించడానికై ఈ భూలోకంలో తీర్థాలలో, అన్య స్థలాలలో వివిధ లింగ రూపాలతో ప్రకాశిస్తున్నాడు. జ్యోతిర్లింగ క్షేత్ర యాత్ర అత్యంతమహిమాన్వితం. జ్యోతిర్లింగ దర్శనం, అర్చనం జన్మసాఫల్యాలు. వీటిలో గంగాతీరంలోని కాశీక్షేత్రం అత్యంత ప్రధానం. వారణాసి, అవిముక్తం, మహా శ్మశానం, ఆనందవనం, రుద్రగేహం - వంటి అనేక నామాలు కలిగిన మహాక్షేత్రమిది.
1. సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ లోని 'విరవల్' దగ్గర ఉన్న ప్రభాస పట్టణం.
2. మల్లికార్జునుడు - ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లోని శ్రీశైల క్షేత్రం.
3. హిమాలయాలలో కేదరనాథ జ్యోతిర్లింగం.
4. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి విశ్వనాథ జ్యోతిర్లింగం.
5. మహారాష్ట్ర లోని నాసిక్ వద్ద త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం.
6. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల వద్ద ఘ్రుష్ణే (ఘుశ్మే) శ్వర జ్యోతిర్లింగం.
7. తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం.
8. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో మహాకాల జ్యోతిర్లింగం.
9. మధ్యప్రదేశ్ లోని కాండ్వాకు దగ్గరలో నర్మదానది ఒడ్డున ఉన్న 'మెర్టక్క' అనే చోట ఓంకారేశ్వర జ్యోతిర్లింగం.
10. మహారాష్ట్ర లోని బొంబాయి - పూణేల మధ్య ఉన్న నెరల్ అనే కత భీమశంకర జ్యోతిర్లింగం.
11. మహారాష్ట్రలోని పర్లి-వైద్యనాథ జ్యోతిర్లింగం. బీహార్లోని సంతలో పరగణాలోని చిత్తభూమి వద్ద ఉన్నదనికొందరి అభిప్రాయం.
12. నాగేశ్వర జ్యోతిర్లింగం - హిమాలయాలలో అర్మోరాకు దగ్గరలో ఉన్న 'జోగేశ్వర' క్షేత్రంలో ఉన్నాడని, ఇక్కడి దారుకావనమే తార్కాణం. కొందరు గుజరాత్ లోని ద్వారక దగ్గర ఉన్న 'నాగేశ్వర' క్షేత్రమని భావిస్తారు.
కైలాస మానస సరోవరం
ప్రస్తుత టిబెట్ లో ఉన్న మానససరోవర తీరాన కైలాస పర్వతం సాక్షాత్తు శివస్వరూపమే, బ్రహ్మాండాలకు ఆవల ఉన్న శివలోకం మహా కైలాసం. ఆ పరంధామము యొక్క లీలా విభూతి దేవ, ఋషులకు అందుబాటులో మానససరోవర తీరాన ఉన్నాడని పురాణ కథనం. అత్యంత క్లిష్టసాధ్యమైన కైలాసయాత్ర నేపాల్ నుండి వెళుతున్న వారి సంఖ్య కొన్ని ఏళ్ళై పెరిగింది.
హిమవత్పర్వత ప్రాంతాల మీదుగా 'ఓం' పర్వత దర్శనం వేస్తూ భారత ప్రభుత్వ నిర్వహణలో సుమారు నెలరోజులకు పైగా సాగే కైలాస యాత్ర ఒక దివ్యానుభూతి.
ఈ మార్గ మధ్యంలో జోగేశ్వర్, వైదేశ్వర్, ముక్తేశ్వర్ లాంటి దివ్య శివ క్షేత్రాలు చాలా ఉన్నాయి.
పంచకైలాసాలు
మానస సరోవర మహా కైలాసం కాక - అది కైలాస, కిన్నర కైలాస, శ్రీకంఠ మహాదేవ కైలాస, మణిమహేశ కైలాసాలు. ఇవి కూడా కొంత క్ల్రిష్ట యాత్రలే.
ఆది కైలాసం - ఉత్తరాఖండ్ లోని కుమాన్ మండలంలో ఉన్నది.
హిమాచల్ ప్రదేశ్ లోని 'కులు-సిమ్లా' ప్రాంతాల నుండి వెళ్ళ వలసిన ప్రయాణం.
కిన్నర కైలాసం కూడా హిమాచల్ ప్రదేశ్ కి చెందినది. సిమ్లానుండి ప్రయాణ సదుపాయాలున్నాయి.
మణి మహేశ్ కైలాస్ కి 'చంబా కైలాసం' అనే నామాంతరముంది.ఇక్కడ మణి మహేశ సరస్సును కూడా శివ స్వరూపంగా భావిస్తారు. కృష్ణ జన్మాష్టమి (శ్రావణ బహుళాష్టమి) నుండి రధాష్టమి (భాద్రపద శుక్లాష్టమి) వరకు ప్రతి ఏడు ఈ యాత్ర జరుగుతుంది. హిమాచల ప్రదేశ్ లోని చంబా జిల్లాకు చెందిన పర్వతమిది.
పంచభూత తత్వ లింగములు :: ఈ విశ్వమంతా, అంటే మన కళ్ళకు కనిపించేది, కనిపించకుండా ఉన్న ప్రతి పదార్థం, ప్రతి ప్రాణి అయిదు మూల ధాతువుల సంయోగం వాళ్ళ రూపు దిద్దుకున్నవే. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి (మట్టి) అనేవి ఆ అయిదు మూల ధాతువులు. మహేశ్వరుడైన పరమ శివుడు ఆ అయిదు మూల ధాతువుల (పంచభూతాల)లో ఒక్కొక్కదాని రూపం తనలో నింపుకొని అయిదు చోట్ల వెలసి యున్నదని ప్రాణకథ. ఆ అయిదు ప్రదేశాల వివరాలు ఇవి:
1. ఆకాశలింగం ::: తమిళనాడులోని చిదంబరం.
2. వాయులింగం :: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి
3. తేజో (అగ్ని) లింగం :: తమిళనాడులోని తిరువణ్ణామలై
4. జలలింగం :: తమిళనాడులోని శ్రీరంగం (జంబుకేశ్వరం)
5. పృథివి (మట్టి) లింగం :: తమిళనాడులోని కంచీపురం
పంచకేదారాలు
1. కేదార్ నాథ్ :: ప్రసిద్ధి చెందిన కేదార్ నాథ్ మాత్రమే కాక మరో నాలుగు 'కేదారాలు' ఉన్నాయి.
2. మధ్యమహేశ్వర్ :: ఇక్కడి వారు ఈ ప్రదేశాన్ని మాధ్యమహేశ్వర్ అని అంటారు. కేదార్ నాథ్ కు దక్షిణంగా ఉన్న నల అనే ఊరు నుంచి ఈశాన్యంగా 6 కే.మీ. దూరంలో కాలిమఠ్ అనే మరొక ఊరు ఉంది. ఈ కాలిమఠ్ నుంచి కొండ మార్గం వెంట ఇరువై అయిదు కి.మీ. దూరం వెళితే మధ్య మహేశ్వర్ ఉంది.
3. తుంగనాథ్ :: కేదార్ నాథ్ నుంచి బదరి నాథ్ వెళ్ళడానికి రుద్రప్రయాగ్, సందప్రయాగ్, ఛమోలి మీదుగా ఉన్నది ప్రధాన మార్గం. కాని కేదార్ నాథ్ కు దక్షిణంగా ఉన్న ఊఖిమఠ్ నుంచి బదరి వెళ్ళే మార్గంలో ఉన్న ఛమోలి వరకు మరొక మార్గం ఉంది. ఆ మార్గంలో ఊఖిమఠ్ నుంచి 35 కి.మీ. దూరంలో చోప్తా అనే చిన్న గ్రామం ఉంది. చోప్తా నుంచి తుంగనాథ్ వరకు 6 కి.మీ. దూరం. ఇక్కడి నుంచి చుట్టూ ఉన్న నందాదేవి, మానగిరి, నీలకాంత్, కేదార్నాథ్ పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి.
4. రుద్రనాథ్ :: చోప్తా నుంచి 28 కి.మీ. దక్షిణంగా మండల్ చట్టి అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం నుండి ఈశాన్యంగా 28 కి.మీ. దూరంలో రుద్రనాథ్ ఆలయం ఉంది. రుద్రనాథ్ ఆలయానికి వెళ్ళడానికి బయలుదేరవలసిన మండల్ చట్టీ గ్రామానికి 11 కి.మీ. దక్షిణంగా గోపేశ్వర్ అనే మరొక క్షేత్రం ఉంది. దీని అసలు పేరు గోలస్థ తీర్థం. ఇక్కడ కేదారనాథుని సంపూర్ణ స్వరూపం ఉంటుందని స్థల పురాణం.
5. కల్పేశ్వర్ :: నందప్రయాగ నుండి బదరీనాథ్ వెళ్ళే దారిలో, పీపల్ కోటికి ఉత్తరంగా 17 కి.మీ. దూరంలోనూ, జోషిమఠ్ కు దక్షిణంగా 14 కి.మీ. దూరంలోను హేలంగ్ అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం అనుకునే అలకనంద నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ అలకనంద నదిని దాటి, అవతలి గట్టు నుంచి 9 కి.మీ దూరంలో కొండ మార్గంలో నడచుకుంటూ వెళితే ఈ క్షేత్రం ఉంది.

ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే పరమేశ్వరం (మమలేశ్వరమ్) ||
ప్రజ్వల్యాం విద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరమ్ |
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ||
వారణాస్యాంతు వెశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే |
హిమాలయేతు కేదారం ఘ్రుశ్నేశం చ శివాలయే (విశాలకే) ||
ఏతాని జ్యోతిర్లింగాని సాయంప్రాతః పఠేన్నరః |
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ||

సర్వపాప వినిర్ముక్తః సర్వసిద్ది ఫలం లభేత్ ||
(సర్వపాపహరంచైవ సర్వబాధా నివారణం)
భావము:
1. సౌరాష్ట్రమున (గుజరాత్ లో) సోమనాథలింగము.
2. శ్రీశైలమున మల్లికార్జునుడు.
3. ఉజ్జయిని యందు మహాకాలుడు.
4. అమరేశ్వరమున ఓంకారలింగము.
5. ప్రజ్వల్యా దేశమున వైద్యనాథ లింగము.
6. ఢాకినీ ప్రాంతమున భీమశంకరుడు.
7. సేతుబంధము (రామేశ్వరము)న రామేశలింగము.
8. దారుకావనమునందు నాగేశ్వరలింగము.
9. వారణాసి (కాశీ) యందు విశ్వేశ్వరుడు.
10. గౌతమీతట (నాసిక్) ప్రాంతమున త్ర్యంబకేశ్వరుడు.
11. హిమాలయములందు కేదారేశ్వరుడు.
12. విషయాలక దేశము (దేవగిరి ప్రాంతము)న ఘ్రుశ్నేశ్వరుడు
అనుపేర్లతో ద్వాదశ జ్యోతిర్లింగములుగా వెలసినవి. పై జ్యోతిర్లింగముల నామములను ప్రాతః-సాయంకాలములందు నిత్యమూ తలచినచో సప్త(ఏడు)జన్మలలో చేసిన పాపములు నశించును.
1. సోమనాథ జ్యోతిర్లింగము - ప్రభాసపట్నం, గుజరాత్.
సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్ర కలావతంసం |
భక్తీ ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ||
స్వచ్ఛమైన, అతి రమ్యమైన లేక అందమైన సౌరాష్ట్ర (గుజరాత్) దేశంలో (రాష్ట్రంలో)ని జీవులందు భక్తిని దయతో అవతరించిన జ్ణానజ్యోతితో ప్రకాశించుచు చంద్రకళల వంటి అందమైన రూపముగల సోమనాథుని శరణు పొందుతున్నాను.
సోమనాథుదనగా చంద్రుడు లేక ఈశ్వరుడు. స+ఉప = సోమ - ఉమతోకూడిన, నాథుడు - ప్రభువు = ఈశ్వరుడు. సోమము - ఒక చెట్టు రసము - అమృత సమానమైన ఓషధీ తత్వము కలది. అట్టి సోమలతలో అమృతత్వమును కల్గించువాడు కావున చంద్రునకు సోముడని పేరు. ఆ సోముని (చందునిచే) ప్రతిష్టింపబడినవాడగుట చేత, చంద్రుని కోరికలను తీర్చినవాడగుటచేత అక్కడి ఈశ్వరునికి సోమనాథుడని పేరు.
పురాణగాథ ::
బ్రహ్మమానస పుత్రులలో 'దక్షు'నికి ప్రజాపతి పదవి ఇవ్వబడింది. అతనికి గల 100 కుమార్తెలలో 'సతీదేవి' ఈశ్వరుని భార్య అయింది. అశ్వని మొదలు రేవతి వరకు గల 27 మంది కుమార్తెలు చందుని భార్యలు. వారిలో రేవతి మంచి అందగత్తె మరియు చంద్రునికి ప్రియమైనది. ఇదిచూసి మిగతావారు అసూయపడి తండ్రియైన దక్షునికి తమ భర్తకు అయిన చంద్రునికి రోహిణి యందు అనురాగమెక్కువ కాన తమని సరిగా చూడలేదని చెప్పారు. దక్షుడు భార్యలందరిని సమానముగా చూచుకొనమని యితవు చెప్పాడు. కాని చంద్రునిలో మార్పు రాలేదు. మళ్ళి రోహిణి కాక మిగిల కూతుళ్ళు తంద్రివద్దకు పోయి తమ దుఃఖాన్ని తెలియజేసారు. కోపగించి దక్షుడు చంద్రుని "ఏ సౌందర్యము మరియు కళల వలన నీవు కళ్ళు గానక దురహంకారంతో ప్రవర్తిస్తున్నావో అవి నీలో క్షీణించి క్షయరోగముతో బాధపడుతువుగాక" అని శపించాడు. శాప ప్రభావము వలన చంద్రుని సర్వ కార్యాలు స్తంభించిపోవడంతో ఓషధులు, లతలు, చెట్లు నిస్తేజములయి దేవతలకు సోమము లేక అమృతము అందటంలేదు మరియు యజ్ఞ యాగాది క్రతువులు నిలిచిపోయి అంతటా దుర్భిక్షం ఏర్పడింది.
వ్యాధిగ్రస్తుడైన చంద్రుడు దేవతలతోను, మహర్షులతోను, బ్రహ్మదేవునితోను తన దుఃఖాన్ని చెప్పుకొని తరుణోపాయమును తెలుపమని వేడుకొన్నాడు. దానికి బ్రహ్మదేవుడు "ప్రభాస తీర్థమను పుణ్యక్షేత్రమున (గుజరాత్ లోని కథైవార్ దగ్గర) శ్రీ మహా మృత్యుంజయ మంత్రముతో దీక్షగా శివుని అర్చించమని చెప్పాడు. అలాగే చంద్రుడు పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి 40 రోజులు దీక్షగా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాడు. సంతశించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై లోక కళ్యానార్థము మరియు ప్రజాపతి వాక్యములు అసత్యము కాకుండా శాపమునకు కొంత నివారణము వరముగా -- క్షయరోగము పోవునట్లు మరియు అమరత్వము కలుగునట్లు -- అనిగ్రహించాడు. అయితే శుక్ల పక్షములో ప్రతిరోజూ ఒక్కొక్క కళ చొప్పున తరుగుతూ మరియు కృష్ణ పక్షములో ప్రతిరోజూ ఒక్కొక్క కళ చొప్పున పెరుగుతూ సృష్టియున్నంతకాలము కొనసాగుతాయని వరమిచ్చాడు.
చంద్రాది దేవతలు మరియు మునుల ప్రార్థనలను అనుసరించి శివుడు ప్రభాస క్షేత్రమున చందుని పేరుతో సోమనాథ లింగముగా వెలిశాడు. దేవతలు, మహర్షులచే పుణ్యోదకములతో నింపబడిన కుండము (చెరువు) చంద్ర కుండమగా వెలిసింది. ఈ ప్రభాస క్షేత్రమే నేదు సోమనాథ్.
ఈ జ్యోతిర్లింగ దర్షన-పూజల వలన సర్వపాతకములు, దుష్కర్మలు నశించి, సర్వమనోభీష్ట సిద్ధి కలిగి అంత్యమున కైవల్యమును పొందుతారు. నిత్య చంద్రకుండ స్నానమువల రోగములు నశించి ఆరోగ్యము కలుగుతుందని హిందువుల నమ్మకము.
చరిత్ర ::
(1) మొదటి దేవాలయం క్రీ.పూ. 797-497 సం||ల మధ నిర్మింపబడింది.
(2) క్రీ.శ. 640-649 మధ్య కాలంలో రెండవసారి జీర్ణ్ద్ధరణ శ్రీ హర్ష మనుమడైన ధారసేనుని పరిపాలనలో.
(3) భోజపరమార్ అనే రాజు 30 అంతస్థులతో, గోపురాలమీద 14 సుర్వర్ణకలశాలతో, నవరత్నఖచితమైన సంహద్వారంతో ఆలయ నిర్మాణం.
(4) క్రీ. శ. 755లో అప్పటి పాలకులైన వాలభి రాజులు అరబ్బుల దండయాత్రలో ఓడిపోవటంతో ఆలయ పోషకత్వం కరువైపోయింది.
(5) క్రీ. శ. 800 ప్రాంతంలో 'నాగభట్ట' అనునతడు విదేశీయుల్ని పారద్రోలి ఎర్ర ఇసుకరాళ్ళతో దేవాలయాన్ని బాగు చేయించి పూర్వ వైభవాన్ని కలిగించాడు.
(6) క్రీ.శ. 1026 జనవరిలో గజనీ మొహమ్మద్ దండయాత్రలో దేవాలయంలో ఉన్న అపార ధనరాశులను దోచుకొని, శివలింగాన్ని ముక్కలుగా చేసి, దేవాలయాన్ని నేలమట్టం చేసారు.
(7) క్రీ.శ. 1045 నాటికి ఆలయం తిరిగి నాల్గవసారి పునరుద్ధరింపబడింది.
(8) క్రీ.శ. 1164 లో రాజైన కుమారపాలుడు ఆలయాన్ని విస్తృతపరచి ఆలయరక్షణకు, కోటగోడను, దేవాలయానికి బంగారు కళాశాలను, విశాలమైన దర్బారు హాలు, ముఖ మంటపము, మంచినీటి కోనేరు, అర్చకులకు ఇండ్లు, సముద్రం వరకు మెట్లు నిర్మింపజేశాడు.
(9) రెండవ భీమదేవుడను రాజు మేఘనాథ మంటపాన్ని నిర్మించాడు. విశాలదేవుని కాలంలో 'సరస్వతీ సదస్సు' పేరుతో కళాశాల ప్రారంభమైనది.
(10) క్రీ. శ. 1287లో త్రిపురాంతకుడనే యోగి ఈ ఆలయ ప్రాంగణంలో ఉమాపతి, ఉమేశ్వర, మల్హణేశ్వర, త్రిపురాంతకేశ్వర, రామేశ్వర ఆలయాలను నిర్మించాడు.
(11) క్రీ.శ. 1144-1297 మధ్యకాలంలో సోమనాథ దేవాలయం అత్యంత వైభవ స్థితిని పొందింది.
(12) క్రీ.శ. 1297లో ఢిల్లీ సుల్తానుల మద్దతుదారు జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క సైనికాధికారి అలాఫ్ ఖాన్ దేవాలయాన్ని నేలమట్టం చేశాడు.
(13) క్రీ.శ. 1308-1325 మధ్యలో మహీపాలదేవుడనే రాజు తిరిగి పునర్నిర్మాణం ప్రారంభించగా అతని కుమారుడు 'రా-ఖరగర్' క్రీ.శ. 1325-1351 మధ్య ఆలయాన్ నిర్మాణాన్ని పూర్తిచేసి సోమనాథలింగా ప్రతిష్ఠ చేశాడు.
(14) 1394లో గుజరాత్ ఢిల్లీ సుల్తానుల ప్రతినిధి అయిన ముజఫర్ ఖాన్ దేవాలయాన్ని ధ్వంసం చేశాదు.
(15) మరల తిరిగి చిన్నదిగా నిర్మింపబదింది. దానిని ముజఫర్ఖాన్ మనుమడు అహ్మద్ శా 1413లో ధ్వంసం చేశాడు. ఇతడే కర్ణావతి నగరాన్ని అహమ్మదాబాద్ గా పేరు మార్చాడు.
(16) తరువాత నిర్మింపబడిన దేవాలయాన్ని మహమ్మద్ బేగడా అనే రెండవ ముజఫర్ ఖాన్ 1459లో ధ్వంసం చేసాడు.
(17) అక్బర్ కాలంలో స్థానికుల కృషితో 1560లో ఆలయం పునరుద్ధరింపబడింది.
(18) క్రీ.శ. 1669లో ఔరంగజేబు పాలనలో భారతదేశంలోని ఇతర ముఖ్య దేవాలయాలతోపాటు సోమనాథ దేవాలయాన్ని కూడా ద్వంసం చేయించి మసీదుగా మార్చాడు.
(19) 1708లో ఇండోర్ రాని అహల్యాబాయి హోల్కర్ నూతనంగా దేవాలయాన్ని నిర్మింపజేసింది.
(20) 1812లో దేవాలయ నిర్వహణ బాధ్యత బరోడా రాజు గైక్వాడ్ చేతుల్లోకి వచ్చింది.
(21) బ్రిటీష్ పాలనలో లార్డ్ కర్జన్ మసీదుగా ఉన్న దేవాలయం చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాడు.
(22) భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, కే.ఎం. మున్షీల ప్రయత్నాలతో 11.5.1951న జ్యోతిర్లింగ ప్రతిష్ఠ నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జరిగింది.
(23) 13.5.1965న సోమనాథ దేవాలయ శిఖరానికి కలశ ప్రతిష్ఠ, ధ్వజారోహణము జరిగాయి.
ముస్లిముల చేత ఎన్నో దేవాలయాలు భారతదేశంలో ధ్వంసంచేయబడి దోచుకోబడ్డాయి మరియు మసీదులుగా మార్చబడ్డాయి. అన్నిటికంటే ఎక్కువసార్లు ధ్వంసం చేయబడిన సోమనాథ దేవాలయము సోముని (చంద్రుని) కళలులాగా ధ్వంసం చేయబడి అభివృద్ధి చెందినది. ఒక విధంగా ఈ దేవాలయం భారతీయుల ఆధ్యాత్మిక బలానికి చక్కని నిదర్శనము.
సోమనాథ దేవాలయపు ప్రధాన ఆలయ గోపురం 155 అడుగుల ఎత్తున 400 మీటర్ల పొడువుతో, 400 మీటర్ల వెడల్పుతో మూడు అంతస్థులతో నాగర శైలిలో నిర్మించబదినది. దీనిలో జ్యోతిర్లింగము, బ్రహ్మ, విష్ణువులు దర్శనమిస్తారు.
ముస్లిముల దాడికి భయపడి అసలు లింగాన్ని 2 ఫర్లాంగుల దూరంలొ భూమిలో దాచారంటారు.
