Friday, June 8, 2018

బ్ర హ్మ క పా లం

బ్ర హ్మ క పా లం
=======================
"శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు.నాలుగు ముఖాలతో మంత్రోఛ్ఛారణ చేస్తున్నాడు కానీ,ఆయన ఊర్ధ్వ ముఖం పార్వతీదేవీ సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది.ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుధ్ధి చెప్పాలని చేయిచాచి ఒక దెబ్బ వేశాడు….మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా.!,దాని ప్రభావనికి బ్రహ్మ ఊర్ద్వముఖం తెగిపోయింది.కానీ కిందపడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది.అది ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు…క్రమక్రమంగా ఎండి,చివరికది,కపాలంగా మారిపోయింది….బ్రహ్మ అపరాధం చేశాడు.దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే , అది సరాసరిబ్రహ్మ హత్యగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడుకీ అంటింది.జగద్గురువు , మహాతపస్వి ఆయనకూ ఆ పాప ఫలం తప్పలేదు.దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు.'దేవాదిదేవా ! పరమజ్ఞామివి. నీకు తెలియని ధర్మం లేదు.ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి .శాసించగలవాడివి.అయినా, మాపై క్రుపతో ఒక సలహా ఇవ్వమని కోరావు.కనుక, మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము…ఈ కపాలాన్నే భిక్ష పాత్రగా భావించి ఇంటింటికీ తిరుగుతూ ప్రతిచోటా నీ పాపమేమిటో చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళూ కొంత కాలానికి ఆ పాపం తరిగిపోయు ఈ కపాలం రాలిపోవచ్చు అన్నారు దేవతలు.పరమశివుడికి అది ఉచితమనిపించింది. భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ..మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చి పరమశివా, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా !ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా ? అని అడిగాడు.
నారాయణుడంతటివాడు అడిగితే తానెలా ఇవ్వకుండా ఉండగలడు.?పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు.అప్పటినుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు.ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు.ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు.'పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. వాస్తవంగా ఇది ఆయన ఇల్లు .
ఆయన తన ఇంటికే భిక్షకై వస్తున్నాడంటే - అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట . ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్దితంగా మార్చాలి. ఇది శివక్షేత్రం. ఇందులో నేను (విష్ణువును) ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వ ముఖానిది.అంటే అది అధోలోకాలను, ఊర్ధ్వ లోకాలను అనుసంధానం చేసే ముఖం.చిరకాల శివహస్త స్పర్శవల్ల దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం.దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి.దానికితోడు నాశక్తి , శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి.'
అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే ! ఆ కపాలం కాస్తా ఊడి కిందపడి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది.
అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారియైన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది.
తమ పిత్రుదేవతలను పునరావ్రుతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గమై నిలచింది.!!!……

