తాపత్రయాలు, అవస్థాత్రయాలు
తాపత్రయాలు = 3
తాపాలు = ఆధిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక తాపములు. తాపం అంటే దుఃఖం.
తాపాలు = ఆధిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక తాపములు. తాపం అంటే దుఃఖం.
(A) ఆధిదైవిక తాపం:- అధిక వర్షం, తుఫానులు, భూకంపాలు, పిడుగులు, అగ్ని ప్రమాదాలు, సునామీలు,
వర్షాలు లేక పోవటం మొదలైన వాటి వల్ల కలిగే దుఃఖం ఆధిదైవిక తాపం.
(B)ఆధిభౌతిక తాపం:- మనుష్యులు, జంతువులు, కుక్కలు, పాములు, తేళ్ళు, పురుగులు, మృగాలు
మొ॥ న వాటివల్ల కలిగే దుఃఖం.
(C)ఆధ్యాత్మిక తాపం:- ఆది వ్యాధుల వల్ల కలిగే దుఃఖం. మనస్సుకు కలిగే ఆందోళన 'ఆధి'. దేహానికి కలిగే
జబ్బులు 'వ్యాధి' వీటి వల్ల కలిగే దుఃఖం ఆధ్యాత్మిక తాపం.
అవస్థాత్రయం: 3
అవస్థలు = జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ.
అవస్థలు = జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ.
(A)జాగ్రదవస్థ :- (మేలుకొని ఉన్న అవస్థ) - 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 4 అంతః కరణాలు(మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం) - ఈ 14 ఇంద్రియాలు పనిచేస్తూ బయట ఉండే స్థూలములైన విషయాలను మనం ఏ సమయంలో అనుభవిస్తూ ఉంటామో ఆ అసమయాన్ని
'జాగ్రదవస్థ' అంటారు.
(B)స్వప్నావస్థ:- జాగ్రదావస్థలో అనుభవించిన వస్తువులు, అనుభవాలు మనస్సులో వాసనలుగా (బీజ
రూపాలుగా) ముద్రించబడతాయి. మనం నిద్రించినప్పుడు ఇంద్రియాలు పనిచేయవు, విషయాలూ
ఉండవు. అయితే మనస్సులో ముద్రించబడిన వాసనల కారణంగా మనస్సు ఇంద్రియాలుగాను, ఇంద్రియ విషయాలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు) గాను తాత్కాలికంగా రూపాంతరం చెంది - మారిపోయి
పనిచేసి అనుభవాలు పొందే సమయం ఏదో అదే స్వప్నావస్థ.
(C)సుషుప్తి అవస్థ:- 14 ఇంద్రియాలు వాటికి అసలు కారణమైన అజ్ఞానంలో విలీనమైపోయి, అవి పనిచేయని సమయంలో; ఏ అనుభవమూ లేకుండా, ఏమీ తెలియకుండా, ఆనందంగా ఉండే సమయం
ఏదో అదే సుషుప్తి అవస్థ.
అన్ని ఇంద్రియాలు (14) పని చేస్తుంటే జాగ్రదవస్థ; ఈ 14 ఇంద్రియాలు పనిచేయక వాటి పనులు మనస్సు చేస్తే స్వప్నావస్థ; 14 పనిచేయక, ఏమీ తెలియక, ఆనందంగా ఉంటే సుషుప్తి అవస్థ.
No comments:
Post a Comment