ఆలయంలో ఉదయం 7.00 గం.కు హారతి సేవ జరుగుతుంది. ఈ సమయంలో సోమనాథుని పాలు, నెయ్యి, పెరుగు మొదలగు ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తారు. తర్వాత స్వామిని అలంకరిస్తారు.
ఆలయం బయట అన్నిరకాల పూజా సామాగ్రి అమ్ము దుకాణములు, హోటల్లు, వాహన సదుపాయాలు ఉన్నాయి.
దేవాలయ దగ్గరలో ఆలయ ట్రస్ట్ వారి భోజన శాల ఉంది.
యాత్రికులకు వసతి సౌకర్యానికి ఏ విధమైన లోటు లేదు.
ఇతర దర్శనీయ ప్రదేశాలు:
1. సోమనాథ్ లో తపతి (కపిల), హరణ్య, సరస్వతి నదుల త్రివేణీ సంగమం,
2. శరదాపీఠం
3. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం
4. సూర్య దేవాలయం
5. లక్ష్మీనారాయణ ఆలయం
6. భాలక తీర్థం
7. దేహోస్వర్గ (కృష్ణుడు బోయవాని బాణము వలన అవతారము చాలించిన చోటు)
8. జగత్ మందిరం
9. జైన్ ఆలయం
10. బలరామ గుహ
రైలు మార్గము:
1. చెన్నై - విజయవాడ - వార్ధా - భువసాల్ - సూరత్ - బరోడా - అహ్మదాబాద్ - బోతాడ్ - భావనగర్ - జెటాల్సర్ - పెరావల్ - సోమనాథ్.
2. సికింద్రాబాద్ - వాడి - డోండ్ - పూణె - సూరత్ - బరోడా - అహ్మదాబాద్ - బోతాడ్ - భావనగర్ - జెటాల్సర్ - పెరావల్ - సోమనాథ్.
సమీప విమానాశ్రయం – కేశోడ్
2. మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్.
శ్రీశైల సంగే విబుధాతి సంగే, తులాద్రి తుంగేపి ముదావసంతం |
తమర్జునం మల్లికపూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుమ్ ||
శ్రీశైలములో దేవతలందరూ కలసి ఉన్న చోట తులాద్రి శిఖరము పైన సంతోషముగా నివసిస్తున్నవాడు, సంసారమనే సమురానికి వారధి వంటివాడు అయిన మల్లికార్జునుడికి నమస్కరిస్తున్నాను.
పురాణగాథ:
యుక్తవస్కులైన విఘ్నేశ్వరుడు మరియు కుమారస్వామికి వివాహము చేయ సంకల్పించిన పార్వతీపరమేశ్వరులు, వారికి ముందుగా భూప్రదిక్షిణము చేసి అన్ని నదులలో మరియు సముద్రాలలో వచ్చినవారికి మొదట వివాహము చేస్తామని తెలిపారు. కుమారస్వామి తన నెమలి వాహనం పై వెంటనే బయలుదేరాడు, కాని భారీ శరీరము మరియు ఎలుక వాహనం గల విఘ్నేశ్వరుడు బాగా ఆలోచించి పురాణాలలో తెలిపినట్లుగా తల్లిదండ్రులకు పూజ్య మరియు భక్తి భావముతో మనఃపూర్వకముగా ప్రదక్షిణ చేసి అన్ని నదులలోను మరియు సముద్రాలలోనూ స్నానమాచరించిన ఫలితాన్ని పొందడమే కాకుండా, ప్రతిచోట తనకంటే ముందుగా వినాయకుడు రావడం చేసినట్లుగా కుమారస్వామి కనిపిస్తాడు. మొట్టమొదట వినాయకుడు భూప్రదిక్షిణ చేసి వచ్చినాడు కనుక, పార్వతీపరమేశ్వరులు వినాయకునికి సిద్ధి-బుద్ధి లను కన్యలతో వివాహం చేశారు. కుమారస్వామి అలుకబూని, కైలాసము వదలి, దక్షిణానవున్న క్రౌంచపర్వతము (శ్రీశైలము)నకు వెళ్ళిపోయాడు. కుమారునిపై గల ప్రేమతో తల్లియైన పార్వతి కూడా అక్కడికి వెళ్ళింది. ఆమె వెంట ఈశ్వరుడు కుడా వెళ్ళాడు. ఇలా పార్వతీపరమేశ్వరులు భ్రమరాంబ, మల్లికార్జునులనే పేరుతే శ్రీశైలం చేరారు.
పూర్వం శిలాదుడనే ఋషి సంతానం కోసం శివుని గూర్చి తపస్సు చెయ్యగా, అతని తపస్సుకు మెచ్చి, శివుడు ప్రత్యక్షమై నంది మరియు పర్వతుడు అను పుత్రులు వరంగా ఇచ్చాడు. ఆ పుత్రులు శివుని గూర్చి తపస్సుచేసి, శివుడు ఎల్లప్పుడు పర్వతునిమీద నివసించేటట్లుగా మరియు నంది శివుని మోసే లాగా వరాలు పొందారు. అలాగే వారు తపస్సు చేసిన స్థలంలో 'పర్వతలింగం'గా వెలసి, భక్తులు చూసినంత మాత్రాన పునర్జన్మ లేకుండా మోక్షం కలిగేలాగా, సమస్త తీర్థాలు, సకల దేవతలు అక్కడ కొలువుండేలాగా వరాలిచ్చాడు. అందువలన ఈ పర్వతము శ్రీ పర్వతముగా మరియు పర్వత లింగము మల్లికార్జున లింగముగా అయ్యింది.
వృద్ధమల్లికార్జునుడు:
పూర్వం ఒక రాకుమారి శివుని పెండ్లాడాలనుకొని, మల్లి పూవులతోను, అర్జున పుష్పాలతోను పూజించేది. ఒకరోజు శివుడు ఆమెకు కలలో కనిపించి ఒక తుమ్మేడను చూపించి, అది వాలినచోట వేచి ఉండమని, తాను వచ్చి పెండ్లాడుతానని చెప్పాడు. ఆమెకి మెలుకవ వచ్చి, కళ్ళూ తెరువగానే ఒక భ్రమరం ఎగురుతూ కనిపించింది. ఆ తుమ్మెదను అనుసరిస్తూ, శ్రీశైల ప్రాంతములోని అడవిలో ఒక పొదమీద వాలడం చేత అక్కడ శివుని ధ్యానిస్తూ నిరీక్షించ సాగింది. ఆ అడవిలోని చెంచులు పాలు, పండ్లు, తేనె మొదలగునవి ఆమెకు ఆహారంగా ప్రతిరోజూ ఇచ్చేవారు.
ఒకరోజు పార్వతితో కూడి అక్కడకు శివుడు వచ్చి, అ కాకుమారిని చూపించి, ఆమె తనను వివాహమాడదలచుకొన్నదని తెలిపాడు. దానికి పార్వతి హేళనగా చేసింది. శివుడు తన మాటలను నిరూపించ దలచి, ఆ రాకుమారి దగ్గరకు ఒక ముసలివాని రోపంలో వెళ్ళి, "రాకుమారి, నీకోసం వెతుకుతూ ముసలివాడనయ్యి, ఇంతకాలానికి నిన్ను చేరాను, నా ముసలి రూపమును లెక్క చేయక, నన్ను వివాహమాడుతావా?" అని అడిగాడు. అందుకామె ఒప్పుకొని, చెంచులు వద్దన్నావినక, శివుని వివాహమాడింది. చెంచులు క్రొత్త అల్లునికోసం మద్య-మాంసాలతో విందు ఏర్పాటు చెస్తే, శివుడు అలిగి, విందును అంగీకరించకుండా వెళ్ళిపోసాగాడు. ఆమె శివున్ని మల్లయ్య ... ఓ చెవిటి మల్లయ్య! అగు... నిలబడు అని గట్టిగా పిలిచిన, శివుడు లెక్క చెయ్యకపోయేసరికి, రాయిలాగా మాట్లాడవేమి? అక్కడే లింగంగా మారిపో అని శపించింది. వృద్ధ రూపంలో ఉన్న శివుడు అక్కడే లింగంగా మారిపోయాడు. అందుకు పార్వతి రాకుమారిని చుసి, ఓసీ! భ్రమరమును వెంబడించి వచ్చిన నీవు తుమ్మెదగా మారిపో అని శపించింది. దాంతో ఆమె శివుని భార్యగా భ్రమరాంబ నామముతో నిలిచిపోయింది. అందుకనే భక్తులు, ఎప్పటికిని, స్వామిని వృద్ధ మల్లయ్య, ముసలి మల్లయ, చెవిటి మల్లయ్య అని పిలుస్తారు.
భ్రమరాంబాదేవి:
ఒకప్పుడు అరుణాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి రెండు, నాలుగు కాళ్ళా ప్రాణులనుండి తనకు మరణం లేకుండా వరం పొంది, వరగర్వంతో అన్ని లోకాలను బాధించసాగాడు. అతని సంహారం కోసమై ఆదిశక్తి, దేవతల కోరికపై, ఉమ్భవించి, యద్ధంలో వేలాది తుమ్మెదల సృష్టించి, వాటిచే కుట్టించి, అతనిని సంహరించి లోకాలను కాపాడింది. తుమ్మెదలన్నీ ఆరుకాళ్ళ జీవులు కదా! దేవతల కోరికపై ఆదిశక్తి భ్రమరాంబికగా అక్కడ వెలసింది. ఇప్పటికి అమ్మవారి వెనుక గోడల నుండి భ్రమర ఝంకారం వినిపిస్తుంది.
అష్టాదశ శక్తి పీఠాలలో మహామహిమాన్వితమైనది ఈ శక్తి పీఠం. శ్రీశైల పీఠాన్ని అధిష్టించిన భ్రామరీ శక్తి భక్తుల కోరికలను తీరుస్తుంది.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున లింగము అనే పేరుతో శివుడు, అష్టాదశ పీఠాలలో ఒకటిగా పరిగణింపబడిన భ్రమరాంబిక పేరున అధిశాక్తియైన పార్వతి వెలసిన శ్రీశైలం శివ-శాక్తేయులకి విశేష ఆనంద మరియు ఫల దాయకము.
చరిత్ర:
కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు శ్రీశైలాన్ని దర్శించారు. ద్వాపరయుగంలో పాండవులు (క్రీ.పూ. 3120 ప్రాంతంలో) శ్రీశైలాన్ని దర్శించి వారి పేర్లతో లింగాలని ప్రతిష్ఠించారని ఇతిహాసాలు, పురాణాలు వలన తెలుస్తోంది. అలాగే గోరక్ నాథుడు, ఆదిశంకరాచార్యులు, ఆచార్య నాగార్జునుడు శ్రీశైలాన్ని దర్శించారనీ, కొంతకాలం తపస్సు చేశారనీ తెలుస్తోంది.
శాతవాహనులు: శాతవాహనుల కాలంలో శ్రీశైలాని 'సిరిధాన్' అని వ్యవహరించేవారు. పులమావి (క్రీ.శ. 102-130) నాసిక్ గుహలలో చెక్కించిన శాసనాలలో దీని ప్రస్తావన వుంది. శాతవాహనులు దీని పోషణ చూసే వారు.
ఇక్ష్వాకులు: 3వ శతాబ్దిలో పాలించిన వారిలో 'వశిష్ఠపుత్ర క్షాంతమూలుడు' కుమారస్వామి భక్తుడు, శివభక్తుడు. ఇతని కాలంలో శ్రీశైలంలో చాలా అభివృద్ధి చెందింది. శాతవాహనుల కాలంలో 'సిరిధాన్'గా పిలువబడిన క్షేత్రము ఇక్ష్వాకుల కాలంలో శ్రీశైలముగా, శ్రీపర్వతముగా పిలువబడింది.
పల్లవులు: ఇక్ష్వాకు రాజైన పురుషదత్తుని గెలిచి సింహవర్మ అనే పల్లవరాజు శ్రీశైలన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఇతని వంశస్థుడైన త్రిలోచన పల్లవుడు శ్రీశైల ప్రాంతపు అడవిని కొంత కొట్టించి బ్రాహ్మణులకు నివాసాన్ని ఏర్పరచాడు. పల్లవులు 4వ శతాబ్ది వరకు శ్రీశైలాన్ని పరిపాలించాడు. తర్వాత 'కరికాలచోళుడు' అనునతడు త్రిలోచన పల్లవుని ఓడించి అతడు తలపెట్టిన అభివ్రుద్ధిపనులను హిందూస్థానీ పని వారితో చోళుడు పూర్తి చేయించాడు.
విష్ణుకుండినులు: 4వ శతాబ్ధి చివరిభాగంలో శ్రీశైలము విష్ణుకుండినుల ఆధీనంలోకి వెళ్ళింది. వారు మరియు వారి బంధువులైన 'వాకాటకులు"ను శ్రీశైలాభివృద్ధికి కృషిచేశారు.
కదంబులు: 6వ శతాబ్ది మొదటి భాగంలో పల్లవులు తిరిగి రాజ్యానికి వచ్చారు. వారిని మయూర వర్మ అనే కదంబరాజు జయించి శ్రీశైలాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
చోళులు: 6వ శతాబ్ది మధ్య నుండి 8వ శతాబ్ది వరకు రాజ్య పరిపాలన చేసిన చోళ వంశములలో రేనీటి చోళులు శ్రీశైలమును పాలించాడు.
రాష్ట్రకూటులు: 8వ శతాబ్దిలో రాష్ట్రకూటుదైన 'దంతిదుర్గుడ'నువాదు కీర్తివర్మను జయించి కర్ణాటకకు రాజయ్యాడు. అతడు, అతడి వంశస్థుల పాలనలో క్రీ.శ. 973 వరకు శ్రీశైలము వుంది.
చాళుక్యులు: క్రీ.శ. 973లో ఒక చాళుక్యుడు రాష్ట్రకూటులను యజించి శ్రీశైలాన్ని తిరిగి చాళుక్యుల పాలనలోకి తెచ్చాడు. ఇతని వంశస్థులను చాళుక్యులనీ, కళ్యాణి వాళుక్యులనీ అంటారు. వీరికి, దాక్షిణాత్య చోళులకూ మధ్య కలహాలను అవకాశముగా తీసుకొని రెండవ గొంక వెలనాటి ప్రతినిధి శ్రీశైలాన్ని ఆక్రమించాడు. క్రీ.శ. 1162 వరకు శ్రీశైలం ఇతని కొడుకు వశములో ఉంది.
కాకతీయులు: క్రీ.శ.1162 నాటికి శ్రీశైలం కాకతీయుల చేతిలోకి వచ్చింది. ఆనాటి నుండి 1323 వరకు శ్రీశైలం కాకతీయుల ఆధీనంలోనే ఉండి అభివృద్ధిచెందింది.
కొండవీటిరెడ్డి రాజులు: క్రీ.శ. 1326 నుండి అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆధీనంలోకి శ్రీశైలం వచ్చింది. ఈ ప్రోలయ వేమారెడ్డి 1335 సం.లోపున శ్రీశైలానికి మెట్లు కట్టించాడు. 1335-1346 మధ్య పాతాళగంగకు మెట్లు కట్టించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇవి ఇప్పటికీ బాగానే ఉన్నాయి. అయినా 1393-94 లో రెండవ దేవరాయలు భార్య విఠలాంబ కట్టించిన పాతాళగంగ మెట్లనే భక్తులు వాడుతున్నారు. 1364లో రాజ్యానికి వచ్చిన అనవేమారెడ్డి 1377లో వీరశ్రోమండపాన్ని కట్టించినట్లు 9-1-1378న వేయించిన ఒక స్తంభ శాసనం వలన తెలుస్తోంది. ఇతని తరువాత కుమారగిరిరెడ్డి (1378-1407) శ్రీశైల శిఖరానికి మెట్లు కట్టించాడు. ఇతని మంత్రి కాటయవేముడు 1398లో ఈ మెట్లు వేహించినట్లు శాసనమున ఉన్నది.
విజయనగర రాజులు: విఠలాంబ పాతాళగంగ మెట్లనేకాక విఠలేశ్వరాలయాన్ని కూడా కట్టించినట్లు తెలుస్తోంది. క్రీ.శ. 1405లో రెండవ హరిహర రాయలు ఆలయ ముఖమండపాన్ని, దక్షిణ వైపు గోపురాన్ని నిర్మింపజేశాడు. 1456లో సాళువ తిరుమలయ్య శ్రీశైలానికి చాలా దానాలు చేశాడు. 1457-58లో ప్రౌఢ దేవరాయల పరిచారిక కొన్ని దానాలు చేసింది. 1468లో మహామండలేశ్వర పర్వతయ్య (వీరనరసింహరాయలు వంశము వాడు) భూములు, తోటలు, కట్టడాలు దానం చేశాడు. 1485లో సాళువ పెదమల్లప్ప రాజు ఒక చెరువును తవ్వించాడు. 1513లో శ్రీకృష్ణదేవరాయలు గర్బాలయపు రాగిరేకుకు, ముఖమండపానికి బంగారుపూత పూయించాడు. 1526లో రాయల సేవకుడు మల్లప్ప కొన్ని కానుకలిచ్చాడు. రాయల మంత్రి 'చంద్రశేఖరామాత్యుడు' కళ్యాణ మండపాన్ని కట్టించి గర్భాలయ ద్వారాలకు బంగారు రేకులు పొదిగించాడు. క్రీ.శ. 1529 నవంబర్లో ఆలయ విమానానికి చుట్టూ కొంతభాగం బంగారు పూత పూయించాడు. 14.1.1531న బంగారు నందిని చేయించాడు. పవళింపు సేవామందిరానికి ముందు మండపాన్ని కట్టించి అందులో శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసుల విగ్రహాలను పెట్టించాడు.
శివాజీ: మహారాష్ట్రుదైన ఛత్రపతి శివాజీ క్రీ.శ. 1674-77 శ్రీశాలాన్ని దర్శించి, ఉత్తర గోపురాన్ని నిర్మింపజేసి, ఆలయ రక్షణకోసం కొంతమంది మరాఠీ సైనికులను నియమించాడనీ, రొహిల్లాల దండు ఆలయంపి దండెత్తినప్పుదు, ఆ మరాఠీ సైనికులలో చివరివాడు కూడా చనిపోయే వరకూ వారితో పోరాడినట్లు తెలుస్తోంది. ఆ సైనికుల సంతతివారిప్పటికీ ప్రతి సంవత్సరము శ్రీశైలము వచ్చి తమ పెద్దలకు ధూపం చేస్తుంటారు.
శివాజీ శ్రీశైలంలో భ్రమరాంబాదేవిని సేవించి ఆమెను ప్రసన్నము చేసికొని ఖడ్గమును కానుకగా పొందారని, నాటినుంచి 'ఛత్రపతి శివాజీ' అని పిలువబడ్డాడని చరిత్ర.
నవాబులు: ఔరంగజేబు ఈ ప్రాంతాన్ని జయించి రాజాభీమ్సింగును గవర్నరుగా నియమించాడు. ఈ ప్రాంతము అప్పటి సేనాని దావుద్ ఖానుకు జాగీరుగా ఈయబడింది.
తరువాత అతని తమ్ముడు ఇబ్రహీంఖానుకు సంక్రమించింది. ఇబ్రహీంఖాన్ శ్రీశైలం దేవాలయం క్రింద అనుభవములోనున్న గ్రామాలను, ఆస్తులను 1712లో తిరిగి పట్టాలిచ్చి వారికి స్వాధీనం చేశాడు. తరువాత ఇది హైదరబాదు నవాబుల ఆధీనమయ్యింది. 8.4.1782lO నైజాం ఆలీఖాన్ అసఫ్-జా దస్తావేజులను పునరుద్ధరిస్తూ దేవస్థాన పరిపాలనను శ్రీ శృంగేరి జగద్గురువులకు అప్పగించాడు. తరువాత అది ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధినమయింది. వారు 1840lO పుష్పగిరి పీఠాధిపతులకు అప్పగించారు. 100 సం.ల కాలం వారి ఆధీనంలో ఉన్నా యెట్టి అభివృద్ధి లేకపోగా ఆలయాలు జీర్ణావస్థకు చేరుకున్నాయి. అందుచేత అనాటి ప్రభుత్వం దీనిని కొంతకాలం జిల్లా కోర్టు వారి ఆధీనంలో ఉంచి, 1929లో శ్రీ పాణ్యం రామయ్య గారి అధ్యక్షతన ఒక బోర్డ్ ను ఏర్పరచి వారికి అప్పజెప్పింది. వారు 1949లో దేవాదాయ ధర్మాదాయ శాఖవారికి అప్పజెప్పారు. ఈ శాఖవారు నేదు ఎన్నో అభివృద్ధి కార్యాలు చేస్తున్నారు.
శ్రీశైల దేవాలయానికి చేయబడిన దానములు
శాసనముల బట్టి ఎందరో భక్తులు చాలా దానాలు చేస్తినట్లు తెలుస్తోంది. వాటిలో ముఖ్యమైనవి:
(1) 1412లో 'లింగయ్య' అనునతడు గుడి చుట్టూ గల ప్రాకారంలో కొంతభాగం కట్టించాడు. 'అప్పనయ్యంగారు' నంది మండపం నుండి భ్రమరాంబ ఆలయంవరకు మెట్లు కట్టించాడు.
(2) 1456lO చోళ మండల రాజ్యపు గవర్నరు బంగారు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాడు.
(3) 1462లో బైరాగి 'శాంతయ్య' పూలతోటను దానమిచ్చాడు.
(4) 1505లో వీరప్పయ్య భార్య లక్కమ్మ ముఖమండప దక్షిణ ద్వారానికి రాగిరేకుకు బంగారుపూత వేయించింది.
(5) 1517లో పర్వతయ్య, అతని భార్య భీముని కోలనుకు దగ్గరలో ఒక చెరువును త్రవ్వించారు.
(6) 1929లో శ్రీశైలంలో కరణముగా పనిచేస్తున్న వాని కొడుకులు అన్నపూర్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
(7) (1) 1930లో లింగయ్య అనునతడు మల్లికార్జునస్వామి కవచానికి బంగారుపూత పూహించాడు. (2) తిరుమల రాయల అనుచరుడైన 'శాలకరాజు' యజ్ణశాల మండపాన్ని కట్టించాడు. (3) 'మల్లప్పనాయుడు' పెద్ద గుంటను దానమిచ్చాడు.
(8) 1585లో నందరాయ పట్టణమునకు చెందిన 'కుమార వీరప్పయ్య దేవుడు' అనునతడు స్వామి వారికి పెద్ద గంటలను యిచ్చాడు.
(9) 1592లో కుష్ణప్పనాయకుడు 'గంగైకొండనాడు'లోని రెండు గ్రామాలను అలయానికి బహుకరించాడు.
(10) 1594లో 'సితాపిఖాన్' అనువాడు గుడి ఉత్తరపు వాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభాన్ని యేర్పాటు చేసాడు.
(11) (1) 1634లో 'అన్నమరాజు' బంగారు స్తంభాన్ని పాతించాడు. (2) 'మన్నెపు నాయకుడు' దక్షిణ ప్రాకారాన్ని పునరుద్ధరించాడు.