ఆ శ్లోకాన్ని చదువు

ఆ శ్లోకాన్ని చదువు
బంగారం, డబ్బు వాటంతటవే మాయమౌతున్నాయి. ఇంట్లో ఉన్న చీరలు, పంచలు చిరిగిపోతున్నాయి. ఏదో దుష్టశక్తి వల్ల ఇలా జరుగుతోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ కుటుంబం ఒక మాంత్రికుణ్ణి సంప్రదించి దీనికి పరిష్కారం కనుక్కోవాలనుకున్నారు. ఆయన చెప్పినట్టుగా కొన్ని తాంత్రిక పూజలు, జపాలు చేయించారు. కాని అవేమి ఫలితాన్ని ఇవ్వలేదు. చివరికి ఆ ఇంటి పెద్ద అన్ని మంత్రస్వరూపమైన పరమాచార్య స్వామివారి దగగ్రకు వచ్చి తన బాధను చెప్పుకొన్నాడు. స్వామివారు అతని బాధనంతా శ్రద్ధగా విన్నారు.
ఆ సమాయంలో రవి అనే భక్తుడు కాస్త దూరంలో కూర్చొని, లలితా సహస్రం పారాయణ చేస్తున్నాడు. చేతి సంజ్ఞతో స్వామివారు పారాయణాన్ని ఆపమన్నారు. ఆ ఇంటిపెద్ద వైపు తిరిగి “అతను ఇప్పుడు ఏ శ్లోకాన్ని చదువుతున్నాడో అడుగు. ఆ శ్లోకాన్ని ఒక వెయ్యి సార్లు చదువు” అని ఆదేశించారు.
ఆయన వెంటనే అతని వద్దకు వెళ్ళి ఆ శ్లోకాన్ని అడిగి తెలుసుకొని, నేర్చుకొని భక్తితో ఒక వెయ్యి సార్లు పారాయణ చేశాడు. ఆ తరువాత నుండి అతని ఇంటిలో ఇక అలాంటి భయానక సంఘటనలు ఏవి జరగలేదు. బంగారం, డబ్బులు, బట్టలు అన్నీ సవ్యంగా ఉన్నాయి.
ఆ శ్లోకం ఏమిటో తెలుసుకోవాలి అని చాలామందికి కుతూహలంగా ఉంటుంది. అంతేకాక, లలితా సహస్రంలోని ప్రతి శ్లోకమూ చాలా శక్తివంతమైనదే. అవి ఫలించడానికి భక్తి, నిష్ట, నమ్మకం, సమయం అవసరం. కాని ఇప్పటికిప్పుడే శ్లోకానికి ఫలితం లభించాలి అంటే, “ఆ శ్లోకం చదువు” అనే ఆజ్ఞ మహాస్వామి వారి నుండి రావాలి. అది సాక్షాత్ ఆ లలితాంబ నుండే వచ్చినట్టు.
--- మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 1
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

మహా మృత్యుంజయ మంత్రం:

మహా మృత్యుంజయ మంత్రం:
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
అర్ధం :-
అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక!
మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదండీ, పునర్జన్మ లేకపోవడం.అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగంటారా?
ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి. సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. అంటే మాయనుండి విడివడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. (జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు. ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు. పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదండీ.
ఈసరికే మీకు అర్ధమై యుంటుంది, దోసపండుతో ఎందుకు పోల్చారోనన్నది.
ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. ఆ ఆరాధన ఎలాగుండాలంటే -
జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం.
మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం. ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి. శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -
పంచభూతాత్మకుడు :- శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.
త్రయంబకుడు :- శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.
నామము :- శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు.
విభూతిదారుడు :- సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.
త్రిశూలం :- సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.
నాగాభరణుడు :- సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.
శివున్ని బోళాశంకరుడు అంటారు. ఎందుకంటే, సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాదించినవారికి వాటిని అనుగ్రహిస్తాడు. జననమరణ చక్రభ్రమణంలో పడిపోకుండా సంసారంనుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రాసాదిస్తాడు. పై మంత్రమును మామూలుగా చదివితే అకాలమృత్యువునుండి ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. అలా కాకుండా పారమార్ధిక సాధనగా గ్రహించి ఆరాదిస్తే ముక్తస్థితి లభిస్తుంది. అందుకే శివున్ని లయకారుడు అంటారు. లయకారుడు అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం.
శివుణ్ణి ఆరాధించడమంటే శివుని పటంను అలకరించి కాసేపు పూజించడం కాదు. శివుని దివ్యరూపం వ్యక్తపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక అంతరార్ధములను అవగాహన చేసుకొని ఆరాధించాలి. ఆ ఆరాధనా కూడా ఏ రీతిలో వుండాలో శివరూమే తెలుపుతుంది. సాధారణంగా శివుడు ధ్యానంలో ఆసీనుడైనట్లు దర్శనమిస్తుంటాడు. ఆ రూపం ద్వారా నిరంతరం బాహ్యప్రపంచమును కాంచే కనులను గట్టిగా కాకుండా అంటి అంటనట్లు మూసి వుంచి, దృష్టిని భ్రూమధ్యాన లగ్నం చేసి అంతర్ముఖులై సత్యంను దర్శించమన్న సూచనను గ్రహించి సాధన చేసినట్లయితే జీవుడు శివుడవుతాడు.
తన రూపం ద్వారా జ్ఞానబోధ చేస్తున్న శివమంత్రం ఎందుకు మృత్యుంజయ మంత్రమైందో ఇప్పుడు మీకు అర్ధమై వుంటుంది.
మనం తరుచుగా వింటుంటాం, మనసెరిగి నడుచుకో, చిత్రాన్ని కాదు చిత్తాన్ని చూడు, శోధించి సాదించు అన్న మాటలను.
ఇలాంటి అంతరార్ధములను తెలుసుకుంటున్నప్పుడు అర్ధమౌతుంటుంది - పెద్దలు పలికే పలుకుల్లో పరమార్ధం.

