గాయత్రి గురించి మహాత్ములు చెప్పిన విషయాలు.
వేదవ్యాస మహర్షి.
గాయత్రి మంత్రమును జపించకుండా ఇతర మంత్రములను జపించుట భోజనానికి సిద్ధంగా ఉన్న భోజనాన్ని వదిలి ఆడుక్కుని తినటం లాంటిది.శతపథ బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో 'బ్రహ్మయే గాయత్రి గాయత్రియే బ్రహ్మ' అని చెప్పబడింది.
విశ్వామిత్రుడు.
బంగారపు రంగులో ఉన్న సూర్యబింబము మధ్యలో గాయత్రీ మాతను ధ్యానిస్తూ మంత్రజపం చేసిన యడల శీఘ్రముగా జనన మరణాల నుండి ముక్తుడవుతాడు.
దేవీభాగవతము.
గాయత్రీ మోక్ష విద్య తెలుపు రంగు తేజస్సుతో ప్రకాశించి బుద్ధిని పవిత్రత చేస్తుంది. 'తత్ సవితుర్వరేణ్యం భర్గః'.
కర్మ పురాణము.
ముల్లోకాలకు జ్ఞానమును ప్రసాదించేసి గాయత్రీ దేవతయే ఆమెయే వేదమాత గాయత్రిని మించిన మంత్రము లేదు.
యాజ్ఞవల్క్యుడు.
ఓక త్రాసులో ఇటు వేదాలు ఆటు గాయత్రి మంత్రమును ఉంచి తూచినచో గాయత్రి మంత్రము వైపే త్రాసు మొగ్గును.
ఆర్ష సూక్తి.
'న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పర దైవతం'
భీష్మాచార్యులు.
ఓ ధర్మరాజా గాయత్రీ మంత్రమును విడిచి పెట్టకుండా ఏవరు జపిస్తారో వారు దుఃఖం పోందరు.
అత్రి మహర్షి భవిష్య పురాణం.
సూర్యుని ఏదుట ఏనిమిది వేలు గాయత్రీ జపం చేసిన యడల సర్వ పాపములనుండి విముక్తుడవుతాడు.
లఘు అత్రి సంహిత.
గాయత్రీ ని జపించే వారిని మాత్రమే పితృకార్యాలకి ఆహ్వానించి.
పద్మపురాణం పరాశర మహర్షి.
గాయత్రిని జపించు వారి మహాపాపాలు పాపాలు ఉపపాపాలు కూడా నశిస్తాయి.
అగ్నిపురాణం.
ఏ బ్రాహ్మడు నిత్యం ఉదయం సాయం సంధ్యలలో గాయత్రీ ఉపాసన చేస్తాడో ఆతడు ఏలాంటి దానము స్వీకరించినా దోషములు కలుగవు.
శంఖ స్మృతి.
నరక నివారణకి వేదముల ఉపనిషత్తుల సారమైన గాయత్రిని మించిన మంత్రము లేదు.
సూత సంహితా యజ్ఞవైభవ ఖండం.
అన్నముతో జలముతో సమానమైన దానము అహింసతో సమానమైన తపస్సు గాయత్రిని మించిన మంత్రము లేదు.
నారద మహర్షి.
గాయత్రీ సమస్త దేవతా స్వరూపము ఆమె ఉన్న చోట శ్రీమన్నారాయణుడు నివసిస్తాడు ఇందు సందేహము లేదు.
వశిష్ట మహర్షి.
మూర్కుడు కూడా గాయత్రిని జపించిన ఉన్నత స్తితికి వెళ్ళును.వాడు దేవతలలాగా భూమిమీద ప్రకాశిస్తాడు.
ఆదిశంకరులు.
గాయత్రి మహిమ వర్ణించ మానవ సామర్థ్యం సరిపోదు ఇదియే ఆది మంత్రంము.
🙏🙏🙏🙏🙏
అందుకే నిత్యం ఉదయం సాయంత్రం గాయత్రీ ఉపాసన చేయటం చాలా మంచిది...
🕉️అంతా శివ సంకల్పం 🕉️🕉️
No comments:
Post a Comment