ఇలా ఎంతమందో భక్తులు స్వామి-అమ్మ వార్లకి కానుకలను బహుకరించి తరించారు.
శ్రీశైల క్షేత్రంలో చూడదగిన ప్రదేశములు:
(1) శ్రీ శిఖరేశ్వరం.
(2) హటకేశ్వరం - పాలధార-పంచధారలు
(3) సాక్షి గణపతి
(4) బైలు వీరభద్రుడు
(5) నాగలూటి వీరభద్రుడు.
(6) వీరభద్ర స్వామి.
(7) మల్లికార్జున ఆలయం - ప్రాకారాలు-గోపురాలు, ప్రాకార కుడ్య శిల్పములు.
(8) శనగల బసవన్న
(9) సప్త మాతృకలు
(10) పాతాళగంగ
(11) సిద్ధి రామేశ్వర కొలను.
(12) భీముని కొలను
(13) మనోహర గుండము.
(14) బ్రహ్మ గుండము.
(15) విష్ణు గుండము.
(16) నవ బ్రాహ్మల ఆలయాలు.
(17) హేమారెడ్డి మల్లమ్మ - అక్కమహాదేవి
(18) బలిపీఠం
(19) సారంగధర మఠం.
(20) శ్రిరామ ప్రతిష్ఠిత సహస్రలింగం.
(21) సితా ప్రతిష్ఠిత సహస్రలింగం.
(22) త్రిఫల వృక్షం.
(23) భ్రమరాంబ ఆలయం.
(24) లోపాముద్ర
(25) శిల్ప మండపం.
(27) రుధిర గుండం.
(28) నిత్య కళ్యాణ మండపం.
(29) యాగ శాల
(30) అన్నపూర్ణ మందిరం.
(31) అమరేశ్వర ఆలయం
(32) గిరిజా-శంగరుడు
(33) పశుపతినాథ లింగం
(34) గంగాధర మండపం
(35) మల్లమ్మ కన్నీరు
(36) వరాహ తీర్థం
(37) గోగర్భం
(38) గంగాభవానీ స్నాన ఘట్టాలు
(39) పాతాళగంగ ఘట్టము
(40) ఆరామ వీరేశ్వరుడు
(41) చంద్రకుండం
(42) శివాజీ స్ఫూర్తి కేంద్రము
(43) శ్రీ మౌనస్వామి సమాధి.
(44) దత్తాత్రేయ వృక్షము - పాదుకలు
(45) పాతాళేశ్వరుడు
(46) విఠలేశ్వర ఆలయం
(47) అక్కమహాదేవి
(48) కదళీవనం
(49) శ్రీ కుమారస్వామి
(50) ఈశ్వరుని అష్టమూర్తులు
(51) శ్రీ రాజరాజేశ్వరి ఆలయం
(52) పంచపాండవుల ప్రతిష్ఠిత లింగములు.
(53) ఆలయ ప్రాంగణములోని నాగావళి ఉద్యానవనము
(54) శంకర మఠము
(55) శ్రుంగేరి శారదా మఠం.
(56) కంచి-కామకోటి మఠం.
(57) పండతారాధ్య పీఠం
(58) పంచ మఠాలు.
(59) ఘంటా మఠం
(60) విభూతి మఠం.
(61) రుద్రాక్ష మఠం.
(62) నందుల మఠం.
(63) జల-విద్యుత్-ప్రాజెక్టు
(64) స్వామి పూర్ణానంద ఆశ్రమం, సున్నిపెంట.
ఇంకా ఎన్నో, ఎన్నెన్నో.
శ్రీశైల శిల్ప సంపద విశేషాలు
ఇది శివ-శక్తుల సమ్మేళనమును పొందిన జ్యోతిర్లింగాలలో మరియు అష్టాదశ శక్తులలో ఒకటైన పవిత్ర స్థలము. ఇక్కడ మల్లికార్జుని ఆలయం తూర్పు ముఖంగా మరియు ధ్వజస్తంభాలు తూర్పు-పడమరాలలో అంటే ముందు-వెనుకల ఉండడం ఒక విశేషం. ఇక్కడ ముఖమండపమేగాక చాలా స్తంభాలతో పెద్దది అయిన శనగల బసవన్నగా పేరుగాంచిన నందిమండపం కూడా వేరుగా ఉంది. గర్భాలయంలో ప్రవేశించేముందు ఎడమచేతి ప్రక్కన పెద్ద బొజ్జగల రత్న గణపతి విగ్రహం ఉంది.
ఈ ఆలయానికి పదమ దిక్కున ప్రాకారాన్ని అనుకోని భ్రమరాంబాలయమున్నది. అమ్మవారి ఆలయంలో ప్రవేశించే ముందు ఎడమ ప్రక్క చిన్న మందిరంలో సీతాదేవి ప్రతిష్ఠించిన సహస్రలింగస్వామి ఉన్నారు. ఎదురుగా మండపంలో అమ్మవారి వాహనమైన సింహమునుంచారు. భ్రమరాంబికాముర్తి దుర్గా లేక కాళీ ఆకృతిలో ఉంతుంది. ఈ తల్లికి మాధవి అనే నామం కూడా ఉంది.
మల్లికార్జుని గుడి తూర్పు ముఖద్వారానికి ఉత్తరముగా వృద్ధమల్లికార్జునాలయం ఉంది. ఈ గుడికి కొంచెం ఈశాన్యంగా చిన్న సహస్రలింగాలయం ఉంది. ఇక్కడ పంచపాండవుల గుళ్ళు మరియు వీరభద్రాలయము ఉన్నాయి. ఈ ఆలయంలో లోహనిర్మితమైన అసాధారణమైన, శాస్త్ర లక్షణాలతో నాట్య భంగిమలో నటరాజ విగ్రహం ఉంది.
ఈ గుడికి ఉత్తర దిక్కున మేడి, జువ్వి, రావి కలిసిన ఒక పెద్ద వృక్షం ఉంది. దీనిని దత్తాత్రేయ వృక్షమని పూజలు చేస్తారు. ఈ ఆలయ ప్రాంగణములోనే కొన్ని పవిత్రమైన కోనేరులున్నాయి. ఈ నీటితో స్వామిని అభిషేకిస్తారు.
శ్రీశైలంలో నంది మండపము మీద, మల్లికార్జునాలయము మీద మూడు దిక్కులలోను శివావతాఅమూర్తులను పరమసుందరంగా అమర్చారు. నందిమండపానికి తూర్పున నటరాజశిల్పం చాలా అందంగా ఉంది. ఎడమ ప్రక్క శివకామి, కుడివైపు మాణిక్యవాచకర్ విగ్రహాలున్నాయి. దల్షిణదిశలో వ్యాఖ్యాన దక్షిణామూర్తి సప్తర్షి పరివేష్టుతుడై ఉన్నాడు. ఉత్తరమున పాశుపతమూర్తి చెక్కబడింది. ప్రధానాలయద్వారము ముందు తూర్పున వ్రుషభారూఢమూర్తి ఇరుప్రక్కలా వినాయక, ముమారస్వాములు కొలుస్తూ ఉన్నట్లు చెక్కబడింది. దక్షిణమున భిక్షాటన మూర్తి (మదన కామేశ్వరుడు) చెక్కబడింది. ఈయన సౌందర్యానికి మోహించి ఋషిపత్నులు తమ వలువలు జారిపోతుండగా ఆ పరమేశ్వరుని వెంటబడినట్లు చిత్రింపబడి ఉన్నారు. ఈ శిల్పము అత్యద్భుతమనవచ్చు.
ఉత్తర దిక్కున మార్కండేయ రక్షణం చేస్తున్న శివుడు మలచబడినాడు. ఇలాగే కళ్యాణ మండపము మీద కూడా శిల్పం అమర్చబడింది. పడమటి దిక్కున పార్వతీ కళ్యాణ శిల్పము, దక్షిణమున అమ్మవారిని కౌగలించుకొంటున్న ఆలింగనమూర్తి, ఉత్తరమున గంగాధరమూర్తి ప్రధానములు.
ఇటీవల తయారైన శిల్పాలలో చెప్పదగినది అమ్మవారి ఆలయానికి చుట్టూ నిర్మింపబడే ప్రదక్షిణ మండపం. అలాగే తూర్పు ద్వారానికి ఆవలీవలా చెక్కబడిన శిల్పాలు, వెనుక ప్రక్క అరటి ఆకులు, ఢంకా నృత్య శిల్పాలు, అద్భుతమైన జిలుగు నగిషీలు, దేవకన్యలు, ద్వారపాలికలు, మొదలగునవి.
మల్లికార్జున దేవాలయ ప్రాకారము ఆరడుగుల పొడవు, మూడడుగుల వెడల్పుగల రాళ్ళను ఎనిమిది వరుసలుగా ఒకదాని మీద ఒకటి అమర్చిబడిన రాళ్ళు ఎడ-ఎడముగా పెట్టబడి ఉన్నాయి. ఈ నిర్మాణ పధ్ధతి దుర్గప్రాకార పద్ధతివలే ఉంటుంది. క్రిందివరుస రాళ్ళ మీద శిల్పములు లేవు. తర్వాతి ప్రతి రాతి మీద అనేక పురాణగాధల శిల్పాలు, శివలీలలు, శ్వావతార చిత్రాలు చెక్కబడ్డాయి.
రెండు ఎనుకుగు కుండలతో నీతినెత్తిపోసి శివలింగాన్ని అభిషేకించడం, శివుడు లింగములో నుండి తన దివ్యరూపాన్ని ప్రకటించడం చాలా మనోహరంగా ఉంటుంది. ఇలాగా ఏనుగు కడవతో నీరుపోసి అభిషేకిస్తుండగా, మరొక ఏనుగు కలువపూలతో లింగమును పూజిస్తూ ఉండటం, ఒక ఆవు తన పొడుగు నుండి శివలింగముపై పాలను కురిపిస్తున్నట్లుగా, రెండు బల్లులు శివలింగపూజ చేస్తున్నట్లుగా, ఎలా ఎన్నో శిల్పాలను సున్నితంగా చెక్కబడినవి.
ఇలాగే గుఱ్ఱములు, వేట, వీరభటులు, జంతువులు, వేటకుక్కలు, హంసలు, కేంనేరులు, పురుష మృగములు, వృక్షములు, యోగాసన మూర్తులు, ఋషులు, సాధకులు, స్త్రీలు, న్రుత్యభంగిమలు, మర్దళాది వాయిద్యవాదకులు, గణపతి, సాలీడు, పాము, ఏనుగులు, శివార్చన, తన్నాది కథ, ఒక స్త్రీ తన చనుబాలను శిలింగముపై పిండుట, శివుడు యముని నుండి మార్కండేయుని రక్షించడం, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, దక్షయజ్ణ ధ్వంసము, దేవ,గంధర్వ, అప్సరాల శిల్పాలు, లింగోద్భవమూర్తి, పార్వతీ కళ్యాణము, అలాగే దక్షిణ ప్రాకారం మీద సూర్యచంద్రులు, తాటకవధ, పూతన వధ, దిక్పాలురు, దశావతారాలు, గజేంద్రమోక్షము, క్షీరసాగర మథనము, శ్రీకాళహస్తి జన్మవృత్తాంతం, అర్జనుడు పాసుపతాస్త్రమునకై తపస్సు, పంచముఖలింగం, విశ్వరూపం, వరాహమూర్తి, శివ నాట్యం, బ్రహ్మ, విష్ణు, పమధగణాలు, దేవతలు, ఒక భక్తుడు శివదర్శనం కోరి తన తలను ఖండించుకొనడమ్, వినాయకుడు పిల్లన గ్రోవి ఊదటం, శిబి చక్రవర్తి కథ, విష్ణులీల చిత్రాలు, గోపికా వస్త్రాపహరణం, ఒంటెలు, నాగబంధ శిల్పం, అలాగే ఉత్తరపు ప్రాకారములో రెండు తలల గల గండభేరుండ పక్షి, 22 చేతులతో ఉన్న పక్షి ఆకారము, మహిషపుర మర్దినిక్, వేటలో ఉన్న బోయ దంపతులు, అలాగే పడమటి ప్రాకారంలో పదిచేతులు గణ వీరభద్రమూర్తి, పెద్దపులి, కొండచిలువల పోరాటం, ఒక కోతి ఈతచెట్టుపై కూర్చుని కళ్ళు త్రాగడం, కొన్ని శక్తి మూర్తులు, జీబ్రాలు, సర్పములు, నంది విగ్రహాలు, ఉచ్ఛిష్ట గణపతి, పులిని తన కొమ్ములతో ఒక దున్న చంపడం, మూడు శరీరాలకు ఒక తల, ఒక లేడికి రెండు తలలు వంటి ఎన్నో మరియు ఎన్నెన్నో అద్భుత శిల్పాలు చిత్ర-విచిత్రంగా చెక్కబడ్డాయి.
రైలు మార్గము:
సికింద్రాబాద్ - షాద్నగర్ - మహబూబ్నగర్ - గద్వాల - అలంపూర్ రోడ్ - కర్నూలు - ద్రోణాచలం - నంద్యాల - గిద్దలూరు - మార్కాపూర్ రోడ్ - గజ్జెలకొండ - వినుకొండ - నరసరావుపేట - గుంటూరు - నడికుడి - మాచెర్ల / మ్రియాలగూడ - నల్గొండ - బీబీనగర్.
సికింద్రాబాద్ - షాద్నగర్ - మహబూబ్నగర్ - గద్వాల - అలంపూర్ రోడ్ - కర్నూలు - ద్రోణాచలం - నంద్యాల - గిద్దలూరు - మార్కాపూర్ రోడ్ - గజ్జెలకొండ - వినుకొండ - నరసరావుపేట - గుంటూరు - (హైదరాబాద్ / విశాఖపట్నం) తెనాలి - చీరాల - ఒంగోలు - మద్రాస్ (చెన్నై)
బస్సు మార్గము:
హైదరాబద్ - అచ్చంపేట - శ్రీశైలం - డోర్నాల - వినుకొండ - నరసరావుపేట - గుంటూరు - విజయవాడ
హైదరాబద్ - అచ్చంపేట - శ్రీశైలం - డోర్నాల - మార్కాపురం - ఒంగోలు
హైదరాబద్ - అచ్చంపేట - శ్రీశైలం - డోర్నాల - ఆత్మకూరు నంద్యాల - మహానంది
హైదరాబద్ - అచ్చంపేట - శ్రీశైలం - డోర్నాల - ఆత్మకూరు - నందికొట్కూరు - కర్నూలు
సమీప రైల్వే స్టేషన్ = మార్కాపురం రోడ్ (అక్కడి నుండి బస్సులపై సుమారు 80 కి. మీ. లో శ్రీశైలం)
సమీప విమానాశ్రయం - హైదరాబాద్
ద్వాదశ జ్యోతిర్లింగాలు - 3. మహాకాళేశ్వర జ్యోతిర్లింగము, ఉజ్జయిని, మధ్యప్రదేశ్
అవంతికాయాం విహితావతారం, ముక్తిప్రదానాయ చ సజ్జనానాం |
అకాల మృత్యోః పరిరక్షణార్థం, వందే మహాకాల మహాసురేశమ్ ||
అకాల మృత్యువు నుండి రక్షించి సజ్జనులకు ముక్తినిచ్చుటకు అవంతి నగరము (ఉజ్జయిని)లో అవతరించిన మహాకాలుడను పేరు గల దేవదేవునకు నమస్కరిస్తున్నాను.
ఇక్కడి అమ్మవారు మహాకాళి. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. సతీదేవి మోచేయి పడిన చోటు.
పురాణగాధ: మాలవదేశంలో అవంతీ (నేతి ఉజ్జయిని) నగరం శిప్రానది ఒడ్డున ఉంది. భారతదేశంలో మోక్షదాయకమైన ఏడూ నగరాలలో ఈ అవంతీనగరం ఒకటి.
"అయోధ్యా, మధురా, మాయా, కాశీ కాంచి, అవంతిక |
పురీం ద్వారవాతిం చైవ సప్తైతే మోక్షదాయకాః ||
అని పురాణ వచనం.
స్కాందపురాణంలోని అవంతీ ఖండం, శివపురాణంలోను, మహాభారతంలోను ఈ నగరం గొప్పదనాన్ని ఎంతగానో వివరించ బడింది. ఉజ్జయిని నగర నివాసము, శిప్రా లేక క్షిప్రా నదిస్నానం, మహాకాళేశ్వర దర్శనము మరియు ధ్యానము అన్ని పాపాలను నశింపజేసి, అష్ట దరిద్రాలను దూరంచేసి మోక్షమిస్తుందని స్కాందపురాణము, అవంతికాఖండము 26వ అధ్యాయములో 17, 18 మరియు 19 శ్లోకములలో వివరింపబడింది. శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు చదువుకున్న సాందీపని ఆశ్రమం ఈ నగరంలో శిప్రా నది ఒడ్డున ఉంది. చరిత్ర ప్రసిద్ధి గన్న విక్రమాదిత్య మహారాజు ఈ ఉన్నాయిని నగరాన్ని రాజధానిగా జేసుకొని పరిపాలించాడు. ఇతని సోదరుడు 'భట్టి' మంత్రిగా, మరొక సోదరుడు భర్తృహరి విరాగియైన మహాపండితుడుగా, కాఌదాసాది మహాకవులు ఇతని ఆస్థానములో నవరత్నములుగా ప్రసిద్ధి. ఇతని కాలంలోనే వ్రాహమిహిరాది జ్యోతిశాస్త్రవేత్తలు శాస్తాన్నెంతో అభివృద్ధి చేసారు. గ్రహాది నబోరాసుల పరిశీలనకనువుగా ఒక నక్షత్ర శాలనే ఇక్కడ నిర్మించారు. జ్యోతిశాస్త్రమునకు ఆయువు పట్టైన "దేశాంతర శూన్యరేఖ' ఉజ్జయిని నుండే ప్రారంభమైనది. జ్యోతిశాస్త్రంలో సున్నా డిగ్రిగా పరిగణించేది ఈ ఉజ్జయినీ లంకారేఖయే.
పౌరాణికగాధ:
ఒకప్పుడు ఉజ్జయినీ నగరంలో వేదవేదంగవేత్త, నిత్యపార్థివశ్రీలింగ పూజా తత్పరుడు అయిన 'వేదప్రియుడు' అను బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతనికి 'దేవప్రియుడు, సుమేదసుడు, సుక్రుతుడు, ధర్మబాహుడు' అను నలుగురు కుమారులు కలిగారు. వారి సుగుణముల వలన ఉజయినీ నగరమే బ్రహ్మతేజముతో కళకళలాడింది.
అదే ఉజ్జయినికి దగ్గరలో ఉన్న 'రత్నమాల' అను పర్వతమున 'దూషణుడు' అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తపస్సుచేసి బ్రహ్మనుండి వరములను పొందేడు. ఆ వర గర్వముతో, దేవతలను ఓడించి, యజ్ణాది క్రతువులను ధ్వంసించేసి, చేసేవారిని హింసించేవాడు. ప్రజలు భయపడి, వేదోకత ధర్మాలను వీడారు, పుణ్యతీర్థములు నిస్సారములయ్యాయి. కాని ఉజ్జయినిలో మాత్రం వైదిక ధర్మం చెడిపోక, సిరిసంపదలతో కళకళలాడేది. అదిచూసి సహించలేక, ఆ రాక్షుసుడు ఉజ్జయిని ప్రజలను శిక్షింపదలచి, తన నలుగురు బంటులను పంపి ప్రజలను బెదిరించి, వారు పూజలవి విడిచిపెట్టి తన శరణు కోరకపోతే వారి జీవితములు ముగిసినట్లే అని హెచ్చరించాడు.కాని వారు వాని మాటలను భయపడలేదు.
అప్రమత్తులైన ప్రజలకి వేదప్రియుని కొడుకులు ధైర్యం చెప్పి, దూషణుడు దండెత్తకమానడని తెలిపి, ఒక పార్థివ శివ లింగాన్ని నిర్మించి, యధాశాస్త్రంగా ఏకాగ్రచిత్తులై శివపూజ చేయసాగారు. అదిచూసి దూషణుడు, వారిని చంపనెంచి బ్రాహణులని కూడా చూడక బాధింప మొదలుపెట్టిన, వారు శివపూజ మానలేదు. ఆ సమయమున పార్థివలింగ ప్రతిష్ఠ జరిగిన చోట భయంకరమగు శబ్దముతో పెద్ద అఖాతము ఏర్పడి, దాని నుంది మహేశ్వరుడు ఉద్భవించి, ఒక్క హుంకారంతో దుర్మార్గుడైన దూషణాసురిని మరియు అతని సేవకులను సంహరించాడు. శివసాక్షాత్కారమువలన దేవతలు పుష్పవర్షము కురిపించారు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలు వచ్చి, మహేశ్వరుని పూజించారు. అప్పుడు శివుడు వారము కోరుకొమ్మనగా, వారు 'మహాకాళేశ్వరా' నీవు ఈ స్థలముననే జ్యోతిర్లింగంగా వెలసి భక్తుల అభీష్టములను తీర్చుచు, వారికి మోక్షమును ప్రసాదించుచుండమని కోరారు. వారి కోరిక మన్నించి, పరమేశ్వరుడు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగమై వెలసి భక్తుల కోరికలను తీరుస్తూ, చిత్తశుద్ధిని, ముక్తిని ప్రసాదిస్తున్నాడు.
ఇక సూతుడు సౌనకాది మునులకు మహాకాళేశ్వరుని అరాధించిన భక్తుల చరిత్ర చెప్పుట.
ఒకప్పుడు ఈ ఉజ్జయినీ నగరాన్ని మహాశివభక్తుడైన 'చంద్రసేనుడు' అనే రాజు పరిపాలించేవాడు. ఒకనాడు అతడు శివపూజలో నిమగ్నుడైయున్న సమయంలో శ్రీకరుడు అనే అయిదేండ్ల గోపబాలకుడు తన తల్లితో అక్కడికి వచ్చి చూసి, తనుకూడా అలాగే శివుని పూజించాలనుకొని, తిరుగు దారిలో ఒక గులకరాయిని తీసుకొని వచ్చి, అదే శివలింగముగా భావించి, దానికి అభిషేకము, చందన పుష్పాదులతో అతిశ్రద్ధగా పూజ చేయసాగాడు. ఒకనాడ బాలుడు ధ్యానములో బాహ్య స్మృతిలేని సమయంలో అతని తల్లి భోజనానికి చాలాసార్లు పిలిచి, విసిగిపోయి, శివలింగమును, పూజాద్రవ్యములను తీసిపారవేసి, బాలుని బలవంతముగా భోజనమునకు తీసుకొనిపోగా, ఆ బాలుడు శంభో అని విలపిస్తూ, మహాదేవా అని ఎలుగెత్తి పిలువగా, తల్లి ఇక వేరేమి చేయునది లేక ఇంటిలోని వెళ్ళిపోయింది. అలా విలపిస్తున్న బాలుడు మూర్ఛపోగా, శివుడు కరుణించి ఆ బాలుని పునర్జీవితుడిని చేశాడు. బాలుడు కనులు తెరిచేసరికి, అక్కడ ఒక దివ్య మందిరము, అందు జ్యోతిర్లింగము దర్శనమివ్వగా, బాలుడు మరింత సంతోషముతో శివున్ని స్తుతించాడు. తిరిగి బాలునికి వచ్చిన తల్లి జరిగినంతయు చూచినదై, బిడ్డడిని ఎత్తుకొని మైమరచిపోయింది. ఈ విషయము, రాజైన చంద్రసేనునికి తెలిసినవెంటనే వచ్చి, బాలుని కొనియాడుచున్న సమయములో, అక్కడా హనుమంతుడు ప్రత్యక్షమై, అక్కడున్న భక్తులికి, "ప్రపంచమున పరమశివునికి మించిన తత్వము ఇంకొకటి లేదని, మహర్షులు వేలసంవత్సరాలు తపస్సుచేసిన పొందలేని మహాఫలము ఈ బాలుకుడు ఆ దయామయుని కృప వలన పొందాడని, మరలా ఈ బాలకుని వంశమున ఎనిమిదవ తరము వాడుగా ఈ శ్రీకరుడనే బాలకుడే నందగోపుడను పేరున పుట్టి, శ్రీకృష్ణుని వాత్సల్యమును మరియు ప్రేమను పొంది తరిస్తాడని చెప్పి అంతర్థానమవుతాడు".