ఉపనిషత్తులు

🌸ఉపనిషత్తులు…*🌸
ఉపనిషత్తులంటే తెలియకపోయినా వేదాంతం అనే మాట ఉపయోగించని తెలుగువారంటూ ఎవరూ ఉండరు. వేదాలను మధించాగ్గా వాటి సారాంశంగా చివరగా పుట్టినవి కాబట్టి ఉపనిషత్తులు వేదాంతాలుగా పేరుపడ్డాయి. ఇవి వైదిక సాహిత్యంలోని చివరి భాగాలు. అన్ని ధర్మాలకూ వేదమే మూలం. వేదసారంగా మహోన్నత మార్గ దర్శకాలుగా వెలుగొందుతున్న జ్ఞానజ్యోతులే ఉపనిషత్తులు. సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలలాగే ఇవి కూడా వేద విజ్ఞానానికి చివరిగా లభిస్తున్నాయి. అయితే మిగిలిన విభాగాలన్నీ కర్మకాండను గురించి కూడా చెబుతాయి. కానీ ఉపనిషత్తులు మాత్రం పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. అందుకే ఉపనిషత్తులలో బోధించిన విషయాన్ని బ్రహ్మవిద్య అని కూడా అంటారు. బ్రహ్మవిద్య పరావిద్య, అపరావిధ్య అని రెండురకాలుగా ఉంది. జ్ఞానకాండ వల్ల జీవాత్మ, పరమాటం జ్ఞానంతో పాటు మోక్షం, పరబ్రహ్మ స్వరూపం తెలుస్తాయి. ఉపనిషత్ నే పదానికి సమీపంలో ఉండడం అని అర్థం. సత్యాలను తెలుసుకునేందుకు గురువు దగ్గర ఉండడం లేదా ఆత్మ (పరమాత్మ) కు సమీపంలో ఉండడం అనేవి ఈ శబ్దార్ధం వెనుక ఉన్న ఆంతరిక అర్థాలు. ఉపనిషత్తులలో జీవాత్మ, బ్రహ్మముల భావనను సునిశితంగా చర్చిచడం జరిగింది. ఈ చర్చ ఫలితంగా జీవాత్మ-పరమాత్మలు అభిన్నులు అనే అద్వైతం, జీవుడు-బ్రహ్మము వేరువేరు అనే ద్వైత భావాలకు ఆస్కారం కలిగింది. ఈ రెండు సిద్ధాంతాల ఆధారంగానే ప్రస్తుతం హైందవం అని పిలువబడే ధార్మికభావనలోని అనేక దార్శనిక సిద్ధాంతాలు ఆవిర్భవించాయి. అనేకమంది ఆచార్యులు ఉపనిషత్తుల ఆధారంగానే తమ సిద్ధాంతాలను రూపొందించి, ప్రచారంలోకి తీసుకువచ్చారు. శంకరాచార్యుల అద్వైతవాదం, రామానుజుల విశిష్టాద్వైతం, నింబార్కాచార్యుల ద్వైతాద్వైతవాదం, వల్లభును శుద్ధాద్వైతవాదం ఇలా అన్నీ ఉపనిషత్ మూలాలున్నవే.
*🌹ఉపనిషత్తుల సంఖ్య*
వేదాలలాగే ఉపనిషత్తుల సంఖ్య కూడా అసంఖ్యాకం అని కొందరి వాదన. మొదట 1008 ఉపనిషత్తులు ఉన్నట్లూ భావించగా వాటిలో 108 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నింటిలోనూ కలిపి పది ఉపనిషత్తులు ముఖమైనవిగా అధ్యయనం చేస్తారు. ఆదిశంకరాచార్యులు ప్రస్థానత్రయ భాష్యంలో పది ఉపనిషత్తులనే చెప్పారు.
ఈశ కేన కఠ ప్రశ్న ముండా మాండూక్య తిత్తిరిః
ఐతరేయం చ ఛాందోగయం బృహదారణ్యకం తథా
అనే నామసూచికా శ్లోకాధారంగా దశోపనిషత్తుల పేర్లు ఇవి:
1. ఈశోపనిషత్తు
2. కేనోపనిషత్తు
3. కఠొపనిషత్తు
4. ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్యోపనిషత్తు
7. తైత్తిరీయోపనిషత్తు
8. ఐతరీయోపనిషత్తు
9. ఛాందోగ్యోపనిషత్తు
