Thursday, November 8, 2012

ధర్మ వర్తన

ధర్మ వర్తన

మ్రుతంశరీర మ్రుత్స్యుజ్య కాష్టలోష్ట సమంక్షితౌ 
విముఖా బాంధవా యాంతి, ధర్మస్థమనుగచ్ఛతి

మనిషిలో నుండి ప్రాణవాయువు వీడిపోతే అతనికి కుటుంబ సభ్యులతో, బంధువులతో అన్ని బాంధవ్యాలు తెగిపోతాయి. వారెవ్వరూ అతనిని అనుసరించరు. మరణం  తర్వాత కూడా అతనిని అనుసరించేది అంటిపెట్టుకొని యుండేది, అతని ధర్మబద్ధమైన జీవిత సరళి మాత్రమే. అందుకే వేమన కవి: "పుట్టబట్టలేదు - చావబట్టలేదు - నడుమబట్ట నగుబాటుకాదోకో" అని అన్నాడు. అంతిమ సంస్కారములో స్నానం చేయించి నూతన వస్త్రం ధరింపచేస్తారు. సంస్కార సమయములో ఆ వస్త్రం కూడా తీసేసి దహనం చేస్తారు. కనుక నాది నాది అనుకునేది ఏదీ నీది కాదని తెలుసుకో. నీతో ఎవ్వరు రారు. నీతో ఏదీ రాదు. నీకు మారుగా ఇలలో నిలచేది నీ ధర్మ వర్తన మాత్రమె. తస్మాత్ జాగ్రత్త.  

ప్రేమతో