చరిత్ర: చైనా యాత్రికుడు 'హుయాన్త్సాంగ్ ' రచనలలోను, బాణుని కాదంబరిలోను, శూద్రకుని మృచ్ఛకటిక నాటకంలోను, కథా సర్త్సాగరంలోను, కాళిదాసుని కావ్యాలలోను, ఇంకా మరెన్నో సంస్కృత గ్రంథాలలోను ఉజ్జయిని వైభవం వర్ణితమై ఉంది. విక్రమాదిత్యుడనే బిరుదు పొందిన చంద్రగుప్తుని తరువాత, మౌర్యులు, తుంగ, గుప్త, హూణులు, పరమార్ వంశపు రాజులు పరిపాలించారు. వీరిలొ భోజరాజు చిరస్మరణీయుడు. అందరికంటే చివరి వాడు శిలాదిత్యుడు. ఇతని తరువాత ముస్లిములు, మొగలాయిలు పాలించారు. 12-16 శతాబ్దాల మధ్య ఉజ్జయిని చాలా దాడులకు మరియు దోపిడీలకు గురి అయింది. సుల్తానుల పాలనలో దోపిడీ పరాకాష్టకు చేరి నిత్య పూజావైభావాలు అంతరించి పోయాయి. 1650లో రాజా సవాయిసింగ్ గవర్నర్ గా నియమింపబడినాక, శిధిలమైన దేవాలయాలను, నక్షత్రశాలను అతడు పునరుద్ధరించాడు. 17వ శతాబ్ద ప్రారంభంలో మరాఠీల ఆధిపత్యంలో వచ్చి ఆలయ పునరుద్ధరనే గాక, మరెన్నో దేవాలయాలను నిర్మింపబడినాయి. ఆ తరువాత సింధియాల పాలనలో దౌలత్రావు సింధియా 1810లో రాజధానిని ఉజ్జయిని నుంచి గ్వాలియర్ కి మార్చాడు.
దర్శనీయ స్థలములు:
1. మహాకాళేశ్వర మందిరము - రైల్వే స్టేషన్ కు మైలు దూరంలో ఉంది. విశాలమైన ప్రాంగణం మధ్యలో మహాకాళ మందిరము, ఎదురుగా పైభాగమున ఓం కాలేశ్వరుడు, అతని క్రింద మహాకాళేశ్వరుడు (రెందు అంతస్తులు) - మహాకాళేశ్వరునికి ఒకవైపు గణేశుడు, ఇంకోవైపు కుమారస్వామి, మరొక వైపు పార్వతి వెలసి ఉన్నారు. మందిర పైభాగంలో దక్షిణమున అనాది కాళేశ్వర, వృద్ధ కాళేశ్వర మందిరాలున్నాయి. ఈ మందిరానికి సమీపంలో ఒక సభామండము, దగ్గరలో కోటి తిర్థమనే సరోవరము, దాని సమీపములో చిన్న చిన్న శివఛత్రములు, దేవాస్ రాజ్యానికి చెందిన ధర్మశాల ఉన్నాయి. సభామండములో శ్రీరామ మందిరం, దాని వెనుక అవంతికాపుర అధిష్ఠాన దేవతయైన అవంతికాదేవి మందిరములు ఉన్నాయి. మహాకాళేశ్వర మందిర సమీపంలోనే బడాగణేశ మందిరమున్నది. దానికి దగ్గరలో సప్తధాతుమయమైన పంచముఖాంజనేయ మందిరము, ఇతర దేవతా మూర్తులు ఉన్నాయి.
2. హరిసిద్ధి దేవి - రుద్ర సరోవరమునకు దగ్గరలో విశాలప్రాకారంలో ఈ మందిరము ఉన్నది. ఇది అవంతిక శక్తి పీఠము. విక్రమాదిత్యుడు ఆరాధించిన భవాని ఈమెయే. ఇచటి దేవీ పీఠమున ఉన్నది శ్రీ చక్రము. దాని వెనుక అన్నపూర్ణా మందిరము. దాని తూర్పుద్వార సమీపమున చిన్నబావి, మధ్యలో స్తంభము, దగ్గరలో సప్తసాగరమనే సరస్సు, వెనుక అగస్తేశ్వర మందిరము కలవు. మహాకాళ మందిరము నుండి ప్రధాన వీధికి వెళ్లుత్రోవలో 24 స్తంభముల మండపము భద్రకాళీదేవి ఇచ్చటనే ఉంది.
3. బడా గణేశ్.
4. గోపాల మందిరము - ఇది మధ్యవీధిలో ఉంది. ఇందులో రాధా-కృష్ణ, శంకర మూర్తులున్నాయి. ఈ మందిరాన్ని రాజాదౌలత్ సింధియా భార్య బాయజాబాయి కట్టించింది.
5. గఢ్ కాళిక - ఈ గుడికి గోపాల మందిరము నుండి మార్గమున్నది. మహాకవి కాళిదాసు ఈ కాళిని ఆరాధించియే మహాకవి అయ్యాడు. ఈ మందిరానికి సమీపంలో స్థిరగణేశ మందిరము, దానికెదురుగా ప్రాచీన హనుమ మందిరము ఉన్నవి. అచట శ్రీ మహావిష్ణుని విగ్రము, దానికి దగ్గరలో గౌరభైరవమూర్తి, దానికి సమీపంలో చ్ఛిప్రాఘాటు, ఆ తరువాత మహాశ్మశానం ఉన్నాయి.
6. భర్తృహరి గుహ - మహాకాళీ దేవళమునకు ఉత్తరముగా రెండు ఫర్లాంగుల దూరములో భర్తృహరి గుహ, అతని సమాధి ఉన్నాయి.
7. కాల భైరవుడు - నగరానికి 3 మైళ్ళదూరంలో శిప్రానది ఒడ్డున ఒక దిబ్బపై ఈ క్షేత్రము ఉన్నది.
8. సాందీపని ఆశ్రమం (అంకపదము) - గోపాల మందిరమునుంది రెండు మైళ్ళ దూరంలో మంగళనాధ క్షేత్రమునకు వెళ్ళుత్రోవలో ఉన్నది. దీనికి దగ్గరలో విష్ణు సాగరము, పురుషోత్తమ సాగరము ఉన్నాయి. చిత్రగుప్తుని ప్రాచీన స్థానమిచటనే ఉన్నది. సాందీపని ఆశ్రమమునకు అవతల జనార్ధన మందిరము ఉన్నది.
9. సిద్ధవటము - కాలభైరవ క్షేత్రమునాకు తూర్పుభాగమున శిప్రానది అవతలి ఒడ్డున సిద్ధవట ఈ ప్రసిద్ధ స్థానమున్నది. ఇక్కడి వటవృక్షము మొదట్లో నాగబలి, నారాయణబలి మొ.నవి సమర్పించి సిద్ధవటమును ఆరాధిస్తారు.
10. మంగళనాధుడు - ఈ క్షేత్రము సందీపని ఆశ్రమము అవతల దిబ్బపై ఉన్నది. భూదేవి కుమారుడైన అంగారకుడు (కుజుడు) ఇక్కడే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రతి మంగళవారము విశేష పూజలు జరిగుతాయి.
11. నక్షత్ర వేదశాల (యంత్ర మహల్) - ఇది శిప్రానదికి దక్షిణ తీరమున జీర్ణావస్థలో ఉంది.
12. శిప్రా నది - రైల్వే స్టేషన్ నుండి మైలున్నర దూరంలో ప్రవహిస్తుంది. ఇక్కడ ఘాట్లలో నరసింహ, రామ, శాపవిమోచన, ఛత్ర, గంధర్వ ఘట్టములు ముఖ్యమైనవి. అవతలి గట్టున దట్టక అఖాడా, కేదారేశ్వరము, రణజీత్, హనుమాన్ మందిరములు, మహాశ్మశానమునకు అవతల వీరదుర్గాదాస్ రాఠౌర్ కాతరి, ఋణ ముక్త మహాదేవక్షేత్రము ఉన్నాయి.
పైన పేర్కొనబడినవియేగాక ఇంకెన్నో శివాలయాలు, శక్తి ఆలయాలు, తీర్థములు, భైరవ ఆలయాలు, రుద్ర క్షేత్రాలు ఇంకెన్నో ఆలయాలు ఉన్నాయి. స్కాంద పురాణవచనముల బట్టి :
"శ్మశానమూషరం క్షేత్రం పీఠంతు వసమే వచ |
పంచైకత్ర నలభ్యంతే మహాకాళవనాదృతే ||
"మహాశ్మశానం, ఊషరక్షేత్రము, శక్తిపీఠము, మహాకాననము, మఖాకాళేశ్వరం, అను ఈ అయిదు దేవ దుర్లభాములు. - ఇచట మరించిన వారికి తిరిగి జన్మ ఉండదు కావున ఇది ఊషరక్షేత్రమని, పాపాలను నశింపజేస్తుంది కావున ఈ క్షేత్రమును మహాశ్మశానమని, మహాకాళవనమని, మోక్షప్రదమైనదని ఉజ్జయిని పేరొందింది.
రైలు మార్గాలు:
1. సికింద్రాబాద్ - ఖాజీపేట - నాగపూర్ - భోపాల్ - దుక్సి - ఉజ్జయిని.
2. చెన్నై - విజయవాడ - వరంగల్ - నాగపూర్ - భోపాల్ - దుక్సి - ఉజ్జయిని.
3. సికింద్రాబాద్ - ఖాజీపేట - నాగపూర్ - ఇటార్సి - భోపాల్ - ఇండోర్ - బార్వా - ఓంకారేశ్వర్.
4. చెన్నై - విజయవాడ - వరంగల్ - నాగపూర్ - ఇటార్సి - భోపాల్ - ఇండోర్ - బార్వా - ఓంకారేశ్వర్.
5. ముంబాయి - మన్మాడ్ (పూనా) - భువసాల్ - ఇటార్సి - భోపాల్ - ఇండోర్ - బార్వా - ఓంకారేశ్వర్.
సమీప విమానాశ్రయం - ఇండోర్.
ద్వాదశ జ్యోతిర్లింగాలు - 4. అమరేశ్వరుడు/అమలేశ్వరుడు - ఓంకార్, మధ్యప్రదేశ్
కావేరికా నర్మదయోః పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ |
సవివ మాంధాత్రు పురే వాసం తం, ఓంకార మీశం శివమేక మీడే ||
"కావేరీ, నర్మదా నదుల సంగమించు ప్రాంతంలో మాంధాత (షోడశ మహారాజులలో ఒకడు) నిర్మించిన పట్టాణములో సజ్జనులను తరింపజేయడానికై నివసించుయున్న ఓంకారేశ్వర నామధారుడైన శివుని పొగుడుతాను".
ఓంకారేశ్వరుని భార్య ఓంకారేశ్వరి - అమరేశ్వరుని భార్య అన్నపూర్ణాంబ - నర్మదా నదికి రెండు వైపులా ఉన్న ఈ రెండు లింగాలు దర్శనీయములు.
పురాణగాధ:
ఒకప్పుడు నారదుడు శివుని ఆరాధించడంకోసం గోకర్ణ క్షేత్రానికి వెళ్లి తిరిగివస్తూ వింధ్య పరవతం దగ్గరకు వచ్చాడు. వింధ్య పర్వతుడు నారద మహర్షికి స్వాగతం చెప్పి "నేను పర్వతరాజును, సర్వ సంపన్నుడను, ఏ విషయంలోను లోపంలేదు" అని గర్వంగా పలికాడు. అపుడు నారదుడు అతని గర్వమణపదలచి, "మేర్వుతో పోలిస్తే నీవెంటి వాడవు" అని త్రుణీకరించాడు. అపుడు వింధ్యుడు బాధపడి, "ఓంకార క్షేత్రమునకు వెళ్లి అక్కడ ఒమ పార్థివలింగాన్ని నిర్మించి ఏకదీక్షతో శివునికి తపస్సు చేసిన, శివుడు ప్రత్యకక్షమై వారము కోరుకోమనగా, తమ తప్పిదము ఎరిగినవాడై మరియు తపస్సుతో తన అహంకారము నశించినవాడై, "పరమేశ్వరా! నా బుద్ధి ఎల్లపుడు ప్రసన్నముగా ఉండునట్లు, నీవు ఎల్లప్పుడు నా శరస్సుపై నిలచి ఉండుమని" కోరగా, శివుడు జ్యోతిర్మయి రూమలో స్థిరంగా ఉండిపోయాడు. పార్థివాకారంలో అమలేశ్వరుడు / అమరేశ్వరుడు అను రెండు పేర్లతో అక్కడ ఆవిర్భవించి దేవతల స్తుతులను అందుకొన్నాడు. ఈ రెండు లింగాల రూపంలో ఉన్న శివుడు ఒకే జ్యోతిర్లింగము.
ఈ క్షేత్రములో నర్మదానది 'నర్మదా, కావేరి' అను రెండు పాయలుగా ప్రవహిస్తోది. I రెండు పాయల నడుమ ఉన్న ప్రదేశాన్ని 'మంధాత్రుపురి, శివపురి' అనే పేర్లతో పిలుస్తారు. కారణమేమిటంటే:
(1) ఒకప్పుడు సూర్య వంశపు రాజైన "మాంధాత' అను నతడు ఈ పర్వతముపై చాలా సంవత్సరాలు చేసి శివున్ని ప్రసంని చేసుకొని, స్వామికి దేవాలయం నిర్మించాడు కనుక దీనికి మాంధాత్రుపురి అని పేరు వచ్చింది.
(2) మాంధాత కట్టించిన శివాలయము మరియు ఇతర ఆలయాలను ఆకాసంనుండి చూస్తే ఓంకార రూపంలో కనిపస్తాయి కనుక ఓంకారేశ్వరుడని పేరు వచ్చింది.
(3) భక్తుల మలినములను తొలగిస్తాడు కనుక అమలేశ్వరుడని పేరు వచ్చింది.
అమరాణాం శతైశ్చైవ సేవితోహ్యమలేశ్వరః |
తథైవ ఋషిసంఘైశ్చ తేన పుణ్యతమో మహాన్ ||
(స్కాందపురాణాం - రేవాఖండం - 28 అధ్యాయం)
ఈ క్షేత్రమున వెలసిన అమలేశ్వరుడు / అమరేశ్వరుడు ముక్కోటి దేవతల చేతను, ఋషి సంఘముల చేతను అనాదికాలము నుంది ఆరాధింపబడుచుండుట చేత పవిత్రతముడై అలరారుచున్నాడు.
చరిత్ర: ఈ క్షేత్రమును మౌర్యులు, గుప్తులు, పరమార్ రాజుల పరిపాలనలో యెంతో దివ్యంగా వెలుగొందింది. మహమ్మద్ ఘజిని విధ్వంసం చేసిన శివాలయాలలో - సోమనాధ్ తరువాత - ఇది రెండవది. పరమార్ రాజుల తరువాత ఈ క్షేత్రము ముస్లింల దండయాత్రల వలన శిధిలావస్థకు చేరినా, ఆ తరువాత మరాఠీల ఆధిపత్యంలో తిరిగి పునరుద్ధింపబడింది.
దర్శనీయ స్థలాలు:
1. కోటి తీర్థము
2. కోటేశ్వర
3. హాటకేశ్వర
4. త్రయంబకేశ్వర
5. గాయత్రీశ్వర
6. సావిత్రీశ్వర
7. భూరీశ్వర
8. శ్రీకాళికా
9. పంచముఖ గణేశ్వర
10. ఓంకారేశ్వర
11. శుకదేవ
12. మాంధాత్రీశ్వర
13. మనోగణేశ్వర
14. శ్రీద్వారకాధీశ్వర
15. నర్మదేశ్వర
16. మహాకాళేశ్వర
17. వైద్యనాధేశ్వర
18. రామేశ్వర
19. జాలేశ్వర
20. విశల్యేశ్వర
21. అంధకేశ్వర
22. ఝమకేశ్వర
23. నవగ్రహేశ్వర
24. శ్రీమారుతిరాయ
25. సాక్షిగణేశ్వర
26. అన్నపూర్ణాంబ
27. తులసీదేవి
చూడదగినవి
ఆ తరువాత
28. అవిముక్తేశ్వర
29. దరియానాధ గద్ది
30. వటుక భైరవుడు
31. మంగళేశ్వరుడు
32. నాగచంద్రేశ్వరుడు
33. దత్తాత్రేయుడు
34. కాల-గౌర భైరవులు
35. శ్రీరామ మందిరము
36. గుహలో ఉన్న ధ్రుష్ణేశ్వరుడు మరియు నర్మదాదేవి
37. శ్రీచక్రేశ్వరుడు
38. గోదంతేశ్వరుడు
39. మల్లికార్జునుడు
40. త్రిలోచనేశ్వరుడు
41. గోపేశ్వరుడు
42. అమలార్జునేశ్వరుడు
43. ఋణముక్తేశ్వరుడు
44. గౌరీ సోమనాధ విశాల లింగమూర్తి (మామాభాంజా అని కూడా అంటారు)
45. నందీశ్వర
46. గహేశ్వర
47. హనుమంత
48. అన్నపూర్ణ
49. మహిషాసురమర్దిని
50. సీతారసోయి
51. ఆనంద భైరవుడు
52. దుర్గాభవాని
53. శ్రీదేవి
54. సిద్ధనాధ
55. కుంతీ మాతృ దేవతలు
56. భీమార్జునులు
57. భీమశంకరుడు
58. కాలభైరవుడు
59. శ్రీమన్నారాయణుని 24 మూర్తులు
60. పసుపతినాధుడు
61. గదాధరుడు
62. లాటభైరవ గుహలో కాళేశ్వరుడు
63. 56 భైరవులు
64. కల్పాంత భైరవుడు
65. ఓంకారేశ్వరుడు
ఇంకా
66. గోకర్ణేశ్వరుడు
67. మహాబలేశ్వరుడు
68. ఇంద్రేశ్వరుడు
69. వ్యాసేశ్వరుడు
70. అమరేశ్వరుడు
71. వృద్ధ కాళేశ్వరుడు
72. భాగేశ్వర
73. ముక్తేశ్వర
74. కర్దమేశ్వరుడు
75. తిలభాందేశ్వరుడు.
76. కార్తికేయుడు
77. అఘోరేశ్వర గణపతి
78. బ్రహ్మేశ్వర
79. లక్ష్మీనారాయణ
80. కాశీవిశ్వేశ్వర
81. శరణేశ్వర
82. కపిలేశ్వర
83. గంగేశ్వర
84. విష్ణు
85. వరుణేశ్వర
86. నీలకంఠేశ్వర
87. శిలామార్కండ ఈశ్వరుడు
88. కుబేరభాండారి
89. శంకర మందిరం
90. చ్యవన మహర్షి ఆశ్రమం
91. వారాహి
92. చాముండా
93. బ్రహ్మాంశీ
94. విష్ణవీ
95. ఇంద్రాణీ
96. కుమారి
97. మహేశ్వరి - అను సప్త మాతృకలు
98. సీతా వాటికలోని 64 యోగిని గణములు
99. 84 భైరవ మూర్తులు
100. సీతా, రామ, లక్ష్మణ కుండములు.

సమీప విమానాశ్రయం – ఇండోర్.
ద్వాదశ జ్యోతిర్లింగాలు - 5. వైద్యనాథ జ్యోతిర్లింగము (ధోన్ కు 2 మైళ్ళ దూరం - ఉత్తర ప్రదేశ్ - ప్రజ్వల్యా నగరము అని క్షేత్రం పేరు)
పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే, సదావసంతం గిరిజా సమేతం |
సురాసుర రాధిత పాదపద్మం, శ్రీ వైద్యనాథం తమహం నమామి ||
తూర్పు-ఉత్తరముల మధ్యయైన ఈశాన్యపు దిక్కున "ప్రజ్వల్య" అనే చోట ఎల్లప్పుడూ పార్వతితో నివిసిస్తూ దేవతలు-ఋఅక్షసులచేత పూజింపబడు పాదపద్మములు గల శ్రీవైద్యనాథునకు నమస్కరిస్తున్నాను.
ఇక్కడి దేవి - జయదుర్గాత్రిపుర సుందరీదేవి - అష్టాదశశక్తి పీఠాలలో ఒకటి - సతీదేవి హృదయము పడినచోటు అంటారు)
పురాణగాధ :
త్రేతయుహంలో ఒకనాడు రావణాసురుని తల్లి 'కైకసి' సముద్రపు ఒడ్డున సైకత (ఇసుక) శివలింగము చేసి పూజిస్తుండగా సముద్రపు కెరటాలలో ఆ లింగం కొట్టుకొని పోయింది. విచారంతో బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చిన తల్లిని అడిగి కారణమును తెలుసుకొని, రావణుడు ఆ పరమేశ్వరుడినే ఇక్కడకు తీసుకు వస్తానని, ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి, తన పది తలలలో ఒక్కొక్క తలను ఖండించి నైవేద్యంగా సమర్పించి, చివరి 10వ తలను కూడా ఖండించబోగ, శివుడు ప్రత్యక్షమై, ఖండించిన తలలను తిరిగి అమర్చి, ఒక వరము కోరుకొమ్మని అనుగ్రహించాడు. దానికి రావణుడు శివుని తన లంకానగరములో వచ్చి నిత్యమూ తను, తనవారు పూజించుకొనే అవకాశమును కల్పించమని కోరాడు. అపుడు శివుడు సర్వాభీష్ట ఫలప్రదమైన తన ఆత్మ లింగమును ఇస్తూ, లంకకు తిరిగి వెళ్ళునప్పుడు, మధ్యలో ఎక్కడను భూమిపై పెట్టరాదని, అలా జరిగిన అది అక్కడనే ప్రతిష్ఠింపబడుతుందని హెచ్చరించాడు.