10. బృహదారణ్యకోపనిషత్తు
*🌹ఉపనిషత్తుల కర్తలు*
ఉపనిషత్తులు ఏ ఒక్కరి రచనలో కాదు. ఎందరో ఋషులు వీటి రచనాకార్యాన్ని నిర్వహించారు. యాజ్ఞవల్క్యుడు, ఉద్దాలకుడు, అరుణి, శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాడ, సనత్కుమార, గార్గి, మైత్రేయ లాంటి ఎందరెందరో ఉపనిషత్తుల ఆవిర్భావానికి కారణమయ్యారు.
*🌹శైవ వైష్ణవ ఉపనిషత్తులు*
ఈ ఉపనిషత్తులలో కొన్నింటిని శైవులు సొంతం చేసుకోగా, మరికొన్ని ఉపనిషత్తులు వైష్ణవ ఉపనిశాట్టులుగా ప్రసిద్ధికెక్కాయి. అక్షమాలికోపనిషత్తు, అథర్వశిరోపనిషత్తు, అథర్వశిఖోపనిషత్తు, కాలాగ్ని రుద్రోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, గణపతి ఉపనిషత్తు, జాబాలోపనిషత్తు, దక్షిణామూర్తి ఉపనిషత్తు, పంచబ్రహ్మోపనిషత్తు, బృహజ్జాబాలోపనిషత్తు, భస్మజాబాలోపనిషత్తు, రుద్రహృదాయోపనిషత్తు, రుద్రాక్షజాబాలోపనిషత్తు, శరభోపనిషత్తు, శ్వేతాశ్వరోపనిషత్తు అనే పదిహేను ఉపనిషత్తులు శైవ ఉపనిషత్తులు.
వైష్ణవులకు సంబంధించిన ఉపనిషత్తులుగా చెప్పుకునే పద్నాలుగు ఉపనిషత్తులు ఉన్నాయి. అవ్యక్తోపనిషత్తు, కలిసంతరణోపనిషత్తు, కృష్ణోపనిషత్తు, గరుడోపనిషత్తు, గోపాలతాపసోపనిషత్తు, తారసోపనిషత్తు, త్రిపాద్విభూతి ఉపనిషత్తు, దత్తత్రేయాపనిషత్తు, రామతాపన ఉపనిషత్తు, రామరహస్యొపనిషత్తు, వాసుదెవ ఉపనిషత్తు, హయగ్రీవ ఉపనిషత్తు. శైవ వైష్ణవ విభాగాలే కాకుండా ఉపనిషత్తులలో మరెన్నో విభాగాలు కనిపిస్తాయి.
*🌹ఏ వేదానికి ఎన్ని?*
ఉపనిషత్తుల వేదాల సారమైన వేదాంతాలు అనుకున్నప్పుడు ఏ వేదానికి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి అనే సందేహం కలగడం సహజం. ఈ సందేహానికి 108 ఉపనిషత్తుల వర్గీకరణ కొంతవరకూ సమాధానంగా కనిపిస్తుంది. ఈ నూటఎనిమిది ఉపనిషత్తులలో వేదాల వారీ విభజన ఇలా ఉంది. ఋగ్వేదానికి 10 ఉపనిషత్తులు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదానికి 32, శుక్ల యజుర్వేదానికి 19 ఉపనిషత్తులు లభిస్తున్నాయి. సామవేదానికి 16, అథర్వణ వేదానికి 31 గా ఉపనిషత్తులు ఉన్నట్లూ కనిపిస్తుంది. ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల నుంచి ముఖ్యమైన పది ఉపనిషత్తులను ప్రధానంగా ఎంచుకున్నారు. వాటికే దశోపనిషత్తులు అని పేరు.
🙏🏻 జై శ్రీమన్నారాయణ
Siva Manasa Puja
రచన: ఆది శంకరాచార్య

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||

సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజ తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||

కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||