Friday, June 8, 2018

ఆ శ్లోకాన్ని చదువు

ఆ శ్లోకాన్ని చదువు
బంగారం, డబ్బు వాటంతటవే మాయమౌతున్నాయి. ఇంట్లో ఉన్న చీరలు, పంచలు చిరిగిపోతున్నాయి. ఏదో దుష్టశక్తి వల్ల ఇలా జరుగుతోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ కుటుంబం ఒక మాంత్రికుణ్ణి సంప్రదించి దీనికి పరిష్కారం కనుక్కోవాలనుకున్నారు. ఆయన చెప్పినట్టుగా కొన్ని తాంత్రిక పూజలు, జపాలు చేయించారు. కాని అవేమి ఫలితాన్ని ఇవ్వలేదు. చివరికి ఆ ఇంటి పెద్ద అన్ని మంత్రస్వరూపమైన పరమాచార్య స్వామివారి దగగ్రకు వచ్చి తన బాధను చెప్పుకొన్నాడు. స్వామివారు అతని బాధనంతా శ్రద్ధగా విన్నారు.
ఆ సమాయంలో రవి అనే భక్తుడు కాస్త దూరంలో కూర్చొని, లలితా సహస్రం పారాయణ చేస్తున్నాడు. చేతి సంజ్ఞతో స్వామివారు పారాయణాన్ని ఆపమన్నారు. ఆ ఇంటిపెద్ద వైపు తిరిగి “అతను ఇప్పుడు ఏ శ్లోకాన్ని చదువుతున్నాడో అడుగు. ఆ శ్లోకాన్ని ఒక వెయ్యి సార్లు చదువు” అని ఆదేశించారు.
ఆయన వెంటనే అతని వద్దకు వెళ్ళి ఆ శ్లోకాన్ని అడిగి తెలుసుకొని, నేర్చుకొని భక్తితో ఒక వెయ్యి సార్లు పారాయణ చేశాడు. ఆ తరువాత నుండి అతని ఇంటిలో ఇక అలాంటి భయానక సంఘటనలు ఏవి జరగలేదు. బంగారం, డబ్బులు, బట్టలు అన్నీ సవ్యంగా ఉన్నాయి.
ఆ శ్లోకం ఏమిటో తెలుసుకోవాలి అని చాలామందికి కుతూహలంగా ఉంటుంది. అంతేకాక, లలితా సహస్రంలోని ప్రతి శ్లోకమూ చాలా శక్తివంతమైనదే. అవి ఫలించడానికి భక్తి, నిష్ట, నమ్మకం, సమయం అవసరం. కాని ఇప్పటికిప్పుడే శ్లోకానికి ఫలితం లభించాలి అంటే, “ఆ శ్లోకం చదువు” అనే ఆజ్ఞ మహాస్వామి వారి నుండి రావాలి. అది సాక్షాత్ ఆ లలితాంబ నుండే వచ్చినట్టు.
--- మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 1
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

No comments:

Post a Comment