రావణుడు అ లింగమును పట్టుకొని లంకకు బయలుదేరగా, దేవతలు భయపడి, గణేసునితో మొరపెట్టుకోగా, విఘ్నేశ్వరుడు రావణుని అనుసరిస్తూ సాయం సంధ్యా సమయం కొరకు వేచి, రావణుడు సంధ్యాసమయమాసన్నమవుతున్న తరుణంలో గోపబాలుని రూపంలో కనబడుతాడు. అపుడు రావణుడు ఆ బాలుని చేతిలో ఆ శివలింగమును ఉంచి, భూమిమీద పెట్టకుండా జాగ్రత్తగా పట్టుకొమ్మని, తాను సంధ్యావందనము చేసి తిరిగి వస్తానని చెప్పి ప్రక్కనే ఉన్న నదిలోనికి దిగుతాడు. అదేసరియైన సమయమనుకుకొని ఆ గోపబాలుడు, రావణుడు ధ్యాన నమగ్నుడై ఉన్న సమయం చూసి, "అయ్యా! ఈ లింగం క్షణ, క్షణానికీ బరువవుతున్నదినీ, తాను ఇక మోయలేనని, త్వరగా రమ్మని అరవడం మొదలు పెట్టాడు. రావణుడు ఆతురతగా వస్తున్నప్పటికినీ, తానిక మోయలేనివానిగా నటిస్తూ, భయ-భయంగా ఇక మోయలేక వదిలివేసినట్లు ఆ లింగాన్ని భూమిపైన పెట్టేస్తాడు. చాలా విచారించిన రావణుడు, బలగర్వంతో, ఆ లింగాన్ని భూమినుండి పకలించుకొని పోదామని సర్వవిధాలా ప్రయత్నించిన, ఒక్క అంగుళముకూడా పైకి లేవలేదు. అప్పుడు అశరీరవాణి, "రావణా! శివాజ్ణను నీవు మీరలేవు కనుక వృధాప్రయాసలు మాని, ఆ లింగముని పూజించె నీ శ్రమనుంది విముక్తి పొందుమని" పలికింది. ఆ తరువాత బ్రహ్మాది దేవతలందరు అక్కడి వచ్చి, ఆ జ్యోతిర్లింగాన్ని అభిషేకాది అర్చనలు చేసారు.
రావణునికి స్వస్థత చేకురినందున, ఆ నాటి నుండి "వైద్యనాథ" లింగంగా పేరుగాంచింది. ఈ లింగమును పూజించినవారికి సకల వ్యాధులనుండి విముక్తి లభించి భోగభాగ్యములు మరియు మోక్షము కలుతాయి.
పురాణ కాలంలో చితాభూమిగా ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రము, ఈనాడు వైధ్యనాథ్గా / బైద్యనాథ్-ధామ్ (దేవఘర్) గా పిలువబడుతోంది. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో జస్సిడి అను రైల్వేస్టేషన్ కు 6 కి.మీ. దూరంలో ఉంది. విచిత్రమేమిటంటే ఇదే స్థలపురాణంతో "వైద్యనాధ్" పేరుతో మరో 4 శివలింగ క్షేత్రాలున్నయి. అవి:
(1) మహారాష్ట్రలోని పర్లి గ్రామంలో.
(2) నాందేడ్ కు 20 కి.మీ. దూరంలో గంగాఖేడ్ దగ్గర.
(3) పంజాబ్ రాష్ట్రంలో 'కీర' అను గ్రామంలో.
(4) హిమాచల్ ప్రదేశ్ లో పఠాన్ కోటకు 155 కి.మీ. దూరంలో.
ఇవేగాకుండా కర్ణాటకలో గోకర్ణం క్షేత్రం వద్ద కూడ విఘ్నేశ్వరుడు భూస్థాపితంచేసిన శివలింగం అదేనని అక్కడివారు చెబుతారు. అక్కడి శివలింగమునకు "గోకర్నేశ్వరుడ"ని, అమ్మవారికి "తామ్రగౌరి" అని పేర్లు.
చరిత్ర:
ఈ క్షేత్రము మౌర్య సామ్రాజ్యంలోనూ, గుప్త సామ్రాజ్యంలోను ఒక భాగంగా వారి సేవలను పొందింది. తరువాత పాల రాజులు, మొగలు చక్రవర్తులు, బీహార్ బెంగాలు నవాబుల పాలనలో ఉండేది.
దర్శనీయ స్థలాలు:
ఈ ఆలయప్రాంగణములో 21 గోపుర శిఖరాలు ఉన్నాయి. ఈ దేవాలయ గర్భగృహాన్ని విశ్వకర్మ నిర్మించాడని అంటారు. దేవాలయ కోనేరు "శివగంగ"లో స్నానము రోగనివారకమని భక్తుల విశ్వాసము. ఇక్కడ:
(1) పార్వతి ఆలయం - గౌరీ మందిరము (శక్తిపీఠము - శ్రీ జయదుర్గ త్రిపురసుందరి విగ్రములు)
(2) దుర్గా మందిరము (నవ దుర్గా ఆలయం)
(3) బైజ భక్తి మందిరము
(4) అనుకూర్ ఠాకూర్ ఆశ్రమం
(5) విద్యాపీఠ్
(6) కార్తికేయ మందిరము - మదనమోహన, కార్తికేయ విగ్రములు.
ముఖ్యమైనవి.
ఇంకా
(7) గణపతి
(8) బ్రహ్మ
(9) సంధ్యాదేవి
(10) భైరవకాల
(11) హనుమ
(12) మానసాదేవి
(13) సరస్వతి
(14) సూర్య
(15) బగళాదేవి
(16) శ్రీరామ
(17) ఆనంద భైరవ
(18) గంగాద్వార
(19) మాసిక వేదిక
(20) హరగఊరి
(21) కాలిక
(22) అన్నపూర్ణ
(23) చంద్ర కూప
(24) లక్ష్మీనారాయణ
(25) నీలకంఠమహాదేవ
రైలు మార్గము :
హైదరాబాదు / చెన్నై / విజయవాడ - రాజమండ్రి - విశాఖపట్నం - ఖుర్దారోడ్ - భువనేశ్వర్ - హౌరా - అసన్సోల్ - మధుపూర్ - జస్సిడి - వైద్యనాధ్.
డిల్లీ - వారణాసి - దంపూర్ - పాట్నా - జస్సిడి - వైద్యనాధ్.
ద్వాదశ జ్యోతిర్లింగాలు - 6. భీమశంకర జ్యోతిర్లింగము -- ఢాకినీ - మహారాష్ట్రలోని ఖేడ్ ప్రాంతము.
యం ఢాకిని శాకినికా సమాజైః, నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదివ భీమాది పద పరసిద్ధం, తం శంకరం భక్తహితం నమామి ||
మాంసము తినే ఢాకిని శాకినీ సమూహముల చేత సేవింపడుతూ, భీముడు (లేక భయంకరుడు) అని పేరుతో ప్రసిద్ధుడైన, భక్తులకు శుభములను కలిగించు శంకరునకు నమస్కరిస్తున్నాను.
ఇక్కడి అమ్మవారిని బ్రహ్మ కమలముతో పూజించుట చేత "కమలజ" అని పిలువబడుతోంది.
పురాణగాథ :
ప్రస్తుత పూనా నగరమునకు సుమారు 100 మైళ్ళ దూరంలో గల సహ్యపర్వత మండలి ఢాకినీ శిఖర ప్రాంతమున పూర్వము కర్కటుడనే రాక్షసుడు "పుష్కసి" అను పేరు గల భార్య మరియు "కర్కటి" అనే కుమార్తెతో నివసిస్తూ ఉండేవాడు. కర్కటి భర్త అయిన 'విరాధుడు'ని శ్రీరాముడు చంపటంతో, తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది.
ఢాకినీ శిఖరము నుండి పుట్టిన భీమానది యందు స్నానము చేయుటకు అగస్త్య మహర్షి సిషుడైన 'సుతీక్షణుడు' రాగా, అతనిని కర్కట-పుషసులు చంపబోగ, ఆ ముని వారిని తన తపోబలముచే భస్మము చేయుట కూతురైన కర్కటి చూస్తుంది. అలా ఒంటరిగా సహ్యాది పర్వతమున ఒక్కతే ఉండగా, రావణుని సోదరుడైన కుంభకర్ణుడు అక్కడికి వచ్చినప్పుడు, ఆమెను చూసి బలత్కరించి, కొన్నాళ్ళు విహరించి గర్భవతియైన కర్కటిని విడిచి లంకకు తిరిగి పోతాడు. పుట్టిన కొడుకుకు కర్కటి భీముడని పేరు పెట్టింది. పెద్దవాడైన భీముడు, సమీప ప్రజలను నానాహింసలు పెట్టేవాడు. ఒకనాడు, తన తండ్రి ఎవరని ప్రశ్నించగా, కర్కటి, తన మొదటి భర్త గురించి మరియు కుంభకర్ణుని వల్ల వాని జన్మవృత్తాంతము చెబుతుంది, రామ-రావణ యద్ధంలో కుంభకర్ణాదుల మరణము చెబుతూ, మూల్లోకాలనూ జయించి, వారి కీర్తిని నెలబెట్టమని కోరుతుంది. నాటినుండి ఆశ్రమ వాసులను, విష్ణు భక్తులను హింసించి, అక్కడే బ్రహ్మకి తపమాచరించి కావలసిన వరములను పొందుతాడు.
వర గర్వముతో, భీమాసురుడు దేవతలను, ఇంద్రుడిని, దిక్పాలకులను జయించి, మర్త్యలోకంలో -- భూలోకంలో -- కామరూప (నేపాల్) దేశమును పరిపాలిస్తున్న గొప్ప శివ భక్తుడైన సుదక్షిణ్యుడనే రాజును ఓడించి, కరగన బంధిస్తాడు. అయినాను, ఆ శివభక్తుడు, ఒక పార్థివలింగమును చేసి, దానిని పూజింపసాగాడు. అది తెలిల్సికొని, చూసి, వారిని పరిహసిస్తూ దూషించాడు. దానికి సుదక్షిణుడు మందలించేసరికి, కోపంతో తన చేతిలో ఉన్న కత్తిని అక్కడ ఉన్న పార్థివలింగం పైకి విసిరాడు. దాంతో శివిడు ఆ పార్థివలింగంనుండి ఉద్భవించి, తన మూడవ కంటితో భీమాసురిని మరియు అక్కడ ఉన్న రాక్షస గణములను భస్మము చేశాడు. సుధక్షిణ మహారాజు, ఇంద్రాది దేవతలు, నారద మహర్షులు శివుని స్తుతుంచి కోరగా, అక్కడ భీమశంకర జ్యోతిర్లింగముగా వెలసి సకల శుభాములనిచ్చి భక్తులను రక్షింస్తానని వరములిస్తాడు. రాక్షస మమూహములు భస్మము చేహయడిన ఆ బూడిద కాలాంతరమున ఓషధములుగా రూపొందాయి.
భీమాశంకరుడను పేరుగల శివలింగములు పైన తెలిపిన ఖేఢ్ ప్రాంతమునే గాక:
(1) ఉత్తరప్రదేశ్ లో నైనితాల్ కి 20 కే.మీ.లో ఉజ్జనాక్ అనే గ్రామంలో
(2) అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుర పర్వతంపై
(3) ఆంద్రప్రదేశ్ లో, తూర్పుగోదావరి జిల్లాలోని దక్షారామమున
కూడా ఉన్నాయి.
చరిత్ర:
శివాజీ తర్వాత మహారాష్ట్రను పాలించిన పీష్వాలలో నానా ఫడ్నీస్ అనునతడు శ్రీ స్వామి వారికి అందమైన ఆలయాన్ని నిర్మించి ఈ క్షేత్రాబి వృద్ధికి చాలా కృషి చేసాడు.
రైలు మార్గము:
విజయవాడ / హైదరాబాదు - వాడి - సోలాపూర్ - పూనా - బస్ రూట్ 120 కి.మీ. భీమాశంకర్.
రేణిగుంట - కడప - గుంతకల్ - వాడి - సోలాపూర్ - పూనా - బస్ రూట్ 120 కి.మీ. భీమాశంకర్.
బస్ రూట్
షిర్డీ / నాసిక్ / త్రయంబకేశ్వర్ - పూనా హైవే లో.
సమీప విమానాశ్రయం – పూనా
ద్వాదశ జ్యోతిర్లింగాలు - 7. రామేశ్వర జ్యోతిర్లింగము (రామేశ్వరం - తమిళనాడు)

శ్లో.
సంతామ్రపర్ణీ జలరాశి యోగే నిబద్ధ్యసేతుం విశిఖైరసంఖైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తమ్ రామేశ్వరాఖ్యం నియతం నమామి ||
ఏ నదిలో నీటి బిందువులు ముత్యపు చిప్పలో పడగానే ముత్యములుగా మారుతాయో, తనలో స్నానము చేసిన పాపాత్మునికి ముక్తిని ప్రసాదిస్తుందో ఆ తామ్రపర్ణీ నది సముద్రములో కలిసే చోట, అనేక బాణములతో వారధి (సేతువు) ను నిర్మించిన శ్రీరామచందునిచె ప్రతిష్ఠింపబడి, రామేశ్వరుడని పిలువబడుచున్న పరమేశ్వరునికి నిత్యమూ నమస్కరించుచున్నాను.
పురాణగాధ:
శ్రీరాముడు రావణ వధానంతరము లంకనుండి పుష్పక విమానంలో తిరిగి వస్తూ 'పులస్త్య బ్రహ్మ వంశమున పుట్టిన రావణ, కుంభకర్ణాది రాక్షులను సంహరిమ్చుటవలన బ్రహ్మహత్యా పాతకము కలిగినందువలన, తగిన పరిహార మేడిన చేయవలెనని తలచి, ప్రస్తుత రామేశ్వర ప్రాంతమున ఉన్న అగస్త్యముని ఆశ్రమమును చేరి, సంప్రదించి, దోశనివారణకై సముద్ర తీరమున ఒక శివలింగమును చేయ తలచి, హనుమంతుని కైలాసము నుంది ఒక శివలింగముని తెమ్మని పురమాయించాడు. శివలింగం కోసం కైలాసానికి వెళ్ళిన హనుమంతుడు ప్రతిష్ఠకు నిర్ణయించిన ముహూర్త సమయమునకు రాకపోవడంచే సైకత (ఇసుక) లింగముని ప్రతిష్ఠ చేయ నిర్ణయించి, సీతాదేవి సముద్రమందలి తడి ఇసుకతో పార్థివ లింగమును తయారుచేయగా, శ్రీరాముడు ఆ శుభ సమయానికి శివలింగమును ప్రతిష్ఠ చేసెను. దానినే రామేశ్వరుడని లేక రామేశ్వరలింగమని వ్యవహరిస్తారు.
లింగ ప్రతిష్ఠ పూర్తయిన తరువాత వచ్చిన హనుమంతుడు తాను తెచ్చిన లింగమును ప్రతిష్ఠంపబడక పోవడంచే అలిగిన, తనను ఓదార్చు నెపమున, ప్రతిష్ఠించిన లింగమును తొలగించి, హనుమ తెచ్చిన లింగమును ప్రతిష్థించెదనని శ్రీరాముడు పలుక, హనుమ తన బాల గర్వముచే ఆ సైకత లింగమును తొలగింప ప్రయత్నింప, విఫలుడై మూర్ఛపోవ, సీతమ్మ అతనిని మూర్ఛనుండి సేదదీర్చి ప్రశాంతుడిని చేసింది. అప్పుడు శ్రీరాముడు, ఆ సైకత లింగము పవిత్రురాలైన మీ అమ్మ సీతమ్మచే చేయబడినది కావున, విధివిధానముగా నవలన ప్రతిష్ఠించబడినది కావున దానిని ఎవరైనా వీసమంతైనను కదిలించలేరను తెలిపి, తనని చింతింపవద్దని నచ్చజెప్పి, హనుమ తెచ్చిన లింగమును, కూడా అక్కడనే "హనుమదేశ్వరుడ"ను పేరుతో ప్రతిష్ఠించి, నీవు తెచ్చిన లింగమును దర్శించనిదే రామేశ్వర దర్శన పుణ్యఫలము దక్కదని వరమునిచ్చెను.
సీతమ్మకు అగ్ని పరీక్ష, సేతు (బ్రిడ్జి) నిర్మాణము ఇక్కడనే జరిగాయి. విభీషణాదుల సలహా మేరకు, కట్టిన సేతువును తన ధనుస్సు యొక్క చివరతో శ్రీరాముడు దానిని ధ్వంసం చేయుటవలన ఆ ప్రాంతమునకు ధనుష్కోటి అని పేరు వచ్చింది. ఇక్కడి గంధమాదన పర్వతము అతి పుణ్య స్థలము.
ఈ రామేశ్వర క్షేత్రమును గురించి స్కాంద పురాణము ఎంతగానో వర్ణించింది. రామేశ్వర స్వామి దేవాలయము 1000 అడుగుల పొడవు, 650 అడుగుల వెడల్పు, 150 అడుగుల ఎత్తుతో, అనంతమైన శిలకళతో నిర్మింపబడింది. ఇక్కడ నందీశ్వరుడు, వెండి రథము, బంగారు గోపురములు చూడదగినవి. ఆలయం చుట్టూ 1200 స్తంభాలతో ప్రదక్షిణ మండపము నిర్మింపబడినది. ఆలయ ప్రహరీకి నాలుగు దిక్కులా నాలుగు ద్వారములున్నాయి. ఆలయములోపల 22 నూతు(తీర్థము)లున్నాయి. సముద్రము అగ్ని అను 23వ తీర్థముగా చెప్పబడుతోంది. ఉత్తర భారత యాత్రికులు తాము తెచ్చిన గంగాజలముతో రామలింగేశ్వరానికి అభిషేకము చేస్తారు. ఇక్కడి సముద్రపు ఇసుకను తీసుకువెళ్ళి గంగలో కలుపుతారు.
చరిత్ర ::
ఈ రామేశ్వరం గురించి చారిత్రకంగా చెప్పుకోదగిన విశేషాలు. ఇక్కడ ముస్లిం దండయాత్రలు లేనికారణాన, సాహితీ-సంస్కృతులు, కళలు, దేవాలయ శిల్పసంపద నేటికి చెక్కు చెదరక నిలిచి ఉన్నాయి.
దర్శనీయ స్థలాలు ::
రామేశ్వర దేవాలయం :: ద్రావిడ శిల్పశైలిలో మూడు ప్రాకారాలతో నిర్మింపబడింది. మొదటి ప్రాకారంలో రామేశ్వర స్వామి గర్భాలయం, ప్రక్కనే హనుమదీశ్వర (కాశీవిశ్వేశ్వర) ఆలయం ఉంది. రెండవ ప్రాకారంలో అమ్మవారి ఆలయం ఉంది. మూడవ ప్రాకారంలో చిత్రవిచిత్రములైన శిల్పములతో కూడిన స్తంభాలతో నిర్మించిన అద్భుతమైన ప్రపంచంలోనే అతి పెద్దదైన మంటమముంది. ఈ ప్రాకారంలో శ్రీ కోదండ రామస్వామి ఆలయం, నటరాజు, సేతు మాధవస్వామి, కోనేరు, వివిధ తీర్థాలు ఉన్నాయి. ఈ ఆలయానికి తూర్పున సముద్రము, పడమటి వైపున విశిష్టమైన గోపురాలున్నాయి.
భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం చుట్టూ గల ద్వీపాలలో 64 తీర్థాలు (పవిత్ర జల భాగాలు) ఉన్నాయి. స్కాంద పురాణం ప్రకారం, వాటిలో 24 ముఖ్యమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించడం తపస్సుతో సమానంగా భావిస్తారు పర్యాటకులు. వాటిలో 22 తీర్థములు రామనాథస్వామి దేవాలయంలోనే ఉన్నవి. 22 అనే సఖ్య రాముని యొక్క అమ్ములపొదిలో గల 22 బాణములను సూచిస్తుంది. వాటిలో ప్రధాన తీర్థం "అగ్ని తీర్థం". అది బంగాళా ఖాతం సముద్రం.
22 Theertha Snanamu
(1) Mahalaxmi theertham, (2) Savitri theeertham, (3) Gayatri theertham, (4) Sarasvati theertham, (5) Setu Madhava theertham, (6) Nala theertham, (7) Neela theertham, (8) Gavaya theertham, (9) Kavacha theertham, (10) Gandha Madhava theertham, (11) Chakra theertham, (12) Sankha theertham, (13) Brahma Hatya Pataka Vimochana theertham, (14) Surya theertham, (15) Chandra theertham, (16) Ganga theertham, (17) Yamuna theertham, (18) Siva theertham, (19) Sarva theeretham, (20) Koti theertham, (21) Satyamruta theertham, (22) Gaya theeertham.
అగ్నితీర్థం :: 23వ చెప్పబడే ఈ తీర్థము తూర్పున ఉన్న సముద్రమే. ఇక్క సముద్రము, ఒక కోనేరులా, చాలా ప్రశాంతంగా, స్నానానికి అనువుగా ఉంటుంది.
గంధమాదన పర్వతం :: ప్రధానాలయానికి 3 కి.మీ లలో ఎత్తైన పర్వతం. ఆంజనేయుడి సీతను వెదకడానికి లంకకు ఈ పర్వతముపైనుండే ఎగిరాడని, శ్రీరాముడు ఇక్కడి నుండే వానర సైన్యాన్ని లంకకు నడిపించాడని అంటారు. ఈ పర్వత శిఖరం నుండి రామేశ్వర సుందర దృశ్యాలను చూదచ్చు.
హనుమాన్ ఆలయం :: ఈ పర్వత సమీపంలో ఉంది. హనుమంతుడు లంకనుండి వచ్చి సీతమ్మ సంగతులను శ్రీరామునికి ఇక్కడనే చెప్పాడంటారు.
విలోంది తీర్థం :: సీతకోసం రాముడు బాణంతో ఏర్పరచాడట. నీరు తియ్యగా ఉంటుంది. ఇది ప్రధాన ఆలయానికి 7 కి.మీ. దూరంలో పాంబన్ కు వెళ్ళే త్రోవలో ఉంది. ఇక్కడున్న రామాలయాన్ని 'ఏకాంత రామమందిరం' అంటారు.
పాంబన్ బ్రిడ్జి :: ప్రధాన ఆలయానికి 12 కి.మీ.ల దూరంలో రామేశ్వర ద్వీపాన్ని భారత భూభాగంతో కలుపుతోంది. దీని పొడవు 2.2 కి..మీ.
ధనుష్కోటి :: రామేశ్వరానికి 18 కి.మీ. దూరంలో 1964లో వచ్చిన తుఫానుకు కొట్టుకుపోగా కోదండ రామస్వామి ఆలయం మాత్రమే నిలిచింది. ఇది బంగాళాఖాతం, హిందూమహాసముద్రం కలిసే చోటు.
ఇతర దర్శనీయ ప్రదేశాలు :: నాయకి అమ్మన్, భద్రకాళి, పంచముఖ ఆంజనేయ, కోదండ రామాలయాలు, జఠాయుతీర్థం, విభీషణాదులు ప్రతిష్ఠించిన అనేక శివలింగాలను చూడవచ్చు.
స్కాందపురాణము - బ్రహ్మఖండము - సేతు మహాత్మ్యము - 48 వ అధ్యాయంలో రామేశ్వరము, సేతువు, ధనుష్కోటి ల గురించి ఎంతగానో మరియు వివరంగా వర్ణింపబడింది. ధనుష్కోటి గురించి స్కాందపురాణములో ::
శ్లో.
దక్షిణాంబునిధే పుణ్యే రామసేతా విముక్తిదే |
ధనుష్కోటి రితిఖ్యాతం తీర్థయస్తి విముక్తిదం ||
బ్రహ్మహత్యా సురాపాన స్వర్ణస్తేయ వినాశనం |
గురుతల్పగ సంసర్గ దోషాణామపి నాశనం ||
కైలాసాది పదప్రాప్తి కారణం పరమార్థదం |
సర్వకామమిదం పుంసామృణ దారిద్ర్య నాశనమ్ ||
ధనుష్కోటి ర్ధనుష్కోటి ర్ధనుష్కోటిరితీరణాత్ |
స్వర్గాపవర్గదం పుంసాం మహాపుణ్య ఫలప్రదం ||
ఇట్లా ఎంతగానో శ్లాఘించింది. అట్లే వాల్మీకి కూడ ఈ రామేశ్వర క్షేత్రము, తీర్థములు, ధనుష్కోటి, గంధమాదన పర్వతాది విషయములను, వాటి మహాత్మ్యమును చాలా విపులంగా వివరించింది.
రైలు మార్గము:
హైదరాబాదు / విశాఖపట్నం / విజయవాడ - చెన్నై - విల్లుపురం - మైలాదుతురై - తంజావూర్ - తిరుచ్చి - కరుక్కుడి - మదురై - రామనాథపురం - రామేశ్వరం.
సమీప విమానాశ్రయం: మదురై.

ద్వాదశ జ్యోతిర్లింగాలు – 8. నాగనాథ జ్యోతిర్లింగము (నాగేశ్వరుడు) - ద్వారక-గుజరాత్ / సౌరాష్ట్ర దేశం
శ్లో.
యామ్యే సదంగే నగరేతి రమ్యే, విభూషితాంగం వివిధైశ్చభోగైః |
సద్భక్తిముక్తి ప్రదమీశమేకం, శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే ||
దక్షిణ దిక్కున (యామ్యే) ఉన్న అతి రమ్యమైన నగరములో అనేక పడగలతో అలంకరింపబడిన శరీరమును కలిగి, మంచి భక్తి ముక్తులను ఇచ్చు నాగనాథుని శరణుపొందుచున్నాను.
ఇక్కడి అమ్మవారిపేరు నాగేశ్వరి.
పురాణగాధ (శివ పురాణము నుండి)
ఒకప్పుడు దారకుడనే రాక్షసుడు దారుక అను తన భార్యతో పశ్చిమ తీరములో పదహారు యోజనముల వనమును సకల వసతులతో నిర్మించుకొని సుఖముగా ఉండేవారు. ఆ వనమును దారుకావణమని పిలిచేవారు. దారుక దేవీ భక్తురాలు కావున తపస్సు చేసి వారములు పొంది, వారి నివాసమైన ఆ వనమును వారు ఎక్కడకు వెళ్ళాలనిపిస్తే అక్కడు తీసుకొని పోతుండేవారు. వరగర్వముతో యజ్ఞ-యాగాదులను ధ్వంసము చేయుట, ప్రజలను హింసించుట మొదలగునవి చేసేవారు. ఈ బాధలు భరించలేక, వారు ఔర్వ మహర్షి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ద్రవించిన ఆ మహర్షి "భూమిపైగల మునులను, ప్రజలను హింసిస్తే ఆ రాక్షసులు వెంటనే నశిస్తారు" అని శపిస్తారు.
ఆ విషయము తెలిసిన రాక్షసదంపతులు వారి వనమును సముద్రములో స్థాపించుకొని, సముద్రముపై ప్రయాణించు వారిని హింసించ మొదలుపెట్టారు. ఓడలను కొల్లగొట్టడము, ప్రయాణికులను బందించి హింసించడము చేయడంవలన ఆపద యెప్పుడు వస్తుందో అని ప్రయాణికులు భయముతో గడగడలాడేవారు.
ఒకరోజు అలా రాక్షసదంపతులకు చిక్కిన ఓడలో వ్యాపారులను, సరంగులను, ఇత పనివారిని బందించారు. వారిలో 'సుప్రియుడు' అనే వైశ్యుడు గొప్ప శ్వభక్తుడు కావున, వచ్చిన ఆపదకు చింతించక, ఎప్పుడు శివ ధ్యానములో ఉండేవాడు. అతనిని చూసి, ఇతరరులు కూడ ఈశ్వర నామ జపం, ధ్యానం, భజనలు చేయడం మొదలు పెట్టారు. కాపలా రాక్షసులు ఎంతచెప్పినా వినకపోవడంతో, వారు ఈ విషయం రాక్షసదంపతులకు చెప్పారు. అదివిని కోపంతం అందరిని నానా హింసలు పెట్టగా, 'సుప్రియుడు' మాత్రము అదేమీ పట్టించుకొనక, శివనామమందే ఆనందించసాగాడు. ఉన్నట్లుండి, ఆ చెరసాల నాలుగు ద్వారములతో మధ్యన శివలింగంతో దేవాలయంగా మారిపోయింది. అది చూసిన 'సుప్రియుడు' ఆ శివలింగాన్ని కౌగలించుకొని శివనామ జపంలో తన్మయుడైనాడు. అపుడా శివలింగమునుండి శివుడు వచ్చి ఆ రాక్షసులను సంహరించి భక్తులను కాపాడి, ఇకనుండి ఈ దారుకావనం వర్ణాశ్రమ ధర్మాలతో వర్ధిల్లుతుందని వరమిచ్చాడు.
దేవీ భక్తురాలైన దారుక దేవిని ప్రార్థించి తన వంశమును కాపాడమని ప్రార్థించగా, పార్వతీ-పరమేశ్వరులకు అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దానికి సమాధానంగా, ఆ దారుకావనం ఒక యుగ కాలము రాక్షసుల ఆధీనములో ఉండేటట్లు, ఈ లోపల వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారెవరు వచ్చినా వారికి ఆపద కలుగకుండునట్లు, నాగేశ్వరుడు (నాగనాథుడు) అను పేరుతో తాను అక్కడ జ్యోతిర్లింగమై వెలసి, అర్చించిన వారికి రాజసమాన భోగభాగ్యములు కలుగునట్లు వరమిచ్చారు.
ఆ యుగాంతములో 'వీరసేనుడు' అనే రాజు అక్కడకు చేరి, భక్తితో శివుని అర్చించి, నాగేశ్వరుని ప్రసాదముగా 'పాసుపతాస్త్రము'ను సంపాదించి, దానితో దారుక రాక్షస వంశమును నాశనం చేశాడు. ఆ వీరసేనుని కుమారుడే నలచక్రవర్తి.
ఈ పవిత్ర క్షేత్రము నేడు 'నాగనాధ్', 'నాగేశ్వర్' అను పేర్లతో పిలువబడుతూ, గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ సముద్రతీరంలో 'ద్వారక'కు సమీపంలో ఒక చిన్న దీవిలో ఉన్నది.
చరిత్ర:
అంతగా చరిత్ర విశేషాలు ఏమిలాకపోయినా, చాళుక్యులు, గూర్జరులు, మొదలగువారి పాలనలో అభివృద్ధి చెందినా, ఔరంగాజేబు దాడులతో శిదిలమైనది. వర్వాతి కాలంలో భక్తుల నిరంతర కృషితో పునరుద్ధరించబడింది.
దర్శనీయ ప్రదేశాలు:
శ్రీ నాగనాథ దేవాలయము: బౌద్ధ శిల్ప రీతిలో పునర్నిర్మితమైన ఈ ఆలయం ఎంతో ఆకర్షనీయంగా ఉంటుంది. కనకేశ్వరీ దేవి ఆలయం, శ్రీ నాగనాథ తీర్థం చూడదగినవి.
గోపీతలాబ్ :: శ్రీకృష్ణ నిర్యాణము తరువాత గోపికలను దోగలు అపహరించిన స్థలమిదేనంటారు. ఇది నాగనాధ్ కు 4 కి.మీ. దూరంలో ఉంది.
ఖేట్-ద్వారక :: ఒఖ పోర్టుకు 2 కి.మీ. దూరంలో గల దీవి. ఇక్కడ ఉన్న క్రుష్ణాలయమే ఒకప్పటి శ్రీకృష్ణ నివాసమని చెప్పబదుతోంది. ఇంకా రుక్మిణీ ఆలయం, గీతామందిరం, గాయత్రీ మందిరం, ద్వారకాధీశ, స్వామి నారాయణ, సిద్ధినాధి మహదేవ మందిరాలు చూడదగినవి. ద్వారకలో హోటల్సు, వసతి సదుపాయాలు, ఆటోరిక్షా మొ. ప్రయాణ సఊకర్యాలు లభిస్తాయి.
భారతదేశంలో నాగేశ్వర జ్యోతిర్లింగములుగా ప్లువబడే దేవాలయములు:
1. ఉత్తరప్రదేశ్ లో జోగేశ్వర ఖటేర్మల్ కి 44 కి.మీ. దూరంలోను, అల్మోరాకి 90 కి.మీ. లదూరంలోను ఉన్న దేవాలయం 'నాగేశ్వర మహాదేవ. అమ్మవారి పేరు 'పుష్టీదేవి'.
2. బీహార్ రాష్ట్రంలో వైద్యనాధ్ కి 75 కి.మీ. లదూరంలో ధుంకా క్షేత్రంలోని ఈశ్వరుడు వాసుకినాథ్ లేక నాగనాధ్ అని పిలువబడుతున్నాడు.
3. మహారాష్ట్రలోని పర్లి-వైద్యనాధ్ ఆలయానికి 125 కి.మీ. ల దూరంలో ఔండా నాగనాధ్ నందలి నాగనాథలింగము కూడా జ్యోతిర్లింగమే అంటారు.
రైలు మార్గము ::
సికింద్రాబాద్ - వాడి - డోండ్ - పూనా - సూరత్ - బరోడా - అహ్మదాబాద్ - రాజ్కోట్ - జామ్నగర్ - ద్వారకా - (సముద్రం పై 17 కి.మీ.) దారుకావనం - (బస్ దారి) నాగనాధ్ - గోపీతలాబ్.
చెన్నై - విజయవాడ - వార్ధా - భుసావల్ - సూరత్ - బరోడా - అహ్మదాబాద్ - రాజ్కోట్ - జామ్నగర్ - ద్వారకా - (సముద్రం పై 17 కి.మీ.) దారుకావనం - నాగనాధ్ - గోపీతలాబ్.
సమీప విమానాశ్రయం :: జామ్-నగర్

ద్వాదశ జ్యోతిర్లింగాలు – 9. విశ్వేశ్వర జ్యోతిర్లింగము - వారణాసి (కాశీ) - ఉత్తర ప్రదేశ్
శ్లో.
సానందమానందవనే వసం తం, ఆనంద కందం హతపాప బృందం |
వారణాసీ నాథమనాథ నాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపదే ||
ఆనందముతో కూడినవాడు ఆనంద వనమనే పేరుగల వారణాసి (కాశీ) పురములో నివసించే వాడూ, ఆనందమునకు నిలయమైనవాడు, పాపసమూహాన్ని పోగెట్టేవాడూ, అనాధులైన జీవులకు నాధుడైన వాడు అయిన శ్రీ విశ్వనాథుని శరణు పొందుతున్నాను.
(వరుణ-అసి అను గంగానదీపాయలు కలసిన చోటు ఉన్న నగరం కావున దానికి వారణాసి అని పేరు వచ్చింది. ఇక్కడి అమ్మవారి పేరు విశాలాక్షి. ఈమె అష్టాదశ శక్తులలో ఒకరు కావున శక్తి పీఠము.
పురాణగాథ :: స్రుష్ట్యాదియందు పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడు ఐ భువనములను స్రుష్టింపదలచి ప్రకృతి (స్త్రీ) - పురుషుడు అను రూపములను ధరించాడు. వారిరువురు తమ తల్లిదండ్రులెవరో తెలియక విచారిస్తున్న సమహంలో, పరమేశ్వరుడు ప్రత్యక్షమై, "మీరిద్దరు తపస్సు చేసి బ్రహ్మాండాన్ని సృష్టించండి అని చెప్పగా, వారు తాము తపస్సు చేయుటకు అనువైన ప్రదేశమును ఏది అని అడిగారు. అప్పుడు పరమేశ్వరుడు అయిదు క్రోసుల పొడవు-వెడల్పు గల నగరాన్ని నిర్మిచి, పురుషునికి దగ్గరలో ఆకాశంలో నిలిపాడు. ఆ నగరమే కాశీ, ఆ పురుషుడే శ్రీ మహావిష్ణువు.
విష్ణువు సృష్టిని సంకల్పించి చాల సంవత్సరాలు తపస్సు చేయగా, అలసిన అతని శరీరంనుండి స్వేదము (చెమట) ధారాళంగా స్రవించి విశాలాకాసంలో ప్రవహించ సాగగా, ఆ విచిత్ర దృశ్యాన్ని చూచి విష్ణువు ఆశ్చర్యంతో తల ఊపాడు. అప్పుడాతని చెవినుండి మణులతో కూడిన కర్ణాభరణం జారి పడి 'మణికర్ణిక' తీర్థమయింది. శ్వేద జలధారలకు కాశీనగరం మునిగి పోతుండగా, శివుడు తన త్రిశూలంతో ఎత్తి ఉంచాడు. మహావిష్ణువు తన భార్యయైన ప్రకృతితో అక్కడ నిద్రించగా, అతని నాభినుండి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. అప్పుడు ఆటను శివాజ్ణతో ఈ బ్రహ్మాండాన్ని, పదునాలుగు భువనాలను, సకల చరాచర సృష్టిని చేశాడు. ఆ తరువాత బ్రహ్మ-విష్ణాది దేవతలు శివుని స్తుతించగా, సంతుష్టుడైన పరమేశ్వరుడు వారి కోరికపై అక్కడనే విశ్వేశ్వర జ్యోతిర్లింగమై వెలిశి, ప్రళయకాలంలో కాశీనగరాన్ని తన త్రిశూలంపై నిలబెడతానని వరమిచ్చాడు.'కాశ్యాంతు మరణాన్ముక్తిః' అను సూక్తి వలన ఇక్కడ మణించిన వారు పునర్జన్మ లేకుండా మోక్షమును పొందుతారని పురాణ వచనము. (స్కాంద పురాణము - కాశీ ఖండము).
కదా కాశీం గమిష్యామి కదాద్రక్ష్యామి శంకరం |
ఇతి బ్రువాణస్సతతం కాశివాస ఫలం లభేత్ ||
ఎప్పుడు కాశీకి వెళతానో, ఎప్పుడు విశ్వేశ్వరుని దర్శిస్తానో అని మనస్సులో పదేపదే తపన పడేవారికి కాశీలో నివసించిన పుణ్యఫలం లభిస్తుంది.
చరిత్ర:
వేదవాజ్ఞమయం నుండి, ప్రపంచ నాగరికత కంటే ముందుగానే, నాగరికత పొందిన నగరముగా వేద వాజ్ఞమయానికీ, సంస్కృతికి, విజ్ఞాన భండారాలకు నిలయమైన నగరముగా ప్రసిద్ధినందినది.
మౌర్యులు, కనిష్కులు, సముద్ర గుప్తుడు, హర్షవర్ధనుడు, యశోవర్మ, మిహిరభోజుడు, మహీపలుడు మొ. చక్రవర్తులు విశ్వనాథుని సేవించి క్షేత్రాభివ్రుద్ధికి కృషిచేసారు. కాశీ విశ్వనాథుడు కూడా హిందువులకు ప్రాణప్రదుడు అగుటచేత, ఈ ఆలయానికున్న భోగభాగ్యాలు, మడిమాన్యాలు మహారాజులకంటే గొప్పగా ఉండేది. అందుచేతనే ఈ దేవాలయం ఎన్నోసార్లు (11 వ శతాబ్ది పర్వార్థం నుండి 17వ శతాబ్ది ఉత్తరార్థం వరకు గల 600 స.లు.) ముట్టడించబడి, దోచుకోబడి, ధ్వంసము చేయబడింది. ఔరంగాజేబు విశ్వనాథ దేవాలయ విధ్వంసానికి పూనుకొని ఆలయంలోనికి ప్రవేశించగానే అక్కడ విశ్వనాథుడు అద్రుశ్యమయినాడట. దాంతో ఔరంగాజేబు విశ్వనాథ మందిరాన్ని పడగొట్టి మసీదుగా మార్చాడు. ఆ తరువాత ఇండోర్ మహారాణి 'అహల్యాబాయి'కి కలలో విశ్వనాథుడు కనబడి తానున్న ప్రదేశాన్ని చెప్పాడట. అప్పుడామె 1776లో తిరిగి ప్రతిష్ఠించి నూతన మందిరాన్ని నిర్మింపజేసింది. 19వ శతాబ్దంలో రాజా రంజిత్ సింగ్ ఆలయ శిఖరానికి బంగారు పూత పూయించాడు. అలా ఆ తరువాత చాలా మంది మహానుభావులు ఆలయ అభివృద్ధికి కృషి చేసారు.
ఈ కాశీ క్షేత్రంలోనే హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు పెట్టిన బాధలకు తట్టుకొని సత్యవాక్య పరిపాలకుడన్న పేరు పొందాడు. గౌతమ బుద్ధుడు ఇక్కడనే మొదట ధర్మ సందేశాన్ని ఇచ్చాడు. జైన మాట స్థాపకులైన పార్శ్వనాధుడు కాశీరాజు కుమారుడే. జగద్గురువు అది శంకరాచార్యులు అద్వైత మతాన్ని ప్రభోదాన్ని ఇక్కడినుండే మొదలుపెట్టి స్థాపించారు. ఇలా ఎంతో చరిత్రగల ఈ కాశీ నగరం, వారణాసి, బెనారస్ అను పేర్లతో కూడ పిలువబడుతోంది.
దర్శనీయ స్థలాలు :
ఈ కాశీనగరంలో చూడవలసినవి చాలానే ఉన్నాయి:
విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం |
వందే కాశీం గుహాం గంగం భవనీం మణికర్ణికామ్ ||
కాశీ విశ్వనాథుడు, బిందుమాధవుడు, ఢుంఢి వినాయకుడు, శ్రీ దందపాణీశ్వరుడు, కాల భైరవుడు, గుహ (ఉత్తర వాహిని గంగ), గంగానది, అన్నపూర్ణాంబ (భవాని), కాశీ విశాలాక్షి, మణికర్ణిక ఘట్టములు ప్రధానములు.
కోటిలింగాలతో అలరారుతున్న ఈ క్షేత్రములో 37 స్నాన ఘట్టములు ఉన్నాయి. వాటిలో మణికర్ణిక, దశాశ్వమేధ్, హరిశ్చంద్ర ఘాట్ లు ముఖమైనవి. ఈ నగర క్షేత్రపాలకుడు భైరవుడు. కాశీలో 84 మతములున్నాయి.
విశ్వేశ్వర-విశ్వనాథ దేవాలయం :: దీన్ని స్వర్ణదేవాలయం అని కూడ అంటారు. ఈ ఆలయ ఆవరణలోనే విష్ణాలయం, ముక్త వినాయకాలయం, భవాని ఆలయం, అన్నపూర్ణ ఆలయం, హనుమంతుడు, సత్యనారాయణ స్వామి ఆలయం, మొ. ఉన్నవి.
జ్ఞానవాపి తీర్థం :: ఔరంగాజేబు చేసిన విధ్వంసం తరువాత, ఇండోర్ రాణి అహల్యాబాయికి కలలో తానిక్కడ ఉన్నానని విశ్వేశ్వరుడు చెప్పిన చోటు (బావి).
అన్నపూర్ణాలయం :: విశ్వనాథ ఆలయానికి దగ్గరలోనే అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. అమ్మవారి చేతులలో ఆయుధాలకు బదులు, అన్నపుకుండ, గరిటె ఉంటాయి.
దుర్గాలయం :: విశ్వనాథునికి 7 కి.మీ.ల దూరంలో దుర్గాకుండ్ అనే చోట కోనేటి ఒడ్డున 18వ శతాబ్దంలో నాగర శిల్పరీతిలో నిర్మింపబడిన దుర్గాలయం. ఈ దుర్గయే కాశీక్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటుందని అంటారు.
పశుపతి నాథ దేవాలయం :: నేపాల్ లోని పశుపతి నాథ దేవాలయానికి ప్రతిరూపంగా పూర్తి కలపతో నిర్మించిన దేవాలయం.
తులసీ మానస దేవాలయం :: తులసీదాసు రామాయణాన్ని ఇక్కడే వ్రాశాడు అని అనటానికి గుర్తుగా 1964లో పాలరాతితో నిర్మించిన దేవాలయం. ఆలయ గోడల మీద రామ చరిత మానస్ లోని విశేషాలను అందంగా చెక్కారు.
ఇంకా ఇక్కడ బౌద్ధుల సారనాథ్ మందిరం, చైనవారి బౌద్ధ మందిరం, మూజియం, హిందూ విశ్వవిద్యాలయం, సంస్కృతిక విశ్వవిద్యాలయం, ఇలా ఇంకా ఎన్నో దేవాలయాలు చూడదగినవి ఉన్నాయి.
ఈ కాశీగురించి పురాణాలు, ముఖ్యంగా మత్స్య పురాణం, ఇలా చెప్పాయి:
జపధ్యాన విహీనానాం జ్ఞానవర్జిత చేతసాం |
తతో దుఃఖహతావాం చ గతిర్వారణానీన్రుణామ్ ||
తీర్థానాం పంచకం సారం విశ్వేశానందకాననే |
దశాశ్వమేధం లోలార్కం కేశవో బిందు మాధవః ||
పంచబీ తు మహాశ్రేష్ఠా ప్రోచ్యతే మణికర్ణికా |
ఏభి సితీర్థ వర్యైశ్చ వర్ణ్యతేహ్య విముక్తకం ||
జపధ్యానరహితులు, జ్ఞానవిహీనులు, దుఃఖితులు, అగువారికెల్ల కాశీనగర మొక్కటే సద్గతిదాయకమనుట సత్యము. విశ్వేశ్వరునికి పెన్నిధి (నివాసము) అయిన ఈ ఆనందకాననము పేరుగల వారణాసిలో దశాశ్వమేద ఘట్టము, లోలార్క కుండము, బిందుమాధవ క్షేత్రము, కేశవ స్వామి, మణికర్ణిక అను 5 తీర్థములు ముఖ్యములు. వీటిచే నిత్య సంయుక్తమగుటచే (ఇవి కలిసి ఉండుటచే) కాశి నగరము 'అవిముక్తము' అని చెప్పబడుతోంది.
రైలు మార్గము:
చెన్నై / విజయవాడ / వరంగల్ / హైదరాబాదు / కాజీపేట - వార్ధా - నాగపూర్ - ఇటార్సి - జబల్పూర్ - అలహాబాద్ - వారణాసి.
విజయనగరం - టిట్లాఘర్ - రాయపూర్ - నాగపూర్ - ఇటార్సి - జబల్పూర్ - అలహాబాద్ - వారణాసి.
సమీప విమానాశ్రయం :: బాపట్ పూర్

ద్వాదశ జ్యోతిర్లింగాలు – 10. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము (నాసిక్ కు 30 కి.మీ.లో త్రయంబకేశ్వరం - మహారాష్ట్ర)
శ్లో.
సహ్యాద్రిశీర్షే విమలే వసం తం, గోదావరీ తీర పవిత్ర దేశే |
యద్దర్శనాత్ పాతకమాశు నాశం, ప్రయాతి తం త్ర్యంబకమీశ మీడే ||
నిర్మలమైన సహ్యపర్వత శిఖరం మీద, గోదావరి తీర ప్రదేశంలో నివసిస్తూ, దర్శన మాత్రము చేతనే పాపములను పోగొట్టే త్ర్యంబకేశ్వరుని పొగుడుచున్నాను.
ఇక్కడి అమ్మవారి పేరు త్ర్యంబకేశ్వరి.
సప్తర్షులలో (గౌతముడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, అత్రి, విశిష్ఠుడు, కశ్యపుడు, జమదగ్ని) ఒకడైన గౌతమ మహర్షి తన భార్యతో అహల్యతో కలిసి సహ్య పరవతముపై గల బ్రహ్మగిరిపై తపస్సుచేసుకొంటు ఉండేవాడు. ఒకప్పుడు దేశమున భయంకరమైన కరవు పరిస్థితి ఏర్పడింది. ప్రజలు, పశుపక్ష్యాదులు త్రాగటానికి కూడ నీరులేక, పంటలులేక నానా బాధలు పడుతుండేవారు. తినడానికి లేనివారు యజ్ఞయాగాదులు ఏమిచేయగలరు? అందువలన హవిస్సులు అందని దేవతలు కూడ ఇబ్బంది పాలయ్యారు. ఆ పరిస్థితిని దయార్ద్ర హృదయుడైన గౌతముడు చూసి బాధపడి వర్షములు కొరకై వరుణదేవుని గూర్చి తపస్సుచేసి, వరుణదేవుని నుండి తాను త్రవ్విన గోతిలో ఆక్షయముగా నీరుండునట్లు వరంపొందాడు. గౌతముడు మూరెడు లోతున ఒక కుండమును త్రవ్వాడు. వరుణుని వారము వలన అది నీటితో నిండి, ఎంత వాడినను తరగకుండ నీరు నిలిచినది. అది తెలిసిన ఋషిగణములు భార్యా పిల్లలతో గౌతమ ఆశ్రమ స్థలమును చేరి పర్ణశాలలను నిర్మించుకొని తపస్సు, యజ్ఞ-యాగాదులతో కాలం వెళ్ళబుచ్చసాగారు.
గౌతముని గాయత్రీ మంత్ర ప్రభావముతో సద్యోజాత ఫలితముగా విత్తనము వేసిన వెంటనే మొక్క మొలచి కాపు కాచేవి. అందువలన, తన దగ్గర చేరినవారందరికి కరువు బారిన పడనీయకుండా కాపాడేవాడు మరియు దేవతలకు క్రమం తప్పకుండా హవిస్సులు అందుతూ ఉండేవి. దేవతలు గౌతముని దయార్ద్రభావానికి, తపోప్రభావానికి మెచ్చుకొనుట తోటివారు అసూయచెంది, గౌతముని ఎలాగైన కించపరచాలని యెంచి, ఒక అవును సృష్టించి గౌతముడు వేసిన పంటపొలము పైకి పంపగా, అది పంటను తినుట చూసి, గౌతముడు ఒక దర్భ (గడ్డి) పుల్లతో ఆ అవును బయటకు తోలుటకు అదిలింప ప్రయత్నింప ఆ ఆవు చనిపోయింది. దాంతో వారు గౌతమునికి గోహత్య పాపమంటినదనీ, దానిని నివారించుకొనుటకు గిరిప్రదక్షణములు చేయుచు, ఇష్వరునికై తపస్సు చేసి, ఆ ప్రదేశమునందు ఒక నది ప్రవహించునటుల జేసిన ప్రాయశ్చిత్తముగునని చెప్పిరి. వారి మోసమును గ్రహించిన గౌతముడు, ఆ సహ్యాద్రి పర్వతమునకు ప్రదక్షిణములు చేయుచు, ఈశ్వరునిఐ తపమాచరించెను. నిస్వార్థపూరితమైన గౌతముని తపస్సుకు మెచ్చి, తనక్కడ జ్యోతిర్లింగమై వెలిసాడు మరియు దివ్యగంగ నదిగా ఇక్కడ ప్రవహిస్తుంది, ఇంకా అది గౌతమి అను పేరుతో పిలువబదుతుందని, గోహత్య నివారణకు తపస్సు చేయుటవలన, గోదావరి అను పేరున కూడా పిలువబడుతుందని వరములిచ్చాడు. తనని మోసముచేసిన వారిని శిక్షిస్తానని శివుడు అనగా, వారిని క్షమించమని గౌతముడు కోర, అతని విశాల మరియు ఔదార్య బుద్ధిని మెచ్చుకొని, గౌతముడు సప్తర్షులలో ఒకనిగా వెలుగొందుదువని ఆశీర్వదించుతాడు. అప్పుడు, గౌతముడు, తనని పలు కష్టముల పాలుజేసిన వారిని పిలిచి శపించబోగా, వారు తమ తప్పు తెలిసికొని, శరణు వేడగా, గౌతముడు జాలిపడి, ప్రతి నిత్యమూ తమ తమ విధులను క్రమం తప్పకుండా నెరవేర్చుమని, గాయత్రని ఉపాసించమని బోధించి, వారిని ఊరడించి, వదిలివేసెను. నాటినుండి గౌతముడు తపస్సుచేసిన ప్రాంతమున వెలిసిన జీవునికి త్రయంబకేశ జ్యోతిర్లింగమని, అక్కడినుంచి ప్రారంభమైన నదికి గొదావర లేక గౌతమి అను పేర్లు వచ్చాయి.
ఇక్కడికి దగ్గరలో గల పంచవటియందు శ్రీరాముడు సీతాలక్ష్మణులతో వనవాసమునకు వచ్చి నివసించినట్లు చెబుతారు. ఇక్కడనే రామ కుండము, లక్ష్మణకుండమను పేర్లతో రెండు కుండములు ఉన్నాయి. సీతాకుందమను పేరుతోకూడా మరొక కుండము కలదు. దీనినే అహల్యాకుండమని, శారంగపాణి కుండమని కూడా వ్యవహరిస్తారు. సీతమ్మ తల్లిని రావణుడు ఇక్కడినుండియా అపహరించాడని, రామాయణం - పంచబటిలో వరుణానది ఒడ్డునగల ఇంద్రకుండములో స్నానము చేయుటచేత గౌతముని శాపమువలన ఇంద్రుని శరీరమున ఏర్పడిన వేలదిక్షిద్రముల (కన్నముల) వలన ఇంద్రుడు పూతాత్ముడయ్యెనని పురాణగాధ. ఇక్కడ గల అంచజాద్రి శిఖరమున ఆంజనేయుడు పుట్టాడని పురజనుల నమ్మకం.
చరిత్ర ::
త్ర్యంబక క్షేత్రమును గూర్చి చెప్పుకోవలసినంతటి విశేషాలేమీ లేవు. మరాఠా రాజ్యాన్ని పరిపాలించిన అనేకమంది రాజులు ఈ క్షేత్రాభివ్రుద్ధికి పాటుపడ్డారు. పీష్వా బాలాజీ బాజీరావు అనే రాజు త్ర్యంబకేశ్వరునికి ఆలయం కట్టించి ఈ క్షేత్రాభివృద్ధికి ఎంతో కృషి చేసాడు.
దర్శనీయ స్థలాలు ::
1. బ్రహ్మగిరిపై త్రిమూర్త్యాత్మకమనుటకు గుర్తుగా మూడు కునులతోనున్నా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము
2. గంగా ద్వారము
3. పావన కుండము
4. గౌతమ మహర్షి, అహల్యల పూజలందుకొన్న 108 శివలింగములున్న గుహ
5. సీతా-రామ-లక్ష్మణ ధనుష్కుండములు
6. సూర్య-చంద్ర-అశ్వనీ-హనుమత్కుండములు
7. పేష్వా కుండమున్న స్థలమున గోదావరి నదిలో వరుణ, సరస్వతి, గాయత్రి, సావిత్రి మరియు శ్రద్ధా అను అయిదు నదులు కలియుట.
8. ఖండోబా కుండము.
9. ఒక కుండము.
10. వైశంపాయన కుండము.
11. ఇంద్ర కుండము.
12. ముక్తేశ్వర కుండము. 13. మెదాతిథి
14. కోటి-అహల్య సంగమ తీర్థములు.
మందిరములు ::
15. గోదావరి మందిరము (గోదావరి పుష్కర సమయమున 12 సం.ల కొకసారి మాత్రమే తెరువబడి ఒక సంవత్సరం పాటు పూజలు నిర్వహింపబడతాయి).
16. బాణేశ్వర లింగము.
17. గణేశుడు.
18. శివుడు.
19. దేవి.
20. సూర్యుడు
21. విష్ణువు
22. శ్రీ కపాలేశ్వర మందిరం.
23. సంగమేశ్వరుడు
24. కనకేశ్వరుడు
25. కపోతేశ్వరుడు
26. త్రిభువనేశ్వరుడు
27. శ్రీవిసంధ్యా దేవి
28. కృష్ణ మందిరము.
ఊరిలోపల
29. లక్ష్మీ నారాయణ
30. శ్రీ రామ
31. పరశురామ
32. ఇంద్రేశ్వర
33. త్రిసంధేశ్వర
34. కాంచనేశ్వర
35. జలేశ్వర
36. బల్లాలేశ్వర
37. గౌతమేశ్వర
38. రామేశ్వర
39. ముకుందేశ్వర
40. కాశీ విశ్వేశ్వర
41. భువనేశ్వరీ త్రిభువనేశ్వర
42. గాయత్రీ
43. నీలాంబికా దేవి (పరశురాముని తల్లియగు రేణుకాదేవి అని చెబుతారు)
44. నీలకంఠేశ్వర
45. వరాహగుహ (సీతా-రామ-లక్ష్మణుల విగ్రహములు ఉన్నవి)
46. శ్రీ గోరఖ్ నాధుడు
భక్త జ్ఞానేశ్వరుని పెద్ద సోదరుడు శ్రీని వ్రుత్తినాధుడు ఈ క్షేత్రమున తపస్సు చేశాడట.
ఈ క్షేత్రమున ఆలయములకు దగ్గరలో వివిధ అంగడులు, ధర్మశాలలు, హోటళ్ళు ఉన్నాయి. అన్ని సదుపాయములు, వాహనము సౌకర్యములు లభిస్తాయి.
రైలు మార్గము:
చెన్నై / విజయవాడ - వరంగల్ - వాడి - షోలాపూర్ - పూనా - ముంబై - కళ్యాణ్ - నాసిక్ రోడ్ - త్రయంబక్.
హైదరాబద్ - ఖాజీపేట్ - వాడి - షోలాపూర్ - పూనా - ముంబై - కళ్యాణ్ - నాసిక్ రోడ్ - త్రయంబక్.
ఢిల్లీ - ఇటార్సీ - భూసవాల్ - జల్గాన్ - మన్మాడ్ - నాసిక్ రోడ్ - త్రయంబక్.
విజయవాడ - రాజమండ్రి - విశాఖపట్నం - విజయనగరం - రాయపూర్ - నాగ్పూర్ - అకోలా - భూసవాల్ - జల్గాన్ - మన్మాడ్ - నాసిక్ రోడ్ - త్రయంబక్.
సమీప విమానాశ్రయము - ఓఝూడ్
ద్వాదశ జ్యోతిర్లింగాలు 11. కేదారేశ్వర జ్యోతిర్లింగము (కేదార్నాథ్, ఉత్తర ప్రదేశ్)
శ్లో.
మహాద్రి పార్శ్వేచ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్ష మహోరగొద్యై, కేదారమీశం శివమేక మీదే ||
గొప్పదైన హిమవత్పర్వతము ప్రక్కన కొండ చరియ సమీపమున ఎల్లప్పుడు మునులచేత, దేవతలచేత, రాక్షసులు, యక్షులు, నాగులు మొదలగు వారిచేత పూజింపపడుచున్న మంగళ (శివం) కరుడగు కేదారేశ్వరుని పొగడుచున్నాను.
ఇక్కడి అమ్మవారి పేరు కేదారగౌరి.
పురాణగాధ ::
శ్రీ మహావిష్ణువు అంశలు (అవతారములు) గా నరనారాయణులు ధర్మదేవతకు కుమారులుగా జన్మించి హిమాలయ పర్వతం మీద ఉన్న అత్యంత శోభాయమానమైన కేదారశిఖరమున బదరికాశ్రమములో నివసిస్తూ లోక కళ్యాణార్థమై శివుని గురించి తపస్సు చేసారు. వేకువనే పుణ్య అందియైన మందాకినిలో స్నానముచేసి, పార్థివ లింగమును నిర్మించుకొని, మందాకిని జలములతో, పవిత్రమైన బిల్వ పత్రితో, వికసించిన తామరపూలతో మిక్కి శ్రద్ధతో శివుని పూజిస్తూ ఉండేవారు. వారి భక్తికి ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమనగా, వారు "దేవా! మానవ కళ్యాణం కోసం మరియు శుభంకరం కోసం నివెల్లప్పుడు ఇక్కడనే ఉందు, నిన్ను దర్శించి, పూజించు భక్తులకు అక్షయప్రాప్తి కలిగేటట్లు వరమివ్వమని ప్రార్థించారు." అందుకనుగుణంగా పరమేశ్వరుడు, అక్కడ కేదారేశ్వర జ్యోతిర్లింగముగా వెలిశాడు.
ఈ లింగమును దర్శించి పూజించుటవలన అభీష్టములు సిద్ధించి, అచంచల శివభక్తి, మోక్షము లభిస్తాయి. కేదారేశ్వరుని భక్తులు కేదారమార్గమున మరణించిన ముక్తులగుడురని పురాణములు చెబుతున్నవి.
ఈ నరనారాయణుల తండ్రి 'ధర్ముడు' అను ధర్మమూర్తి, తల్లి దాక్షాయణి (దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఒకరు). వీరు శివుని గురించి తప్పస్సు చేస్తున్నప్పుడు, ఇంద్రుడు వారి తపమును భంగపరచ దలచి, అప్సరసలను పంప, నిష్ఠాపరులు, సత్త్వ సంపన్నులైన వారు, ఆ అప్సరసలను శపింపక, వారి అజ్ఞానమును తొలగించుటకు, నారాయణుడు తన తొడకొట్టి వారికంటే అందమైన 'మేనక' అను ఒక అప్సరసను సృష్ఠించి వారిని లజ్జితులను చేసి పంపారు.
చరిత్ర మరియు విశేషము ::
పురాణాలలో, ఇతిహాసాలలో ఈ క్షేత్రం గురుంచి వర్ణించబడింది. ఈ క్షేత్రము హిమ ప్రదేశములో ఉండుటవలన, మే నెలనుండి అక్టోబర్ నెల వరకు మాత్రమే ఈ ఆలయం తెరువబడియుంటుంది. అయితే అక్టోబర్ చివరలో గుడి తలుపులు మూసివేసే సమయంలో ఆ కేదారనధుని ముందు వెలిగించిన జ్యోతులు తిరిగి మే నెలలో తలుపు తెరిచేవరకు ఆరిపోకుండా జ్వలిస్తూనే ఉంటాయి. జ్యోతిస్వరూపుడైన ఆ పరమేశ్వరుని అస్తిత్వ ప్రభావమునకు ఇదొక మచ్చుతునక.
చుట్టుప్రక్కల చూడదగిన స్థలములు - ప్రయాణ మార్గములు ::
కేదార్నాథ్ యాత్ర హరిద్వార్ నుండి మొదలవుతుంది. హరిద్వార్ లో కన్ఖల్, చండీదేవి, మానసాదేవి, భారతమాత మందిర్, సప్తర్షి మందిరం/ఆశ్రమం, హరికిపౌడి, ఇంకా ఎన్నో దేవాలయాలు మరియు ఆశ్రమములు. ఇక ఋషికేశ్ లో ఉన్న త్రివేణీఘాట్, లక్ష్మణ ఝూల, రాం ఝూల, రామ మందిరం, లక్ష్మణ మందిరం, భరత మందిరం, శత్రుఘ్న మందిరము, ఇంకా ఎన్నో పురాతన మందిరములు, ఆంధ్రా ఆశ్రమము, కైలాస ఆశ్రమము, శివానంద ఆశ్రమము, దయానంద ఆశ్రమము, టి.టి.డి. వసతి గృహము, దానికి ఇరుప్రక్కల వెంకటేశ్వర స్వామి మరియు మల్లికార్జున ఆలయాలు, చిన్న జీయర్ స్వామి ఆశ్రమం, వశిష్ట గుహ, అరుంధతి గుహ, ఓంకారేశ్వర ఆశ్రమము, ఇంకా ఎన్నో. ఇక బదరీనాథ్, ప్రక్కనే బ్రహ్మకపాలం, బ్రహ్మ కుడం, భీమగోదా, అల్మోర, తెహ్రీ గడ్వాల్ మరియు పౌడీ గడ్వాల్, దేవ ప్రయాగ, రుద్ర ప్రయాగ, కర్ణ ప్రయాగ, విష్ణు ప్రయాగ, గుప్త కాశి, తుంగనథ్, త్రిజోగి-నారాయణం, బదరికాశ్రమము, గౌరీ కుండము, బాల గణేష్, వ్యాస గుహ, గణేష్ గుహ, భీమ్ పుల్, సరస్వతి నది, యమునోత్రి, గంగోత్రి, ఇంకా ఎన్నో, ఎన్నెన్నో.
అది శంకరాచార్య అంతర్ధానమయ్యింది ఇక్కడే. ఇప్పటికి ఆ గుహ ఉన్నది. ఆలయం వెనకాల మందాకిని నది జలపాతాలు, పాండవుల మరియు ద్రౌపది పాద చిహ్నాలు దర్శనీయములు.
హరిద్వార్-ఋషికేశ్ ల మధ్య రైలు, బస్సులు, వ్యాన్సు, టాక్సీలు, ఇంకా ఇతర రవాణా సదుపాయాలు చాలా కలవు.
ఋషీకేశ్ నుండి కేదార్నాథ్ కు సుమారు 250 కి.మీ. దూరం. మారగమధ్యములో పైన చెప్పిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. గౌరీకుండం నుంది కేదార్నాథ్ దూరం 14 కి.మీ.లు. ఇక్కడ నడక కాని, పోనీ (గుర్రం) కాని, లేల డోలీలలో గాని ప్రయాణం చేయవచ్చు. గౌరీకుండమ్ మరియు కేదార్నాథ్ మధ్యలో రామవాడి అనుకోట టీ, ఫలహారాలు దొరుకుతాయి. కేదార్ నాథ్ సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తున ఉంది. కేదార్ నాథ్ లో పూజా సామాగ్రి అమ్ము షాపులు, ధర్మశాలలు, కాటేజీలు, హోటల్సు, మొ. నవి కలవు. మొన్న వచ్చిన ఉప్పెనకు చాలమటుకు కొట్టుకు పోగా, వాటిని ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నారు. పూజారులు / పండ్ల తో స్వామిని తాకి పూజ / అభిషేకము ఏయించుకోవచ్చు.
రైలు మార్గము ::
హైదరాబాదు / చెన్నై / విజయవాడ - వరంగల్ - నాగపూర్ - ఇటార్సి - భోపాల్ - ఝాన్సీ - గ్వాలియర్ - ఆగ్రా - మథుర - డిల్లీ - మీరట్ - ముజఫర్ నగర్ - సహరన్ పూర్ - లక్సర్ - హరిద్వార్ - ఋషీకేశ్ - దేవ ప్రయాగ - రుద్ర ప్రయాగ - గుప్త కాశి - సోన్ ప్రయాగ్ - గౌరీకుండ్ - కేదార్ నాథ్.
సమీప విమానాశ్రమము :: డెహ్రాడూన్.
కొన్ని విశిష్టమైన శివ క్షేత్రాలు:
భైరవకోన ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల 'ప్రకాశం' జిల్లా కొత్తపల్లి గ్రామానికి 5 కి.మీ. నడక దూరంలో ఈ క్షేత్రము కలదు. ఎక్కడ చూసినా కోనేరులు, శివ లింగాలు కనిపించే ఈ కొనలో ఒకే రాతిలో చెక్కబడిన 8 శివాలయాలు క్రీ.శ. 7, 8 శతాభ్దాలలో నిర్మించబడినట్లు చరిత్ర. పురాణాలలో వర్ణించిన శివుడు తన 8 రూపాలకు సంకేతంగా శశినాగ, రుద్ర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భర్గేశ్వర, రామేశ్వర, మల్లిఖార్జున, పక్షఘాతక లింగాల రూపంలో దర్శనమిస్తాడు.
ధర్మస్థల ::
కర్నాటక రాష్ట్రంలో గల 'ఉడిపి' నుండి 120 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇది మంగుళూరు నుండి 75 కి.మీ. దూరంలో ఉన్నది. నేత్రావతి నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'మంజునాథేశ్వరాలయం'. క్రీ.పూ. 10వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించబడింది.ఈ ఆలయంలో అసత్యం పలికే విపత్తు కలుగుతుందనే నమ్మకం వలన కోర్టులో తెగని కేసులు స్వామి ఎదుట పరిష్కారం పొందుతారు. ఆలయంలో మూలవిరాట్ ను జైనులు ప్రతిష్ఠించారు. 800 సంవత్సరాల నుండి నిత్యాన్నదానం ఇచ్చట జరుగుతుంది.
తంజావూరు ::
తమిళనాడు రాష్ట్రంలో గల 'చెన్నై' నుండి 335 కి.మీ. దూరంలో గల 'తంజావూరు' అద్భుత క్షేత్రం. ఇచ్చటి ఆలయం పేరు బృహదీశ్వరాలయం. ఇది 10వ శతాబ్దంలో రాజరాజచోళుడు అనే చక్రవర్తిచే నిర్మించబడినది. ప్రపంచంలోని ఏ ఆలయానికి ఇంత ఎత్తయిన ప్రాకారాలు లేవని అంటారు. ఈ ప్రాకారం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు, 13 అంతస్తులుగా నిర్మించిన 216 అడుగుల ఎత్తుగల ఆలయ గోపురం పై 80 టన్నుల రాయిని శిఖరాగ్రంగా ఆ రోజుల్లో 4 మైళ్ళ దూరం నుండి ఏటవాలు రాళ్ల వంతెనపై దొర్లించుకొచ్చి నిలిపారట. ఆలయం లోపల ఎత్తయిన వేదికపై 13 అడుగుల ఎత్తుగల శివలింగం ఉంటుంది. ఆలయానికి కొంచెం దూరంలో రాజరాజచోళుని కుమారుడు నిర్మించిన గంగైకొండ చోళపురంలో శివాలయం అద్భుత శిల్పకళతో ఈ ఆలయంతో పోటీ పడుతుంది. ఈ ఆలయం 'యునెస్కో' వారిచే ప్రపంచ సంస్కృతీ చిహ్నంగా గుర్తింపు పొందినది.
దుగ్ధేశ్వరనాథ్ ::
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల 'గోరఖ్ పూర్-బటని' మార్గంలోనున్న 'గౌరీబజార్' స్టేషన్ నుండి 15 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రం రుద్రపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగము 12 జ్యోతిర్లింగాలలో ఒకటయిన ఉన్నయినిలోని మహాకాళేశ్వర లింగానికి ఉపజ్యోతిర్లింగం. ఆలయంలోని శివలింగం అప్పుడప్పుదు తనకు తానుగా కదులుతుంది. ఒక్కక్కసారి రోజంతా కదులుతుంది. హఠాత్తుగా ఆగిపోతుంది. అప్పుడు లింగాన్ని గట్టిగా పట్టీ ఉంచినప్పటికీ కదలిక లేకపోవటం ఆశ్చర్యం.
తలకాడు ::
(1)
కర్నాటక రాష్ట్రంలో గల 'మైసూర్' నుండి 60 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. కావేరీ నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'వైద్యేశ్వరాలయం'. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇసుకతో కప్పబడి 1978, 1999, 2002 సంవత్సరాలలో కార్తీకమాసం 5 సోమవారాలలో దర్శనం ఇచ్చింది. మరలా పునర్దర్శనం క్రీ.శ. 2014లో అంటున్నారు. ఈ విధంగా ఇచ్చటి లింగాకారం 12 సంవత్సరాల కొకసారి కార్తిక మాసంలో 5 సోమవారాలు పడినపుడు మాత్రమే దర్శనం ఇస్తుంది. అప్పుడు జరిగే 'పంచలింగ దర్శనం' అనే మహోత్సవానికి లక్షల కొలదీ జనం వస్తారు.
(2)
కర్ణాటక రాష్ట్రంలోని 'మైసూర్' నుండి 600 కి.మీ. దూరంలో గల క్షేత్రం 'తలకాడు'. ఈ ఆలయం పేరు 'పాతాళేశ్వరాలయం'. క్రీ.శ. 1004 వరకు పాలించిన గంగవంశ రాజుల కాలం నుండి ఈ ఆలయ ఉంది. కాల ప్రవాహంలో ఇసుకతో కప్పబడింది. పురావస్తు శాఖవారి దయ వలన బయటపడింది. నేల మట్టంకన్నా చాలా లోతుగా ఉన్న ఆలయంలోని శివలింగం ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంకాలానికి తెలుపు రంగులోకి మారుతూ కనిపిస్తుంది.
మహేశ్వర్ ::
మధ్యప్రదేశ్ రాష్త్రంలో 'ఇండోర్' నుండి 100 కి.మీ. దూరంలో గలదు ఈ క్షేత్రం. ఇచ్చటి ఆలయంపేరు 'రాజరాజేశ్వరాలయం'. పురాణాలలో 'మాహిష్మతి'గా పిలువబడే ఈ క్షేత్రం అనడు కార్తవీర్యార్జునుని రాజధాని. అయన సహస్ర బాహువులకు ప్రతీకలుగా 'సహస్రధార'గా నర్మదానది ప్రవహిస్తుంది. ఇండోర్ రాణి అహల్యాబాయి నిర్మించిన ఏకశిలా నిర్మిత ఆలయాల సముదాయం 'అహల్యేశ్వరాలయం' చూడవలసినది. అనేకమైన ప్రాచీన మందిరాలు విభిన్న దేవతలకు ఉన్నాయి. 108 దేవీ పీఠాలలఓ ఒకటైన 'స్వాహాదేవి' మందిరం ఉంది. రాజరాజేశ్వరాలయంలో పెద్ద శివలింగంతో పాటు 8 లోహాలతో నిర్మించబడిన శివపార్వతుల విగ్రహం ఉంది. వాటికీ ఎదురుగా 1000 సంవత్సరాల క్రిందటి అఖండదీపం దర్శనం ఇస్తుంది.
కోటప్పకొండ ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'గుంటూరు' నిల్లాలోని నరసరావుపేట నుండి 11 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. శివుని దక్షిణామూర్తి రూపానికి గల ఏకైక ఆలయం. కనుక ఇచ్చట అమ్మవారు ఉండరు. స్వామికి ఉత్సవాలు ఉండవు. త్రికూట క్షేత్రంలో స్వయంభూ శివలింగం. కొండమీద ఆలయం ఉంది. ఆలయం వరకు బస్సు సౌకర్యం కలదు. బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు మూడింటిమీద 3 శివాలయాలు ఉన్నాయి. వేలకొలది ప్రభలు మొక్కుబడిగా శివరాత్రికి వస్తాయి.
సురుటుపల్లి ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల 'సత్యవేడు'కు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'పల్లికొండేశ్వరాలయం'. శివశైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో గరళం త్రాగిన శివుడు పరుండి యుంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం కలదు. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హాలాహలం మ్రింగి విశ్రమించి నందున 'కాలకూటానన'క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిదురించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు.
పోండా ::
గోవా రాష్ట్ర రాజధాని 'పానాజీ' నుండి 22 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రంలో ఆలయం పేరు మంగేష్ ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠ చేయబడింది. అందమైన సరస్సు తీరానున్న ఈ ఆలయం బంగారు కలశంతో ధర్శనమిస్తుంది. ఇండో-పోర్చుగీసు-ఇస్లాం నిర్మాణ శైలీ విన్యాసాలు ఈ ఆలయంలో గోచరిస్తాయి. ప్రతి సభా మంటపం, దీప స్తంభం ఆలయ శోభను ఇనుమడింపజేస్తాయి. గర్భాలయంలో రజత తోరణం మధ్య మంగేష్ స్వర్ణ ప్రతిమ కిరీటంపై నరసింహ స్వామి ఉగ్రరూపం దర్శనమిస్తుంది. శాలువాలతో, ఆభరణాలతో, పుష్పాలతో, స్వర్ణ ప్రతిమను నిత్యం అలంకరిస్తారు. ఆలయంలోని ఈ ప్రాచీన శివలింగం క్రీ.శ. 1560 వరకు 'కుశస్థలి'లో గల ఆలయంలో పూజలందుకునేది.
ఖాట్మండు ::
(1)
నేపాల్ దేశ రాజధాని అయిన 'ఖాట్మండు' క్షేత్రంలోని ఒక ఆలయం పేరు 'విశ్వరూప మందిరం'. ఇది ప్రసిద్ధి చెందిన పశుపతినాథ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఈ మందిరానికి వెళ్ళే దారిలో ఎడమవైపున 11 శివాలయాలు ఉన్నాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణం కలిగి, గర్భాలయ, అంతరాలయాలను కలిగి ఉంది. అంతరాలయం చుట్టూ ఎత్తైన గోడ కలిగి ప్రదక్షిణానికి అనుకూలంగా ఉంది. ప్రధానాలయంలో శివుడు వేయి చేతులతో పార్వతిని ఆలింగనం చేస్తున్నట్లు సుమారు 50 అడుగు విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని ఉ. 5.00 గం.లకు, సాయంకాలం 7.00 గం.లకు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో సుమారు అరగంట మాత్రమే దర్శనం ఉంటుంది.
(2)
శివుని అష్టమూర్తి క్షేత్రాలలో యాజమాన లింగంగా ప్రసిద్ధినొందినది పశుపతినాథలింగం నేపాల్ లోని ఖాట్మండులో కలదు. నేపాల్ లోని అత్యంత పవిత్రమైన 'ఖాట్మండు' ప్రదేశం;హిందూధర్మానికి, సంస్కృతికి పట్టుకొమ్మగా నిల్చింది. ఇచ్చటి దేవత పశుపతినాథ్, అమ్మవారు గుహ్యేశ్వరి (పార్వతి). ఖట్మాడులో విరాజిల్లుతున్న ఈ జ్యోతిర్లింగం 'పశుపతి' అనే నామంతో ప్రసిద్ధి పొందినది. ఇది శివుని అష్టమూర్తులలో 'యాజమాన' మూర్తిగా కూడా కొలువబడుతున్నది. మహేశ్వరునకు ఉన్న అనేక నామములలో పశుపతి ఒకటి.
తిరువల్లం ::
తమిళనాడు రాష్ట్రంలో 'రాణిపేట'కు మరియు చిత్తూరుకు దగ్గరలో ఉంది. ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'బిల్వనాథేశ్వరాలయం'. దీనిని 5వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 1500 ఏళ్ళనాటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని విగ్రహం క్రీ.పూ. 794లో రూపొందించబడినదని శాసనం. పల్లవ రాజులు 850 బి.సి. లో గర్భగుడిపై విమాన గోపురాన్ని నిర్మించారు. చోళుల కాలంలో 1000 స్తంభాల మండపం నిర్మించబడింది. ఇక్కడ ఉన్న బిల్వవృక్షంలోని ఆకులతో శివుని విగ్రహానికి నిత్యపూజలు చేస్తారు. ఆ ఆకులను తింటే రోగాలు నయమవుతాయని స్థానికుల నమ్మకం.
నత్తరామేశ్వరం ::
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా 'అత్తిలి' నుంది 6 కి.మీ. దూరంలో గల క్షేత్రమిది. గొనని నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'రామలింగేశ్వరాలయం'. ఆలయంలోని శివలింగాన్ని పరుశురాముడు ప్రతిష్టించినట్లు చరిత్ర. ఈ ఆలయంలోని లింగం ఎప్పుడూ నీటిలో మునిగి నత్తల సంపుటితో కుడి ఉంటుంది. లింగంపై వ్రేలి ముద్రలుగా నిలువు చారలు ఉంటాయి.
కాళేశ్వరం ::
అంధ్రప్రదేశ్ రాష్త్రంలో 'కరీంనగర్' జిల్లా కేంద్రం నుండి 130 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. గోదావరి, ప్రణీత, సరస్వతుల త్రివేణీ సంగమంలో ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'కాళేశ్వరాలయం'. వేంగి రాజైన విష్ణువర్ధనుడు నిర్మించినట్లు చరిత్ర. ఇచ్చటి ఆలయంలో ఒక స్వయంభూ లింగం ముక్తీశ్వరుడు, రెండవది శివుని ఆదేశం ప్రకారం యమధర్మరాజే లింగంగా వెలిసిన కాళేశ్వరుడు అనే రెండు లింగములు ఒకే పానవట్టంపై ఉండటం విశేషం. ఈ ఆలయంలో ప్రాకారం క్రింద వివిధ దిక్కులలో వివిధమైన ఆలయాలుంటాయి. ఆలయం పరిసరాలలో ఉన్న 'యమకోణం' చూచి తీరవలసింది.
పృధుదక్ ::
హర్యానా రాష్త్రంలో కురుక్షేత్రం నుండి 50 కి.మీ. దూరంలో గణ పిహోవా స్టేషను నుండి 4 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇక్కడి ఆలయం పేరు 'సంగమేశ్వరాలయం'. దీనిని 'అరుణాయి మందిరం' అని కూడా పిలుస్తారు. భూగర్భంలో ఎంతలోతు వరకుందో తెలియని స్వయంభూ లింగం గల ఈ ఆలయం అరుణ, సరస్వతి నదుల సంగమ స్థలంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగంను చుట్టుకొని ఎప్పుడూ ఒక సర్పం ఉంటుంది. శివశక్తే అలా సర్పరూపంలో ధర్శనమిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ సర్పం ఇప్పటి వరకు ఎవరికీ హాని చేహలేదని చెబుతారు.
గార్హముక్తేశ్వర్ ::
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 'ఢిల్లీ-మొరాదాబాద్' లైనులో గల 'బ్రజ్ ఘాట్' నుండి 6 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. ఒక సిద్ధుని ద్వారా ఇచ్చటి ఆలయానికి చేరిన శివలింగం తెల్లని స్ఫటికంతో నిర్మితమై సప్త వర్ణాలను వెదజల్లుతుంది. ఏడాదికొకసారి పెద్ద శివలింగం నుండి చిన్న శివలింగం పుడుతుంది. బహు ముఖాలతో కూడిన శివలింగం నుండి అనేక భాగాలు విడివడిన సంగతి బాగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంతకు పూర్వం చిన్న లింగం వెలువడిన స్థానంలో నుండి మరొకటి బయటపడుతోంది.
శివగంగ ::
కర్ణాటక రాష్ట్రంలోని 'బెంగళూరు' నుండి 60 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చటి ఆలయం పేరు 'గంగాధరేశ్వరాలయం'. గుహలోపల ఉన్న 2-1/2 అడుగుల ఎత్తుగల శివలింగానికి పసుపుగా ఉన్న నెయ్యిని మర్దిస్తే అది చూస్తుండగానే తెల్లటి వెన్నగా మారుతుంది. కాదని తొలచి చేసిన ఓ విశాలమైన గుహలో ఉన్న ఈ శివలింగాన్ని చేరుకోవాలంటే దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాలి. అర్చన టికెట్ తో పాటే నెయ్యి కూడా ఇస్తారు. యూరోపియన్ హేతువాదులు తపదేశం నుండి (మనల్ని నమ్మక) నెయ్యిని తెచ్చి లింగానికి రుద్ది వెన్నగా మారే వాస్తవాన్ని అంగీకరించారు. ఈ వెన్నని బాధా నివారణ మందుగా వాడుతుంటారు.
కాంచీపురం ::
ఏకామ్రేశ్వరుడుగా (క్షితిలింగం) పరమశివుడు పృథ్వీలింగంగా వెలసి అనంత మహిమలతో భక్తులను తరింపజేసేదే ఈ కాంచీ క్షేత్రం. 'ఏక' అంటే ఒక, 'అమ్ర' అంటే మామిడి. ఈశ్వరుడు అంటే శివుడు. (ఏక+అమ్ర+ఈశ్వరుడు) అంటే మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి వారు గనుక ఈ స్వామికి ఏకామ్రేశ్వరుడు అనే పేరు ఏర్పడినట్లు చెప్పబడింది. ఈ ఆలయాన్ని 'పెద్దపడి' అని పిలుస్తారు. దీనినే 'తిరువేంకంబం' అని 'తిరుకుచ్చి ఏకంబం' అని 'తిరు ఆలయం' అని తమిళులు పిలుస్తారు. శివకంచి ఏకమ్రేశ్వరస్వామి ఆలయం విశాలమైన మూడు ప్రాకారాలతో, ఎత్తైన గోపురంతో అద్భుతమైన శిల్పకళావైభవోపేతంగా ఉంటుంది.
పంచరామాలు ::
ఈ పంచారామ క్షేత్రాలు ఆంధ్రరాష్ట్రంలో మూడు జిల్లాలలో వెలసినవి. అవి - గుంటూరు జిల్లాలోని అమరావతిలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోని గునుపూడి భీమవరంలో ఒకటి, పాలకొల్లులో ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలోని ఒకటి, సామర్లకోట కుమారారామ భీమేశ్వరంలో ఒకటి వెలసి భక్తుల పూజలందుకొంటున్నాయి. ఇక ఆలయ విశేషాలు పరిశీలిస్తే శివుని లింగాకృతిలో విచిత్రమైన విభేదాలు - అమరారామంలో 36 అడుగుల ఎత్తులో 9 అడుగులు మాత్రమే దర్శిస్తాము. ద్రాక్షారామంలో 14 అడుగులు, సామర్లకోటలో 12 అడుగులు ఎత్తుగల శిలింగం. భీమవరం, పాలకొల్లులో రెండడుగుల ఎత్తు ప్రమాణం గల శివలింగం దర్శిస్తాము. అమరారామంలో బాలరాముండేశ్వరి సహిత అమరేశ్వరస్వామిగాను, ద్రాక్షారామంలో మాణిక్యాంబ సహిత భీమశ్వరునిగాను, కుమారారామంలో బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరునిగాను, సోమారామంలో పార్వతి, అన్నపూర్ణసమేత సోమేశ్వరునిగానూ, క్షీరామంలో పార్వతి సహిత శ్రీరామలింగేశ్వరునిగాను పూజింపబడుతున్నారు. ఈ పంచారామ క్షేత్రాలైదింటిలోను ద్రాక్షారామానికి ప్రత్యేక విశిష్టత కలదు. ఇక్కడి అమ్మవారు మాణిక్యాంబదేవి అష్టాదశపీఠాలలో 12వ శక్తిపీఠంగాను, భీమేస్శ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ ఉపలింగంగాను ప్రసిద్ధి చెందినది.
చిదంబరం ::
పరమశివుని పంచభూతాల్లో అయిదవది, శివుని అష్టమూర్తి స్వరూపాల్లో ఒకటైనది -- ఆకాశరూపంలో కొలువుతీరిన చిదంబరం క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరానికి సుమారు 250 కి.మీ. దూరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉంది. నటరాజస్వామి ఆనంద తాండవం చేసే చిదంబరాన్ని ప్రాచీనకాలంలో తిల్లయ్-వనం, వ్యాఘ్రపురం, పొన్నాంబళం, పురియార్, పుండరీకపురం, భూలోక కైలాస్ అనే పేర్లు ఉండేవి. కాలక్రమంలో ఈ స్థలానికి చిదంబరం అనే పేరు వ్యాప్తిలోకి వచ్చి స్థిరపడింది. చిదంబరం అంటే చిత్ + అంబరం, చిత్ అంటే జ్ఞానము, అంబరం అంటే అనంతమైన ఆకాశం. చిదంబరంలో (చిత్ సభ, కనుక సభ, దేవసభ, నృత్యసభ, రాజసభ) పంచ సభలకి ప్రాధాన్యం ఉంది గనుక ఆ పేరు వచ్చింది. 'తిల్లయ్' అనే వృక్షాలు అధికంగా ఉండడం వాళ్ళ ఈ క్షేత్రానికి 'తిల్లయ్' వనం అనే పేరు వచ్చింది. ఇక్కడి అమ్మవారి పేరు "శివకామసుందరి'.
తిరువణ్ణామలై ::
'తిరు' అంటే పెద్దది, 'అణ్ణా' అంటే అగ్ని 'మలై' అంటే కొండ అని అర్థం. ఎత్తైన కొండపై వెలసిన స్వామి అరుణగిరి రూపంలో అవతరించిన శివమహాదేవుని మహిమాన్వితమైన జ్యోతిస్వరూపమే అణ్ణామలయ్యార్ స్వామి. ఇక్కడ పర్వతమే శివ స్వరూపం. ఇదికాక లింగరూపంగా ఆలయంలో కొలువున్నారు. అమ్మవారి పేరు 'అపీతకుచాంబ'. తిరువణ్ణామలై క్షేత్రం తమిళనాడులోని (ఉత్తర ఆర్కాట్ జిల్లా) ప్రస్తుతం సంబురాయర్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం తాలూకా కేంద్రం విల్లిపురం. కాత్పాడి రైలు మార్గంలో చెన్నైకి 226 కి.మీ. దూరంలో ఉంది.
శ్రీకాళహస్తి ::
శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువుగా బిల్వకావనములో సువర్ణముఖీ నదీ తీరంలో వెలిశాడు. 'శ్రీ' అంగ సాలెపురుగు, 'కాళీ' అనగా పాము, 'హస్తి' అనగా ఏనుగు, ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యమంది శివునిలో లీనమైపోయాయి. అందువలన ఇచ్చటి స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడని, ఈ పురమునకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇచ్చట అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కృతయుగంలో ఇక్కడ స్వామి వాయురూపంలో ఉండి మహాయోగులను స్పర్శ మాత్రమునే గ్రహింపదగియుండేవారట. త్రేతాయుగంలో స్వర్ణ రూపంగా, ద్వాపరయుగంలో రజిత రూపంగా, ప్రస్తుత కలియుగంలో శ్వేతశిలా రూపం పొంది తన సహజ వాయుతత్వ నిదర్శనంగా గర్భాలయంలో స్వామికి కుడి ప్రక్కనున్న దీపములను రెండింటిని ఎల్లప్పుడూ చలింపజేస్తూండటం గమనించదగినది. ఇక్కడి జగదంబ 'జ్ఞానప్రసూనాంబ'.
శీర్కాళి :: వైదీశ్వరన్ కోయిల్ ::
చిదంబరానికి, కుంభకోణానికి మధ్యలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్, శీర్కాళ్ గొప్ప క్షేత్రాలు. వైదీశ్వరన్ కోయిల్, శీర్కాలి రెందు, కేవలం 8 కి.మీ. దూరం ఉన్న ప్రక్క ప్రక్క ఊళ్ళు. వైదీశ్వరన్ కోయిల్ ఉత్తర తమిళనాడు వారికి చాలా ముఖ్యమైన పవిత్రస్థలం. ఒకానొక ముని తనకు గొప్ప జబ్బు చేయగా పరమేశ్వరుని గూర్చి ఎంతో భక్తితో తపస్సు చేయగా శంకరుడు ఒక వైద్యుని రూపంలో ప్రత్యక్షమై, అతని జబ్బు నయం చేశాడమొ స్థల పురాణం. ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికీ ఏ జబ్బు చేసినా, ఈ వైదీశ్వరునికి మొక్కుకుంటారు. ఊరు మాత్రం అతిచిన్న పల్లెటూరు. అయినా దేవాలయం మాత్రం ఎన్నడూ భక్తులతో నిండి ఉంటుంది. ఈ మధ్య ఈ ఊరికి చెందిన 'నాడీగ్రంథ' జ్యోతిష్కులు అన్నిచోట్ల వెలియడంతో ఈ ఊరికి జ్యోతిషం చెప్పించుకుంటానికి వచ్చేవారు ఎక్కువ అయ్యారు. వైదీశ్వరన్ కోయిల్ కు శీర్కాలి మధ్యదూరం కేవలం ఐదు మైళ్ళు. తమిళులందరికి శిర్కాలి చాలా పవిత్రమైన యాత్రాస్థలం. తమిళులకు ఈ దేవాలయం సంస్కృతిక కేంద్రం లాంటిది. ఈ ఊరిని గూర్చి వారందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. గొప్ప శివభక్తాచార్యుడు 'జ్ఞాన సంబంధర్' ఈ శిర్కాలిలోనే జన్మించారు. ఈ సంబందర్ పసికూనగా ఉన్నప్పుడు పార్వతీదేవి స్వయంగా తన స్తన్యమిచ్చి ఆ పిల్లవాని ఆకలి తీర్చింది. ఆ తరువాత నుంచి ఆ పిల్లవాడు అమిత జ్ఞానవంతుదై చిన్నతనం నుండే గొప్ప శివభక్తుడై శివతత్వాన్ని అందరకూ ప్రభోదిస్తూ కేవలం పదహారు సంత్సరాలు మాత్రమే జీవించి, తనువూ చాలించారు. అయితే, ఆ పదహారు సంవత్సరాల లోపునే అయన అనేక వేల కీర్తనలు రచించారు. అందులో దాదాపు నాలుగు వందల కృతులు.

No comments:
Post a Comment